Guppedanta Manasu March 7th:అప్పుడే కోపం, అంతలోనే అలక, అంతులేని ప్రేమ - రిషిధార జీవితంలో ఎన్నిరంగులో!
Guppedantha Manasu March 7th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
మినిస్టర్ రిషి కి కాల్ చేసి కంగ్రాట్స్ చెబుతాడు. దేనికి అని రిషి అడిగితే వసుధారకి నీకు పెళ్లైందని తెలియగానే ఆశ్చర్యపోయాను..ఆ తర్వాత సంతోషించాను అని చెబుతారు. వసుధారకి కాల్ చేసి రమ్మని చెబితే.. రిషి సార్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పిందంటాడు. కాల్ కట్ చేసిన రిషి.. మినిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు చెప్పాలి కదా అనుకుంటాడు.
ఆ తర్వాత మహేంద్ర జగతి.. రిషికి స్టూడెంట్స్ ఇచ్చిన పోస్టర్స్ చూసి మురిసిపోతుంటారు. దీన్ని ఎక్కడ అతికించాలని మహేంద్ర అడిగితే నీ ఇష్టం అంటుంది జగతి. ఇద్దరూ కాసేపు సెటైర్స్ వేసుకుంటారు. ఇద్దరూ కలసి పోస్టర్ అతికిస్తుండగా రిషి రావడంతో..అది కనిపించకుండా అడ్డుగా నిలబడతాడు మహేంద్ర. వసుధార రాలేదు ఇంకా..మీకేమైనా చెప్పిందా అని జగతిని అడిగిన రిషితో..చెప్పలేదు రిషి అని రిప్లై ఇస్తుంది జగతి. ఇంతలో ఆ పోస్టర్ చూస్తాడు రిషి. నీకు ఇష్టంలేకపోతే తీసేద్దాం అని మహేంద్ర అంటే..వద్దులే ఉంచండి అంటాడు రిషి. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వసుకి కాల్ చేద్దామా అనుకుంటూ అంతలోనే ఆగిపోతాడు రిషి. ఇంతలో జగతినిచూసి..వసుధార కాలేజీకి ఎందుకు రాలేదు మేడం..కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అనడంతో... లోపల తనపై కొండంత ప్రేమ పెట్టుకుని బయటికి మాత్రం కోపంగా మాట్లాడుతావు రిషి అనుకుంటుంది జగతి. కాల్ చేయమని రిషి చెప్పడంతో వసుకి ఫోన్ చేస్తుంది జగతి
జగతి: కాలేజీకి ఎందుకు రాలేదు వసు..ఎండి గారు పక్కనే ఉన్నారు మాట్లాడు
వసు: కాలేజీకి రావాలనిపించడం లేదు మేడం
రిషి - జగతి: రావాలని అనిపించకపోవడం ఏంటి అని రిషి అంటే జగతి చెబుతుంది
వసు: నా సేవలు అవసరం అయ్యేవరకూ అందిస్తాను మేడం చెప్పండి
జగతి: వీళ్ల గొడవ పెద్దది అయ్యేలా ఉంది అనుకుంటూ.. రాకపోతే కనీసం మెసేజ్ పంపించాలి కదా..
రిషి: మెసెజ్ పంపిస్తారు మేడం కానీ అది మనం చదివేలోగా డిలీట్ చేస్తారు.. అందులో ఏముందో మనం ఆలోచిస్తూ పనులన్నీ పక్కన పెట్టుకోవాలి
రిషి వెళ్లిపోతాడు.. అప్పుడు జగతి..ఏంటిది వసు కనీసం ఇన్ఫామ్ చేయాలి కదా మెసేజ్ పెట్టి డిలీట్ చేయడం ఏంటి రిషి ఎంత టెన్షన్ గా ఉన్నాడో తెలుసా
వసు: రిషి సార్ కీ నా మీద ఎంత కోపమో అంతే ప్రేమ ఉంది కోపాన్ని ప్రేమ రెండింటిని భరించాలి
Also Read: భార్యభర్తలుగా రిషిధార కొత్త ప్రయాణం ఎటువైపు- ప్రేమ జ్ఞాపకాల్లో తేలిపోతున్న వసు
జగతి- మహేంద్ర ఇద్దరూ రిషి, వసుధార ల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ మంచి ప్రేమికులు వారి బంధాన్ని ఎవరు విడదీయలేరు అని మహేంద్ర కు ధైర్యం చెబుతుంది జగతి. మరొకవైపు రిషి కారులో వెళ్తూ వసుధార ఏమైంది ఎందుకు కాలేజీ రాలేదు అనుకుంటూ ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు వసుధార కూడా జరిగిన విషయాలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడ అక్కడి వచ్చిన చక్రపాణి..ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతాడు.
వసు: ఏమీ లేదు నాన్న
చక్రపాణి: జరిగినవన్నీ మన మంచికే అనుకుందామమ్మా . ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు
ఇంతలో రిషి కారు హారన్ వినిపించడంతో వసుధార సంతోషంగా బయటకు పరిగెత్తుతుంది..తూలి పడబోతుంటే రిషి పట్టుకుంటాడు.
రిషి: మెల్లగా రావొచ్చు కదా
వసు: మీరు వచ్చారు
రిషి: నేను వస్తే గాల్లో తేలుకుంటూ రావాలా ..సర్లే వెళ్దాం పద మనకు బయట పని ఉంది
వసు: నా అవతారం చూడండి ఎలా ఉన్నానో.. రెండు నిమిషాలు లోపలికి వచ్చి కూర్చోండి సార్ బయలుదేరుతాను
రిషి వసు ఇద్దరు లోపలికి వెళ్తారు.
ఆ తర్వాత దేవయాని రిషి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషి విషయం రిషి చూసుకుంటాడు నీకెందుకు అంటాడు ఫణీంద్ర.
Also Read: హోలీ శుభాకాంక్షలు, కలర్ ఫుల్ విషెస్ చెప్పేయండిలా!