News
News
వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu March 24th: తన స్థానం ఏంటో దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసు, కాలేజీలోకి ఎంటరైన కొత్త విలన్ రిషికి దొరికిపోయినట్టేనా!

Guppedantha Manasu March 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు మార్చి 24 ఎపిసోడ్

వసుకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి రిషి అక్కడే కూర్చుని నిద్రపోవడంతో రూమ్ లోంచి బయటకు వచ్చి సోఫాలో నిద్రపోతుంది వసుధార. నిద్రలేచేసరికి ఎదురుగా దేవయాని నిల్చుని ఉంటుంది
దేవయాని: ఏంటి ఇక్కడ పడుకున్నావ్..నీ స్థానం ఏంటో సరిగ్గా తెలుసుకున్నావ్
ఇంతలో జగతి వచ్చి ఏంటి వసుధార సోఫాలో పడుకున్నావు
వసు: రిషి సార్ నా గదిలో పడుకున్నారు మేడం అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడికి వచ్చాను
దేవయాని: నీ స్థానం ఇక్కడే వసుధార 
వసు: ఎవరి స్థానం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు మేడం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. నేను సోఫాలో పడుకుంటే నా స్థానం సోఫాలో అని మీరు అనుకుంటున్నారు కానీ నా స్థానం రిషి సార్ మనసులో ఉంది 
దేవయాని: చూశావా జగతి నీ కోడలికి ఎంత ధైర్యమో
వసు: అవును మేడం నాకు కోపం ధైర్యం రెండు ఎక్కువే. ఇప్పుడు మీరు ఏదో సాధించారని నేను ఏదో పోగొట్టుకున్నానని మీరు సంతోష పడకండి నాకు దక్కాల్సినవి దక్కుతాయి . ఎవరు అడ్డొచ్చినా నా దారిలో నేను వెళతాను... మా ఇద్దరి మధ్యలో ఎవరు జోక్యం చేసుకున్నా వాళ్లకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసు..కొందరి గురించి నిజాలు తెలిస్తే ఎవరి స్థానాలు గల్లంతు అవుతాయో నాకు బాగా తెలుసు  అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది 
దేవయాని: వసుధారకి కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది..
జగతి: అక్కయ్యా తను నా కోడలు ..మీ కోడలిలా ఏం చెప్పినా తలఊపే రకంకాదు..మీరు ఒకటి అంటే తను పది అంటుంది
ఇద్దరి సంగతి చెబుతాను అనుకుంటంది దేవయాని...

Also Read: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి

కాలేజీకి ధర్మరాజు ( కొత్త క్యారెక్టర్) అని స్పాట్ వాల్యుయేషన్ ఇంచార్జ్ వస్తాడు. ఆ తర్వాత స్పాట్ వాల్యుయేషన్ కి సంబంధించిన పనులు అన్ని జగతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ధర్మరాజు ఫణీంద్ర ఇద్దరు స్పాట్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి స్పాట్ వాల్యుయేషన్ దగ్గర అన్ని సరిగా జరుగుతున్నాయో లేదో అని చూస్తుండగా ఇంతలోనే అక్కడికి ధర్మరాజు వచ్చి ఎలా అయినా తప్పుచేసి ఈ కాలేజీని ఇరికించాలి వీళ్ళ పని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు.ఆ తర్వాత మాట్లాడుతూ ఉండగా అప్పుడు ధర్మరాజు ... మహేంద్ర అక్కడే పెట్టిన కీస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. జగతి వచ్చి ఒక్క నిమిషం ఇలా రా మహేంద్ర అనడంతో మహేంద్ర వెళ్లి ఆ ఫైల్స్ చూస్తూ ఉంటాడు ఆ కీస్ ఎలా అయినా తీసుకోవాలని ధర్మరాజు ప్లాన్ చేసుకుని...తన బ్యాగులో ఉన్న సబ్బుపై కీ ముద్రను తీసకుంటాడు. డూప్లికేట్ కీ తీసుకొచ్చి  వీళ్ళ పని చెప్తాను అని మనసులో అనుకుంటూ వెళ్తుండగా రిషి ఎదురుపడతాడు. ఎక్కడికి వెళుతున్నారని రిషి అడిగితే.. అరగంటలో వచ్చేస్తాను అనేసి ధర్మరాజు వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత ధర్మరాజు వచ్చి పేపర్స్ పెట్టేసి రూమ్ క్లోజ్ చేద్దామా అనడంతో సరే అని చెప్పి అందరూ కలిసి రూమ్ లోకి వెళ్తారు. పేపర్స్ ని రూమ్ లో పెట్టి సీల్ వేస్తారు. ఆ తర్వాత మహేంద్ర ఫైల్స్ చూస్తూ ఉండగా ఇంతలో జగతి రిషి వచ్చి వెళ్దాం పద అని అనడంతో మహేంద్ర సరే వెళ్దాం పద అని అంటాడు. 

Also Read: మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

వసుధార  రాకపోవడంతో అందరూ ఆలోచనలో పడతారు. అప్పుడు వసు కోసం నేను వెళ్ళొస్తాను అని జగతి వెళుతుంది. మరోవైపు ధర్మరాజు గది తాళం తీసి లోపలికి వెళ్లి కొన్ని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. గదికి తాళం వేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇంతలో జగతి అక్కడికి వచ్చి అది చూసి జగతి, వసు షాక్ అవుతారు. తాళం ఓపెన్ చేసి సీల్ పక్కన పడేసి ఉండడం గమనిస్తారు. వెంటనే వసు రిషి కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో మహేంద్ర రిషి ఇద్దరూ అక్కడికి వస్తారు. అప్పుడు గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడడంతో అక్కడ మూడు బండల్స్ లేకపోవడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు జగతి తన చేతిలో ఉన్న కీస్ కి సబ్బు అంటుకోవడంతో కీస్ కి సబ్బు అంటుకుంది అంటుంది.. ఈ పని ఎవరు చేశారో నాకు తెలుసు వెళ్దాం పదండి అంటాడు రిషి..

Published at : 24 Mar 2023 09:07 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial March 24th Episode

సంబంధిత కథనాలు

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో  గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Gruhalakshmi June 3rd: జైల్లో తండ్రిని చూసి అల్లాడిపోయిన దివ్య- కూతుర్ని తన దగ్గరకి రావద్దని చెప్పిన తులసి

Gruhalakshmi June 3rd: జైల్లో తండ్రిని చూసి అల్లాడిపోయిన దివ్య- కూతుర్ని తన దగ్గరకి రావద్దని చెప్పిన తులసి

Krishna Mukunda Murari June 3rd: మరో బాంబ్ పేల్చిన ముకుంద, షాక్లో రేవతి- మురారీ ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకునేందుకు కృష్ణ ప్రయత్నం

Krishna Mukunda Murari June 3rd: మరో బాంబ్ పేల్చిన ముకుంద, షాక్లో రేవతి- మురారీ ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకునేందుకు కృష్ణ ప్రయత్నం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్