Guppedanta Manasu July 13th : రాజు ఎక్కడున్నా రాజే , బాహుబలి - భళ్లాలదేవని గుర్తుచేసిన రిషి-శైలేంద్ర!
Guppedantha Manasu July 13th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఇన్నేళ్లకు జగతి రిషిని కలుసుకుంది. ఆ ప్రోమో ఇది...
గుప్పెడంతమనసు జూలై 13 ఎపిసోడ్ (Guppedanta Manasu July 13th Written Update)
అంతా సెమినార్ హాల్లో ఎదురుచూస్తుంటారు కానీ రిషి రాడు. పిలిచేందుకు వెళ్లిన పాండ్యన్ కూడా రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతుంటారు. జగతిమేడం-మహేంద్ర సార్ ని చూసి డిస్ట్రబ్ అయ్యారా అందుకే రాలేదా అనుకుంటుంది వసుధార. నేను వెళ్లి విశ్వంని పిలుచుకుని వస్తానంటుంది ఏంజెల్. ఇంతలో వసుధార దగ్గరకు వచ్చిన ప్రిన్సిపాల్ రిషికి కాల్ చేయమని చెబుతాడు.
వసు: అసలు మీరెందుకు వచ్చారు..మీ అబ్బాయి ఇక్కడ సంతోషంగా ఉన్నారు..మీకు అది ఇష్టంలేదా అని ఫైర్ అవుతుంది
మహేంద్ర: మా కొడుకు బావుండాలని మేం ఎందుకు అనుకోం..మాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టే వచ్చాం
వసు: అందరం కష్టపడి సెమినార్ ప్లాన్ చేశాం.. రిషి సార్ వర్క్ లో బిజీ అవడంతో హమ్మయ్య అనుకున్నాను కానీ మీరు వచ్చి మొత్తం ప్రోగ్రాం డిస్ట్రబ్ చేశారు. ఇప్పుడు ఎవరు పిలిచినా రారు
మహేంద్ర: నా కొడుకు గురించి నాకు తెలుసు..నేను వెళ్లి పిలుచుకుని వస్తానంటూ బయలుదేరుతారు మహేంద్ర
ఇంతలో వచ్చిన విశ్వనాథం మీరు గెస్టులు మీరెళ్లడం ఏంటని అంటాడు కానీ పర్వాలేదు సార్ అంటాడు మహేంద్ర...ఇంతలో రిషి సెమినార్ హాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆగలేకపోయిన మహేంద్ర ఎదురుగా వెళ్లి కొడుకుని హగ్ చేసుకుంటాడు. అక్కడున్నవాళ్లంతా షాక్ అవుతారు.
మహేంద్ర: హగ్ చేసుకుని కేవలం రిషికి మాత్రమే వినిపించేలా మాట్లాడతాడు మహేంద్ర...నువ్వు వస్తావన్న నమ్మకం నాకుంది నాన్నా అంటాడు
విశ్వనాథం: మీ ఇద్దరి మధ్యా అంత బంధం ఉందా అంతలా ఎమోషన్ అవుతున్నారు
రిషి: వీళ్లు నాకు ఆత్మీయులు..గురువుతో సమానం
విశ్వనాథం: మా అదృష్టం కొద్ది కొన్నేళ్లుగా మాతో ఉండడం మా అదృష్టం. నీలాంటి వాడిని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పు. చాలా పద్ధతిగా పెరిగాడు సార్..ఇలాంటి వాళ్లు ఈ కాలంలో చాలా అరుదు.ఎప్పుడూ సొసైటీ కోసం స్టూడెంట్స్ భవిష్యత్ కోసం పరితపిస్తుంటాడు. రిషి మాతో ఉండడం మా అదృష్టం..
జగతి: నా కొడుకును ఎవరైనా ప్రేమించాలి ఎవరైనా పొగడాలి నేనే దురదృష్టవంతురాలిని..కాలం పెట్టిన పరీక్షకు లొంగిపోయాను అనుకుని మనసులో బాధపడుతుంది. రిషి-వసుని అందరూ పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెబుతుంది జగతి.
ఆ తర్వాత సెమినార్ ప్రారంభమవుతుంది... జగతి-మహేంద్ర స్టేజ్ పైకి వెళతారు.. డోర్ దగ్గర్నుంచి ఇదంతా చూస్తున్న శైలేంద్ర కుళ్లుకుంటాడు..
Also Read: KGF బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ తో ఎమోషన్ పిండేశారు - మళ్లీ రిషిని చంపించేందుకు శైలేంద్ర కుట్ర!
రిషి స్టేజ్ పైకి వెళ్లేందుకు ఇబ్బంది పడి ఆన్ పేపర్ ఇస్తానంటాడు. ఎంత ఆన్ పేపర్ ఇచ్చినా పర్సనల్ గా మాకు వింటనే బావుంటుంది చెప్పండి సార్ అంటుంది జగతి. మిగిలిన అందరూ కూడా రిషి సార్ మాట్లాడాలని నినాదాలు చేయడంతో రిషి ఇబ్బందిగానే స్టేజ్ పైకి వెళతాడు. పవర్ ఆఫ్ స్టడీస్ గురించి అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు. విద్య ప్రాముఖ్యత, గురుశిష్యుల బంధం గొప్పతనం గురించి మాట్లాడతాడు. సీరియల్ లో సీన్ అనే విషయం పక్కనపెడితే విద్య గొప్పతనం గురించి అద్భుతంగా ఉంటుంది స్పీచ్. రిషి స్టేజ్ దిగిన తర్వాత నేను మాట్లాడతానని అడుగుతాడు పాండ్యన్. మొన్నటి వరకూ స్టేజ్ కింద ఉండి గొడవలు చేసే మేం ఈ రోజు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతున్నాం అంటే అందుకు కారణం రిషి సార్ అంటూ మొదలుపెట్టి తాము చేసిన అల్లరి గురించి మొదలుపెట్టి తనలో రిషి సార్ తీసుకొచ్చిన మార్పు ఇది అని చెబుతాడు. హాల్ మొత్తం చప్పట్లతో మోతమోగిపోతుంది. మాలో ధైర్యాన్ని నింపిన, మంచి మార్పును తీసుకొచ్చిన రిషి సార్ -వసుధార మేడంని సత్కరించాలి అనుకుంటున్నాం అంటాడు. ఆ సత్కారం మన ముఖ్య అతిథులతో చేయిద్దాం అంటాడు ప్రిన్సిపాల్.రిషి-వసు ఇబ్బందిగానే ఒప్పుకుంటారు.
Also Read: జూలై 13 రాశిఫలాలు ,ఈ 5 రాశువారి జీవితంలో సంతోషం - ఆ రాశివారిలో అత్యాశ
స్టేజ్ పై మహేంద్ర-జగతి-రిషి-వసు...అందరూ కనిపించడం కన్నులపండువగా ఉంటుంది. జగతి మహేంద్ర కలసి కొడుకు-కోడలిని సత్కరిస్తారు. శాలువా కప్పి బొకే చేతికిస్తారు. ఈ వేడకంతా మాటల్లో వివరించే కన్నా స్క్రీన్ పై చూడడం బావుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో జగతి మహేంద్రలో ఉండే ఆనందం, రిషిలో బాధ, వసుధార మొహంలో ఇబ్బంది ఎవరికి వారే తమ పాత్రలను ఎమోషన్స్ తో నింపేశారు.