అన్వేషించండి

జూలై 13 రాశిఫలాలు ,ఈ 5 రాశువారి జీవితంలో సంతోషం - ఆ రాశివారిలో అత్యాశ

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 13 గురువారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 13, 2023

ఈ రోజు సింహరాశి వారితో సహా ఈ  5 రాశుల వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది, కుంభ రాశి వారు అత్యాశను వీడాలి. మేషం నుంచి మీనం వరకూ ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి 
ఈ రోజు ఈ రాశివారి ఇంటి వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. తన మనసులోని విషయాలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. పోగొట్టుకున్న కొన్ని వస్తువును తిరిగి పొందవచ్చు. మీ ప్రజా సంబంధాల పరిధి బలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు ప్రారంభం చాలా బావుంటుంది. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.చేయాలనుకున్న పనిని చేయాలనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడొచ్చు..ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

మిథున రాశి
ఈ రాశివారికి రోజు ప్రారంభం కొంత డల్ గా ఉంటుంది. వాతావారణంలో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యాపారంలో నిరాశ ఉంటుంది. సాయంత్రానికి కొంత ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగానికి సంబంధించిన సమచారా అందుకుంటారు. ఆస్తుల క్రయ, క్రయవిక్రయాల్లో సమస్యలు తలెత్తుతాయి. అనవసరమైన పనులకు దూరంగా ఉండాలి. మీ నిర్ణయాల విషయంలో కొంచెం గందరగోళానికి గురవుతారు. మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు. వాహనంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు జాగ్రత్త.

Also Read: కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారికి ఆదాయం, పదోన్నతి!

సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు అద్భుతమైన ఫలితం పొందుతారు. మీ వ్యక్తిత్వం అందరకీ నచ్చుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

కన్యా రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. పోటీ పరీక్షలలో ఆశించిన విజయం సాధిస్తారు. మీ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. ఏ విషయానికైనా మనసులో ఉన్న టెన్షన్ తొలగిపోతుంది. వాహన సుఖం పొందుతారు.

తులా రాశి
కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రభుత్వ పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. మీరు మీ దినచర్యలో కొన్ని మెరుగుదలలు చేయవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులు మీ పట్ల సహకార వైఖరిని కలిగి ఉంటారు. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది.

Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!

వృశ్చిక రాశి

ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో పనులు చాలా తేలికగా పూర్తిచేస్తారు. రచనల పట్ల చాలా ఆసక్తిని కనబరుస్తారు. వివాహ సంబంధాలలో మధురానుభూతి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు పాత పరిచయస్తులను కలుసుకోవచ్చు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు  రాశి
ఈ రోజు ఈ రాశివారి ఇంట్లో శుభ కార్యాల నిర్వహణ గురించి మాట్లాడుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ఇబ్బందుల తర్వాత సక్సెస్ అవుతారు. ధనలాభం ఉంటుంది. వ్యాపారులు కొంచెం కష్టపడినా మంచి ఫలితాలుంటాయి. 

మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు చాలా బిజీగా ఉంటారు. నిరుద్యోగులు పలు ఇంటర్యూలకు హాజరవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మనసులో ఉన్న టెన్షన్ తొలగిపోతుంది. ఉద్యోగులు పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. 

కుంభ రాశి
ఈ రాశివారు సమయాన్ని వృధా చేయకండి. మీ పనిని ఇతరులకు అప్పగించవద్దు.  దురాశ కు దూరంగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. బంధాన్ని బలపరిచేందుకు ప్రయత్నాలు చేయండి. కొన్ని విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. 

మీన రాశి
ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్తగా ప్రారంభించే పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తంది.వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. సృజనాత్మక పనుల్లో నిమగ్నమై ఉంటారు. దూకుడు వైఖరిని అవలంబించడం మానుకోండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget