Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
Guppedantha Manasu February 8th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి, వసుధారని కలిపేందుకు మహేంద్ర వాళ్ళు టూర్ ప్లాన్ చేస్తారు. పైకి మాత్రం మహేంద్ర, జగతి వెళ్తున్నామని చెప్తారు. ఇక వాళ్ళు ఆగిపోయి రిషిని పంపించేందుకు మహేంద్ర స్కెచ్ వేస్తాడు. రిషి రావడం గమనించి కావాలనే టూర్ కి వెళ్లాలని మహేంద్ర హడావుడి చేస్తాడు. కాఫీ తాగి వెళ్దామని జగతి అనేసరికి రిషి కూడా తొందర ఏముంది కాఫీ తాగుదామని ఆపుతాడు. ధరణిని పిలిచి మూడు కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. జగతి అత్తయ్యకి రిషి కాఫీ కావాలని తీసుకురమ్మని చెప్పడం వినడానికి ఎంత బాగుందోనని ధరణి మనసులో అనుకుంటుంది.
Also Read: రాజ్ కి షాకిచ్చిన తల్లి- పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు రానన్న స్వప్న తండ్రి
ఇక ప్లాన్ స్టార్ట్ చేసేందుకు మహేంద్ర డ్రామా మొదలుపెడతాడు. కాఫీ తాగి బయల్దేరేటప్పుడు కడుపు నొప్పి నాటకం ఆడతాడు. ఓ మై గాడ్ కడుపు నొప్పి బాగా ఉందని మహేంద్ర అల్లాడిపోతునట్టు నటిస్తుంటే జగతి కూడా సపోర్ట్ చేస్తుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్దామని రిషి అంటాడు. వామ్మో వద్దు ఆ ఇంజక్షన్ కంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటా ముందు ప్రాజెక్ట్ పని ముఖ్యం వెళ్దామని అంటాడు. రిషి మహేంద్రని వద్దని చెప్పి తను వెళ్తానని చెప్తాడు. తమ ప్లాన్ వర్కవుట్ అయినందుకు లోలోపల సంతోషపడిపోతారు. ప్రాజెక్ట్ పని మీద టూర్ కి వెళ్ళడం ఇష్టం లేదు కానీ తప్పడం లేదని రిషి తండ్రి గురించి బాధపడుతూనే జాగ్రత్త చెప్పి వెళతాడు. సోరి రిషి మిమ్మల్ని కలపడం కోసం తప్పడం లేదని మహేంద్ర, జగతి అనుకుంటారు.
కాలేజ్ లో వసు జగతి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంకా రాలేదేంటని ఫోన్ చేద్దామని అనుకుంటుంది. ఇంట్లో మహేంద్ర హాయిగా పడుకుని ఎలా ఉంది మన కనోన అని అడుగుతాడు. కనోన ఏంటని జగతి బిక్కమొహం వేస్తుంది. కడుపు నొప్పి నటన అనేసరికి జగతి నవ్వుతుంది. అప్పుడే ధరణి మహేంద్ర కోసం కషాయం తీసుకుని తాగమని ఇస్తుంది. అది చూసి మహేంద్ర మొహం చిరాకుగా పెడతాడు. అవును కషాయం తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుందని జగతి కూడా ధరణికి వంత పాడుతుంది. తర్వాత తాగుతానని చెప్పి వెళ్ళమని చెప్తాడు.
Also Read: జానకిని ఇబ్బంది పెట్టేందుకు స్కెచ్ వేసిన మల్లిక- భార్యతో రామ సరసాలు
రిషి కారులో వెళ్తు ఇప్పుడు వసుధారతో ప్రయాణం చేయాలా అనుకుంటూ గతంలో తనతో కలిసి ప్రాజెక్ట్ టూర్ కి వెళ్ళిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఈ ప్రయాణంలోనైనా వసుధార ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. వసు జగతి వాళ్ళకి కాల్ చేస్తుంది కానీ కావాలని లిఫ్ట్ చేయరు. దీంతో రిషికి కాల్ చేస్తుంది కోపంగా కట్ చేస్తాడు. కాసేపటికి కాలేజ్ కి రిషి వచ్చి మేడమ్ వాళ్ళు రావడం లేదు డాడ్ కి కడుపునొప్పి వచ్చింది ఇప్పడు టూర్ ఉంటుందా అని అడుగుతాడు. ఎందుకు ఉండదు మీరు ఉన్నారుగా వెళ్దామని చెప్తుంది. వెళ్ళి కారులో వెనుక సీట్ లో కూర్చుంటుందని అనుకుంటాడు. మెడలో తాళి పడగానే మారిపోయిందా అని రిషి తిట్టుకుంటాడు.
ఇద్దరూ కలిసి కారులో కూర్చుని ఒకరిమొహం ఒకరు చూసుకుంటారు. ఏంటి సీరియస్ గా చూస్తున్నారు కాస్త నవ్వండి ఆరోగ్యానికి మంచిదని చెప్తుంది. తనకి నవ్వే మూడ్ లేదని అంటాడు. ఇద్దరూ కాసేపు గిల్లిగజ్జాలు ఆడుకుంటారు. వసు దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు దాచిపెడతావ్ నిజాన్ని అని రిషి అంటాడు. దాచినన్నాళ్ళు అని వసు చెప్తుంది. రిషి కోపంగా ఫేస్ పెట్టి కార్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే వసు కాఫీ తాగుదామని కప్ లో పోసుకుంటుంది. కానీ రిషి కారుని అటు ఇటు తిప్పుతూ గుంతలని చెప్తాడు. వసుని కాఫీ తాగనీయకుండా చేసి తర్వాత కారు ఆపుతాను అప్పుడు ఇద్దరం తాగుదామని అంటాడు.