Guppedanta Manasu August 1st: వసు హెచ్చరికలు పట్టించుకోని ఈగోమాస్టర్, శైలేంద్ర నిజస్వరూపం రిషికి తెలిసినట్టేనా!
Guppedantha Manasu August 1st: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 1 ఎపిసోడ్ (Guppedanta Manasu August 1st Written Update)
కాలేజీలో రిషిధార ఎంగేజ్మెంట్ ఫొటోస్ అతికించమని శైలేంద్ర ప్యూన్ కి చెబుతాడు..అయితే ఏదో జరగబోతోందని ఊహించి వసుధారకి కాల్ చేసి హెచ్చరిస్తాడు మహేంద్ర. ఆ తర్వాత జగతి ఆలోచనలో పడుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి రిషి దగ్గరకు వెళుతున్నానని చెప్పి.. ఇక్కడ శైలేంద్ర ఎక్కడి వెళుతున్నాడో అబ్జర్వ్ చేయమని చెబుతాడు. రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు టేకప్ చేసేందుకు అంగీకరించినట్టు జగతి చెప్పడంతో మహేంద్ర సంతోషించి...ఈ విషయం కాలేజీలో మీటింగ్ పెట్టి చెప్పు..శైలేంద్రని కూడా పిలువు అని చెప్పేసి రిషి దగ్గరు బయలుదేరుతాడు.
రిషి-వసుధార
మరోవైపు ప్రిన్సిపాల్ దగ్గర నుంచి బయటికి వచ్చిన రిషి వసుధార మెసేజ్ చూస్తాడు. వసుధారకి ఫోన్ చేసి మీరు నాకోసం వెయిట్ చేయక్కర్లేదు మీరు అనుకున్నట్లుగానే నేను మిషన్ ఎడ్యుకేషన్ టేక్ అప్ చేస్తున్నాను అని చెప్తాడు. దాని గురించి కాదు సార్ నేను మీ గురించి మాట్లాడాలి అని వసుధార ఎంత చెప్తున్నా వినిపించుకోడు. మీరు ఇంకేదైనా విషయం మాట్లాడాలి అనుకుంటే అది పర్సనల్ లైఫ్ గురించి అయి ఉంటుంది.. అయినా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాల్సిన అంత బంధం మన మధ్య లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్లిపోతాడు. వసుధార వెనుకే పరిగెడుతుంది కానీ రిషి చూడడు.
Also Read: వసుకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, సై అంటే సై అనుకున్న మహేంద్ర-శైలేంద్ర!
అటెండర్-శైలేంద్ర
మరోవైపు శైలేంద్రకి కాల్ చేసిన అటెండర్..మొత్తం సిద్ధం చేశానని రిషి పరువు పోవడం పక్కా అని శైలేంద్రతో మాట్లాడుతాడు...ఇదంతా వినేస్తుంది వసుధార. అటెండర్ కాల్ కట్ చేసిన తర్వాత అక్కడే వసుధారని చూసి షాక్ అవుతాడు. వసుధాక నిలదీసినా కానీ చెప్పడు. తిరిగి మీ పరువు పోగొడతానని హెచ్చరిస్తాడు. వాడిని చాచి కొట్టి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది..వాడి చేతిలోంచి ఫోన్ లాక్కుంటుంది కానీ అటెండర్ పారిపోతాడు. ఆ తర్వాత వసుధార ఆ పోన్ నుంచి కాల్ చేస్తుంది. అట్నుంచి శైలేంద్ర వాయిస్ విని షాక్ అవుతుంది.
వసుధార: నీ కక్ష ఇంకా తీరలేదా అయినా వదలడం లేదు. అయినా నువ్వు రిషి సర్ ని ఏమి చేయలేవు . ముందు మాట్లాడుతున్నది వసుధార అని గుర్తుపట్టలేక పోతాడు శైలేంద్ర. తర్వాత మాట్లాడుతున్నది వసుధార అని తెలుసుకొని షాక్ అవుతాడు.
శైలేంద్ర: అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎండీ సీట్ కోసమే చేస్తున్నా ..ఈ రోజు నానుంచి రిషి తప్పించుకోలేడు
వసుధార: ఆరోజు నా దగ్గర సాక్ష్యం లేదు కానీ ఈరోజు ఈ ఫోనే సాక్ష్యం ఎలాగైనా రిషి సార్ ని రక్షించుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది
శైలేంద్ర-జగతి
కాల్ కట్ చేసిన శైలేంద్ర రగిలిపోతాడు... నా నిజస్వరూపం వసుధారకి, బాబాయ్ కి అందరికీ తెలిసింది. ఇక రిషిని బతకనివ్వకూడదు.. రిషిపై అటాక్ చేయాలి..అదికూడా జగతి పిన్నికే చెప్పి చేయాలి అని వెళతాడు. ఎక్కడికి వెళుతున్నావని జగతి అడుగుతుంది
శైలేంద్ర: నీ శిష్యురాలు కయ్యానికి కాలు దువ్వుతోంది..నేను నేరుగా రంగంలోకి దిగాల్సిందే
జగతి:దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే...
శైలేంద్ర: మీ శిష్యురాలు కూడా ఇలాగే మాట్లాడింది అయినా ఏం చేస్తానో చూస్తూ ఉండండి. అయినా ఆడపిల్ల ఏం చేస్తుంది
జగతి: నువ్వు పరిచయం అయిన మొదటి రోజు ఏం జరిగిందో మరిచిపోయావా( క్యాబ్ యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతున్న శైలేంద్రని ఆపుతుంది వసు)
శైలేంద్ర: ఆల్రెడీ ప్లాన్ అమలైపోయింది రేపటికల్లా నాకు గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర.
ఈ మొత్తం విషయాన్ని మహేంద్రకి కాల్ చేసి చెబుతుంది జగతి. రానీ వాడిక్కడికే కదా రావాలి.. రిషిని ఏం చేయాలన్నా నన్ను దాటుకునే చేయాలి. అలా జరగనివ్వను రిషి ని ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర.
ఇంతలో వసుధార మహేంద్ర కి ఫోన్ చేసి అటెండర్ సంగతి అంతా చెప్తుంది. దాంతోపాటు రిషి సర్ నా మాట వినిపించుకోలేదని చెప్తుంది. నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర.
Also Read: కాలేజీ గోడలపై రిషిధార ఎంగేజ్మెంట్ ఫొటోస్, ఈగోమాస్టర్ విశ్వరూపం!
ఫ్లెక్సీలు చూసిన రిషి
మరోవైపు రిషి ఫ్లెక్సీలు దగ్గరికి వెళ్లి కాలేజ్ ఫ్లెక్సీలు గురించి మాట్లాడుతూ ఉంటే ఫ్లెక్సీలు అతను ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా అని తన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపిస్తాడు. షాక్ అవుతాడు రిషి ఇది మీకు ఎక్కడివి అని అడుగుతాడు. విష్ కాలేజీ అటెండర్ ఇచ్చాడు అని చెప్పడంతో షాక్ అవుతాడు. వాటిని డిలీట్ చేసేయండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఫస్ట్ ఆ డేటా అంత డిలీట్ చేసేయండి. ఫ్లెక్సీలు తీసుకోవడానికి అతనిని ఇక్కడికి రమ్మనండి అని చెప్తాడు రిషి. అలాగే సార్ పెళ్లిళ్లకి ఫ్లెక్సీలు తగిలించుకోవడానికి ఇచ్చాడేమో అనుకున్నాను అని చెప్పి అటెండర్ కి ఫోన్ చేస్తాడు షాప్ అతను. కానీ ఫోన్ వసుధార దగ్గర ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకునే లోపు అటెండర్ వసుధారని తోసేసి ఫోన్ లాక్కొని పారిపోతాడు. సరే ముందు మీరు ఆ డేటా క్లియర్ చేసేయండి నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రిషి.
ఎపిసోడ్ ముగిసింది...