Guppedanta Manasu April 1st: వసు-రిషిని ఒక్కటి చేసేందుకు కథలోకి కొత్త క్యారెక్టర్, గుప్పెడంతమనసులో మరో మలుపు!
Guppedantha Manasu April1st Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఏప్రిల్ 1 ఎపిసోడ్
వసుధార జగతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఫణీంద్ర వచ్చి గేటు దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా అని అడుగుతాడు. అన్ని పనులు పూర్తయ్యాయి అన్నయ్య అంటాడు ఫణీంద్ర. ఇంతలో రిషి అక్కడికి రావడంతో జయచంద్ర గారికి ఫోన్ చేసావా అని అడుగుతుంది జగతి. చేశాను మేడం...కొద్ది సేపట్లో వస్తారు... ఇప్పుడు అకామిడేషనే సమస్యగా మారింది ఆయన హోటల్ గదిలో ఉండరట అని అంటాడు రిషి.
మహేంద్ర: మన కాలేజీ గెస్ట్ హౌస్ లో విడిది ఏర్పాటు చేద్దాం
రిషి: ఆయనకు నచ్చితే ఓకే డాడ్ నచ్చకపోతే ఎలా
వసు:ఏముంది సార్ మన ఇంటికి అతిథిగా పిలుద్దాం
దేవయాని: మన ఇల్లా అని అక్కడికి కోపంగా వస్తుంది
జగతి: అవును అక్కయ్య మన ఇల్లే వసుధార అన్నదాంట్లో తప్పేముంది అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి రావడం అంటే నిజంగా మనం చేసుకున్న అదృష్టం
దేవయాని: మన ఇంట్లో రూమ్స్ ఎక్కడున్నాయి...గెస్ట్ రూమ్ లో వసుధార ఉంది కదా
వసు: నేను ధరణి మేడమ్ రూమ్ లో అడ్జస్ట్ అవుతాను
రిషి: ఇది చాలా మంచి ఐడియా వసుధార ..దేవయాని సీరియస్ గా ఉండడం గమనించి..పెద్దమ్మ మీకు ఇష్టం లేదా అనడంతో అదేం లేదు ఇంటికెళ్లి ఏర్పాట్లు చేస్తానని వెళ్లిపోతుంది
Also Read: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, కొడుకు రుణం తీర్చుకుంటానన్న జగతి!
ఆ తర్వాత ప్రవచనం చెప్పే జయచంద్ర రావడంతో అందరూ వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత జయచంద్ర తన స్పీచ్ ని మొదలు పెడతారు. మరోవైపు దేవయాని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ వసుధార ప్రతి ఒక్కదాంట్లో తల దూరుస్తూ ఉంటుంది తను ఉండడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అతిథిని ఆహ్వానించడం ఏంటి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ధరణి రూమ్స్ సర్దుతూ ఉండగా నువ్వెందుకు ఇవన్నీ సర్దుతున్నావు అనడంతో అతిథి వస్తున్నాడు కదా అందుకే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాను అని అంటుంది.
మరోవైపు రిషి...కాలేజీలో ఉన్న సౌకర్యాల గురించి వివరిస్తూ ఉంటాడు. మిషన్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ రిషి ని పొగుడుతాడు జయచంద్ర. సాధారణంగా చాలామంది ఒక్కొక్కరు ఫీల్డ్ లోకి వెళ్తారు. కానీ మీరు మాత్రం కుటుంబం అందరూ ఒక్కటై ఇలా ఒకే కాలేజ్ నడపడం అన్నది చాలా గొప్ప విషయమంటాడు. అప్పుడు జయచంద్ర కాలేజీ గురించి తాను విన్న మాటలు చెప్పడంతో అందరూ సంతోషపడతారు. ఆ తర్వాత సర్ మీకు హోటల్ రూమ్ అంటే నచ్చదని విన్నాము అందుకే మా ఇంట్లో రూమ్ అరెంజ్ చేసాము అనడంతో సరే మీతో పాటు కలిసి ఉండే అవకాశం వస్తే ఎందుకు వద్దంటాను మీ ఇంటికి వస్తాను అని అంటాడు జయచంద్ర. ఆ తర్వాత అందరూ ఇంటికి బయలుదేరుతారు
రిషి వసుధార కూడా జయచంద్ర గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆగమ శాస్త్రం-ఆధునిక శాస్త్రం చదవడం గొప్పతనం అని రిషి అంటే.. మీరు కూడా ఓ వైపు ప్రేమ-మరోవైపు కోపం రెండు భావాలు చూపిస్తున్నారు కదా అంటుంది. ఇద్దరూ కాసేప పోట్లాడుకుంటారు. మాట్లాడేముందు...అనేసి రిషి ఆగిపోతాడు
వసు:పర్లేదు సార్ ఏదో అనాలనుకున్నారు కదా అనండి
రిషి: నిన్ను అనాలనే నాకేం సరదా కాదు నిన్ను అనాలి అంటే నా మనసు ఒప్పుకోదు
ఆ మాట విని వసుధార సంతోషపడుతుంది
రిషి: జయచంద్ర గారు తిరిగి వెళ్లే వరకు మనం పోట్లాడుకోకుండా మనస్పూర్తిగా ఉందాం
వసు: థాంక్యూ సార్ నేను కూడా మీకు ఇదే చెప్పాలి అనుకున్నాను
రిషి: నాకు తెలుసు నువ్వు నేను ఒకలా ఆలోచిస్తామని..కొన్ని విషయాల్లో మాత్రమే నువ్వు వేరు నేను వేరు.
వసు: తప్పులేదు సార్..చేతివేళ్లు అన్నీ ఒకేలా ఉండవు కానీ అన్నీ కలసి ఉంటేనే పనిచేయగలం..అలాగే మనం కూడా కలసే ఉండాలి
Also Read: ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది
తర్వాత రిషి జయచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లడంతో దేవయాని అక్కడికి వచ్చి నమస్కరించి..మీరు మా ఇంటికి రావడం చాలా అదృష్టం మా జన్మ ధన్యమైనట్లే అని మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వసుధార జగతితో మాట్లాడుతూ ఆయన రావడమే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు సాగదీస్తూ ఎలా బిస్కెట్లు వేస్తున్నారో చూడండి మేడం అని అంటుంది. ఆ తర్వాత రిషి వసుధారలు వెళ్లి గెస్ట్ రూమ్ చూపిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ వసుధార చున్నీ పడిపోవడంతో ఆయన చూసే లోపు అది తీసేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధార. అప్పుడు రిషి జయచంద్ర తో మాట్లాడుతూ ఉండగా వసుధార సైగలు చేయడంతో దానిని గమనిస్తాడు జయచంద్ర. అప్పుడు అక్కడే ఉన్న చున్నీ వైపు చూసి ఈ గదిలో ఎవరైనా లేడీస్ ఉంటారా అని అడుగుతాడు జయచంద్ర....( అంటే రిషి-వసులను కలిపేందుకే ఈయనను తీసుకొచ్చారన్నమాట)