పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్సర్వంపునర్లభ్యం న శరీరం పునఃపునః।।
ఈ శ్లోకం ద్వారా ఈ శరీరం గొప్పతనం గురించి చెప్పాడు ఆచార్య చాణక్యుడు
పోయిన ధనం మళ్లీ చేరుతుంది, దూరమైన మిత్రుడు మళ్లీ చేరువఅవుతాడు, భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది. సంపద పోతే మళ్లీ వస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు కానీ ఈ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు. ప్రాణంపోతే తిరిగి రాదు
శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం లభిస్తుంది. అందుకే మనిషిగా పుట్టినవారు.. ప్రాణాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలంటాడు చాణక్యుడు
జంతువులకు శరీరం ఉంటుంది కాని ఆలోచన ఉండదు, ఆలోచన ఉన్నా అమలుచేయడాని శరీరం సహకరించదు. బుద్ధి , ఆలోచన ఉండేది మనుషులకే..వాటిని అమలుచేసే నైపుణ్యమూ మనుషులకే ఉంటుంది.