శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉంటే ఏమవుతుంది!



ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్ధానికీ శక్తి ఉంటుంది. అందుకే అ,ఉ,మ తో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది.



బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్ఛరించినప్పుడు శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా పుట్టిన శక్తితో సకల సంకల్పాలు నెరవేరుతాయి. అంత శక్తివంతమైనది ఓంకారం.



’ఓం’కారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా..అందుకు ప్రత్యామ్నాయ మార్గమే శ్రీరామ పట్టాభిషేకం ఫొటో. ఈ ఫొటో ఉన్నఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదని చెబుతారు పండితులు.



రాముడు అకారానికి ప్రతినిధి
యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!



అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతాదేవి
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు



అకార ఉకార మకార నాద స్వరూపమైన హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి పట్టాభిషేక మూర్తి



రాముడికి పూజ వాళ్లు చేయొచ్చా-వీళ్లు చేయొచ్చా అని ఉండదు. ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకం ఫొటోకి పూజ చేయడం అంత గొప్పది.



రాముడిని వీర రాఘవ, విజయ రాఘవ అంటారు. ఎల్లవేళలా కోదండం చేతిలో పట్టుకుని ఉంటాడు. అలాంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం, శత్రుభయం ఉండదని విశ్వాసం.



నిరుద్యోగులు, శత్రుభయం ఉన్నవారు, ఇంట్లో ఆందోళనలు ఉన్నవారు, డిప్రెషన్ కి గురైనవారు, తమ కష్టానికి తగిన గుర్తింపు లభించాలనుకునేవారు శ్రీరామ పట్టాభిషేకం నిత్యం ఉదయాన్నే 21 సార్లు లేదా 11 సార్లు పఠిస్తే శుభం జరుగుతుందని విశ్వాసం



శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు పండితులు



Images Credit: Pinterest