Gunde Ninda Gudi Gantalu October 15th Episode: మీనాకు దొరికేసిన మలేషియా మేకమామ , మళ్లీ తప్పించుకున్న రోహిణి - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 15 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ హోదా వెలగబెడుతున్న రోహిణి అడ్డంగా బుక్కైంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 15 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 15h Episod
ఫర్నిచర్ షాప్ లో కస్టమర్స్ ని పట్టించుకోకుండా కబుర్లు పెట్టుకుంటారు సేల్స్ టీమ్. అది చూసి మనోజ్ ఫైర్ అవుతాడు. డ్రెస్సులు కూడా నలిగిపోయి ఉన్నాయేంటని క్వశ్చన్ చేస్తాడు. స్టాక్ దించేవాళ్లని కూడా మానిపించేశారు..మేమే దించుతున్నాం అంటారు. వెంటనే ఐరెన్ బాక్సులు తీసుకొచ్చి ఇస్తాడు. థ్యాంక్స్ సర్ అనగానే..నేను ఫ్రీగా ఇవ్వడం లేదు వచ్చే నెల జీతం నుంచి కట్ చేసుకుంటా అని షాకిస్తాడు. ఈ మాట విన్న రోహిణి...నీకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయా అంటుంది. ఇంతలో విద్య వస్తుంది....మనోజ్ పై కాసేపు సెటైర్స్ వేసి...దేవుడి ఫొటో ఇచ్చి రోజూ పూజ చేయమంటుంది. పూలకోసం మీనాకు కాల్ చేస్తుంది రోహిణి. సరే తీసుకొస్తున్నా అంటూ బయలుదేరుతుంది మీనా.. ఆ దారిలోనే రోహిణి మలేషియా మావయ్య( మటన్ కొట్టు మాణిక్యం) ను చూస్తుంది. తన మేనమాన అని అబద్ధం చెప్పి అత్త ప్రభావతి దగ్గర తక్కువకాకుండా ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత పంపించేసింది. తండ్రి జైల్లో ఉన్నారు..మావయ్య కూడా ఎక్కడో దాక్కున్నారని మరో అబద్ధం చెప్పింది. అయితే అనుకోకుండా ఈ రోజు మీనాకు ఎదురుపడ్డాడు. వెంటనే మీనా నుంచి తప్పించుకుని ఫర్నిచర్ షోరూంకి వెళతాడు.
రోహిణి, విద్య ... మాణిక్యాన్ని చూసి షాక్ అవుతారు. నువ్వు ఇక్కడకు వచ్చావేంటని కంగారుపడతారు. మంచినీళ్లు కావాలని అడిగి..మీరిక్కడ ఉన్నారేంటని అడుగుతాడు. మీనా నన్ను చూసేసింది మేడం..వస్తోంది అని చెబుతాడు. ఆ వెనుకే మీనా బండి వచ్చి షాప్ ముందు ఆగుతుంది. ఏం చేయాలో అర్థంకాక ...విద్య కంగారుగా మాణిక్యాన్ని తీసుకెళ్లి బీరువాలో దాచేస్తుంది. నేను మీ మలేషియా మేక మామను...మేనమామను చూశాను అంటుంది. మా మావయ్య ఇండియాలో లేడు అని కవర్ చేస్తుంది రోహిణి. డీలర్ దగ్గరకు వెళ్లిన మనోజ్ తిరిగివచ్చేస్తాడు. స్టాక్ చెక్ చేసి వస్తానంటుంది. మీనా బయలుదేరుతుండగా బాలు-రాజేష్ వస్తారు. రాజేష్ కి బీరువా కావాలి అని అడిగాడు అందుకే వచ్చాను అంటాడు బాలు. అదిగో బీరువా అక్కడుంది అంటుంది రోహిణి. అదే బీరువాలో మాణిక్యాన్ని దాచుతుంది విద్య. అదే విషయం రోహిణికి చెబుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి బీరువా దగ్గర నిల్చుంటారు రోహిణి, విద్య. లోపలున్న మాణిక్యం. మాకు ఈ బీరువానే కావాలి అంటాడు బాలు...ఇది విద్య సెలెక్ట్ చేసుకుంది తను కొంటుంది అంటుంది రోహిణి. నాకు ఇదే నచ్చింది అంటాడు రాజేష్. అదే టైమ్ లో తుమ్ముతాడు మాణిక్యం. అప్పుడు కూడా కవర్ చేస్తుంది రోహిణి.
బాలు వాళ్లు వెళ్లిపోగానే..మనోజ్ ని బయటకు పంపిచేస్తుంది రోహిణి. ఆ తర్వాత బీరువాలోంచి బయటకు వస్తాడు మాణిక్యం. మీరు షూటింగ్ అని చెప్పినదంతా అబద్ధమే కదా నాకు అంతా అర్థమైపోయింది..మీ ఇంట్లోవాళ్లని నమ్మించేందుకు నాతో వేషం వేయించారు అంటాడు. రెండోసారి కూడా నాతో అబద్ధం చెప్పించినప్పుడే నాకు అర్థమైంది. మీరేదో సమస్యలో ఉన్నారని మాత్రం తెలుస్తోంది అంటాడు. మీరు కూడా ఎంతకాలం చేయగలరో చూద్దామనే అడగలేదు అంటాడు. కారణం చెప్పలేను తప్పుగా అనుకోవద్దు అంటుంది రోహిణి. మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా చేస్తాను అని మాటిచ్చి వెళ్లిపోతాడు మాణిక్యం. విద్య నాకు చాలా సహాయం చేసింది అందుకు నేను సహాయం చేస్తానని చెప్పేసి వెళ్లిపోతాడు మాణిక్యం.






















