Gunde Ninda Gudi Gantalu October 10th Episode: రోహిణి ప్లాన్ సక్సెస్, మీనాకు అవమానం, ప్రభావతికి కండిషన్ పెట్టిన బాలు ! గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 10 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి డాన్స్ స్కూాల్ ప్రారంభించడంతో కథ కీలక మలుపు తిరిగింది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 10 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 10th Episod
ఖాళీగా ఉన్నావంటూ అందరూ అవమానిస్తున్నారని బాధపడిపోతుంది ప్రభావతి. పార్లర్ కి వస్తాను, ఫర్నిచర్ షాప్ కి వస్తానని చెప్పడంతో.. ఈమెనుడైవర్ట్ చేయాల్సిందే అని ఫిక్సవుతుంది రోహిణి. మీరే సొంతంగా ఏదైనా చేయొచ్చు కదా అంటే... మా వదినకు ఏం వచ్చు అని సెటైర్ వేస్తుంది కామాక్షి. నాకు డాన్స్ తప్ప ఇంకేం రాదంటుంది ప్రభావతి. అయితే డాన్స్ స్కూల్ స్టార్ట్ చేయండని ఓ సలహా ఇస్తుంది. సరే అంటుంది ప్రభావతి. పెద్ద హాల్ ఉండాలి కదా ..ఎక్కడ పెట్టాలి డాన్స్ స్కూల్ అని ఆలోచిస్తుంది. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కామాక్షిని ఆపి..మీ ఇంట్లో పెద్ద హాల్ ఉంది కదా అని అడుగుతుంది. మీనా, రోహిణి కూడా అడగడంతో కామాక్షి ఒప్పుకుంటుంది. ఈ వయసులో నీకు పనిచేయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం అందుకే ఒప్పుకుంటున్నా అంటుంది కామాక్షి. వెంటనే డాన్స్ స్కూల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయ్.
ఎప్పటి నుంచో మూలన దాచిన కాస్టూమ్స్ , నగలు బయటకు తీసి అలంకరించుకుంటుంది ప్రభావతి. ఇదంతా చూసిన మీనా హడావుడిగా కిందకు వచ్చి మావయ్యా మనం ఓ అద్భుతాన్ని చూడబోతున్నాం అంటుంది. ఏంటమ్మా అది అని సత్యం అడిగితే. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారట అంటుంది. షాక్ అవుతాడు సత్యం. రవి, బాలు కూడా వచ్చి ప్రభావతి నిర్ణయం సంగతి తెలిసి ఆశ్చర్యపోతారు. ఇంతలో ఫుల్ మేకప్ తో కిందకు దిగుతుంది ప్రభావతి. అమ్మా ఇప్పుడు స్టేజ్ పెరఫామెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావా అని రవి భయంగా అడుగుతాడు. బాలు కూడా తన స్టైల్లో సెటైర్స్ వేస్తాడు. ఎందరో శిష్యులను నావంటి నాట్య మయూరులుగా తీర్చిదిద్దుతా అంటుంది ప్రభావతి. డాన్స్ స్కూల్ స్టార్ట్ చేస్తా అంటుంది. బాలు, రవి షాక్ అయి చూస్తుంటారు. నాట్య పరిభాషలో ఏవేవో మాట్లాడుతుంది. షాక్ లోనే ఉండిపోతారు రవి, బాలు. ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ కి వెళుతున్నారా అని అడుగుతుంది శ్రుతి. నాట్యాలయం పెట్టబోతున్నా అంటుంది. మరోసారి ఆలోచించు అని సత్యం అంటే...ఖాళీగా ఉండకుండా ఏదైనా చేయాలి అనుకుంటున్నారు...ఎంకరేజ్ చేయండి మావయ్య అంటుంది మీనా. మనోజ్ తప్ప అందరూ ఉంటారు.
అనుకున్నదే తడవుగా ఏర్పాట్లు జరిగిపోతాయ్. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రభావతి. ఎవరూ రాకపోతే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని సత్యం అంటాడు. అత్తయ్య లక్ష్యం కోసం ఇది పెట్టారని రోహిణి అంటే..లక్షల కోసం అంటాడు బాలు. లక్షలు వస్తాయా అని మనోజ్ అడగ్గానే... లక్షలు అనే మాట వినగానే ముక్కను చూసిన కుక్కలా పరిగెడతావేంటి అని సెటైర్ వేస్తాడు బాలు. ఇంతకీ రిబ్బన్ ఎవరు కట్ చేస్తారని అడిగితే.. నాన్న ఉన్నారుగా అని బాలు అంటాడు. ఏదో ముసలమ్మ ముచ్చటపడిందని ఇదంతా ప్లాన్ చేశాం అని సత్యం అనగానే.. నేను ముసలమ్మను కాదని ఫైర్ అవుతుంది ప్రభావతి.
శ్రుతి వాళ్లమ్మను పిలవాల్సింది అనగానే..నిప్పు పెట్టేందుకా అని బాలు సెటైర్ వేస్తాడు. బాలూ అని శ్రుతి అనగానే నువ్వు ఇక్కడున్నావని మర్చిపోయా డబ్బుడమ్మ అంటాడు. ముందుగా దీపం వెలిగించే ప్రోగ్రామ్ లో భాగంగా శ్రుతిని దీపం వెలిగించమంటుంది..ఆ తర్వాత రోహిణి మరో వత్తి వెలిగిస్తుంది. మీనానో అని కామాక్షి అడిగితే.. అక్కడ రెండే వత్తులు ఉన్నాయ్ అని చెబుతుంది. మూడో వత్తి వేస్తే మునిగిపోతావా అని సత్యం అంటాడు. డబ్బున్న కోడళ్ల కోసం రెండే వత్తులు వేసి నా భార్యను తక్కువ చేస్తావా వెళదాం పద మీనా అంటాడు. ఆగండి ఆవేశపడొద్దు.. ఆ దీపం కుందులు తోవింది, నూనె పోసింది, వత్తులు వేసింది నేను అంటుంది. నువ్వు మూడు వత్తులు వేశావ్ కదా అంటుంది కామాక్షి. నా మీనాతో రిబ్బన్ కట్ చేయించకపోతే నేను ఎవ్వరూ రాకుండా కారు అడ్డం పెట్టుకుని కూర్చుంటా అంటాడు. నేనేమైనా వీఐపీనా అంటుంది. ఇక్కడ ఎవరు గొప్ప అని ఏకిపడేస్తాడు బాలు.
మొత్తానికి ఇంట్లో అందరూ చెరో పనిలో బిజీ అయ్యారన్నమాట. మీనా పూలగంప, రోహిణి పార్లర్, శ్రుతి డబ్బింగ్, ప్రభావతి డాన్స్ స్కూల్... మనోజ్ ఫర్నిచర్ షాప్, రవి చెఫ్, బాలు డ్రైవర్ గా బిజీ బిజీ. మరి ప్రభావతి కొత్తగా ప్రారంభించిన డాన్స్ స్కూల్ లో కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...






















