Gunde Ninda Gudi Gantalu June 27th Episode : బాలుని కంట్రోల్ చేసేసిన మీనా.. శోభ, రోహిణి ప్లాన్ ఫెయిలైనట్టేనా? గుండె నిండా గుడి గంటలు జూన్ 27 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శ్రుతి, రోహిణి తాళి మార్చే వేడుక కోసం హడావుడి చేస్తుంది ప్రభావతి. అంతా కలసి బాలుని టార్గెట్ చేస్తారు. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 27 ఎపిసోడ్
కూతురికి తాళి మార్చే ఫంక్షన్ పేరుతో శ్రుతి, రవిని శాశ్వతంగా ఇంటికి తీసుకెళ్లందుకు ప్లాన్ చేస్తుంది శోభ. రోహిణికి కూడా తాళి మార్చే ఫంక్షన్ జరిపిస్తాని చెప్పిన ప్రభావతి నీ పుట్టింటివాళ్లను పిలువు అంటుంది. రోహిణి కంగారుపడుతుంది. ఫ్యామిలీ అంతా కలసి ఫంక్షన్ హాల్ కి వెళతారు. ఫంక్షన్లో గొడవచేయొద్దని మీనా మాటతీసుకుంటుంది. బాలు సరే అంటాడు. మరోవైపు రోహిణి బాలుని ఎలాగోలా గొడవలో ఇరికించి తాను బయటపడాలి అనుకుంటుంది. బాలుతో రచ్చ చేయించి శ్రుతిని తీసుకెళ్లిపోవాలని తల్లి శోభ ప్లాన్ చేస్తుంది. మొత్తం బాలు చుట్టూ కుట్రలు నడుస్తుంటాయి. బాలుతో తాగించేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేస్తుంది రోహిణి. ఎలాగైనా బాలుతో తాగిస్తే చాలు గొడవ చేస్తాడని కంట్రోల చేయడం ఎవరివల్లా కాదు..ఫంక్షన్ మొత్తం గందరగోళం అయిపోతుందని ఫిక్సవుతుంది.
శ్రుతి వెళ్లి తల్లిదండ్రులను పలకరిస్తుంది. మేం నీకు అవసరం లేకపోయినా..మాకు నీ సంతోషమే కావాలి అంటాడు తండ్రి సురేంద్ర. నన్ను మా ఇంట్లో అందరూ చాలా బాగా చూసుకుంటున్నారని చెబుతుంది శ్రుతి. నువ్వు వెళ్లి రెడీ అవు అంటుంది శోభ. మీనాను రమ్మను చీరకట్టించుకుంటాను అంటుంది శ్రుతి. మీనా అవసరం లేదు..నీ ఫ్రెండ్స్ వచ్చారు, మేకప్ ఆర్టిస్టుని పిలిచాను మీనాను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. నాకు ఇబ్బందిలేదని మీనా చెబుతుంది కానీ.. మీ ఆయన చూస్తే ఏమైనా అంటాడు ప్రశాంతంగా ఫంక్షన్ జరగాలి కదా అని సెటైర్ వేస్తుంది. నీకు చాదస్తం పెరిగిపోయింది మమ్మీ అనేసి శ్రుతి వెళ్లిపోతుంది.
ముందు కూర్చుందాం రమ్మని మీనా పిలిస్తే..బాలుమాత్రం వెనుకే కూర్చుందాం అంటాడు. బాలుతోపాటే మీనా కూర్చుంటుంది. గెస్ట్ లా ఇక్కడ కూర్చున్నావేంటని రవి పిలుస్తాడు కానీ బాలు ఏమీ మాట్లాడడు. ఇంతలో కామాక్షి వచ్చి..వాడు గొడవచేయకూడదని మీనా మాటతీసుకుంది అందుకే సైలెంట్ గా ఉన్నాడు అంటుంది.
శ్రుతి తండ్రి సురేంద్ర...సత్యంను పిలిచి అవమానిస్తాడు. సత్యం పక్కనే తన స్నేహితుడిని కూర్చోబెట్టి ఆ కాలు తగిలేలా చేయమని ఏదైనా అంటే గొడవ చేద్దాం అని ప్లాన్ చేస్తాడు. సురేంద్ర కావాలనే తనను అవమానిస్తున్నాడని సత్యానికి అర్థమవుతుంది. ఏదైనా మాట్లాడితే లేనిపోని గొడవ జరుగుతుంది, బాలు అస్సలు ఊరుకోడు అని సత్యం అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లిపోతాడు.
మరొకవైపు రోహిణి రెడీ అవడం మానేసి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. మీ నాన్న ఎప్పుడు వస్తారు అసలు బాధ్యతలేదా అని ఫైర్ అవుతాడు. వస్తున్నారంటూ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంటుంది. కనీసం ఫోన్ చేసి ఇవ్వు అని అడిగితే కాల్ కలవడం లేదని చెబుతుంది. మరోవైపు రోహిణి తాను ఏర్పాటు చేసిన మనుషుల కోసం చూస్తుంది.
బాలుని టార్గెట్ చేసేందుకు సెట్ చేసిన మనిషి ఏడి అని రోహిణి తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంటుంది. సెట్ అనే మాటవిని ఎవరు అంటు ఎంట్రీ ఇస్తాడు మనోజ్. కంగారుపడుతుంది రోహిణి..అంతలోనే కవర్ చేస్తుంది.
శోభ ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది..ఎవరి గురించి వెతుకుతున్నావని సురేంద్ర అడిగితే..నేను బాలుని గొడవ చేసేలా చేయమని ఇద్దరు మనుషులను పురమాయించాను వాళ్లింకా రాలేదు అంటుంది
గుండెనిండాగుడిగంటలు జూన్ 30 ఎపిసోడ్ లో బాలు మీనా ఆఖరి వరుసలో కూర్చుంటారు..శోభ ఏర్పాటు చేసిన మనుషులు వెళ్లి బాలు కాలు కావాలనే తొక్కి వెళతారు. కళ్లు కనిపించవా అంటూ ఫైర్ అవుతాడు బాలు.. ఇంతలో మీనా లేచి గొడవ ఆపేందుకు ట్రై చేస్తుంది






















