Gunde Ninda Gudi Gantalu June 05 Episode:పూలకొట్టులా మారిన ఇల్లు, పనిమనిషిలా ప్రభావతి, రోహిణికి బాలు సెటైర్స్ - గుండె నిండా గుడి గంటలు జూన్ 05 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: మనసులో ప్రేమ దాచుకుని బయటపడకుండా ప్రవర్తిస్తుంటారు మీనా బాలు.. మరోవైపు పూల దండలు సిద్ధం చేస్తుంటారు. గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 05 ఎపిసోడ్
మీనాకు బాలు పెద్ద ఆర్డర్ ఇప్పించడంతో బస్తీవాళ్లంతా వచ్చి పూలు కడుతుంటారు. మనోజ్ ఫొటోలు తీస్తుంటే ప్రభావతి క్లాస్ వేస్తుంది. రోజుకి 500 పూలదండలు కట్టడం అంటే మామూలు విషయం కాదంటాడు సత్యం. చెప్పడం ఈజీ కట్టడమే కష్టం అంటుంది సుమతి. ఇన్ని దండలు మీనా పెళ్లికి కూడా కట్టలేదు..సుమతి పెళ్లికి కడదాంలే అంటారు. నేను ఉద్యోగం చూసుకుంటా అంటుంది సుమతి. అవునమ్మా చదువుకోకుండా ఉంటే అత్తారింట్లో ఆడపిల్లలకు విలువ ఉండదని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తారు బస్తీ వాళ్లు. బాలు వచ్చి ఇంకా పూలు తీసుకొచ్చాను ఓనరమ్మ డబ్బులివ్వాలి అంటాడు. పనయ్యాక ఇస్తాను అంటుంది. ఆతర్వాత బస్తీలో ఉన్నవాళ్లతో సత్యం మాట్లాడుతుంటే సెటైర్స్ వేస్తుంది ప్రభావతి.
డబ్బింగ్ పని పూర్తైన తర్వాత ఫుడ్ వచ్చిందని ఆఫీసు వాళ్లు చెబుతారు. నేనేం ఫుడ్ ఆర్డర్ చేయలేదని అంటే వెళ్లి చూడండి మీకే అర్థమవుతుందంటారు. నీకోసం అన్నీ నీకు నచ్చినవే చేసి తీసుకొచ్చాను అంటాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటి చెప్పు అంటుంది శ్రుతి. కేవలం యానవర్శరీ అంటేనే చేయాలా ఏంటి..మినీ యుద్ధాల నుంచి ఉపశమనంకోసం చేసి తీసుకొచ్చాను అంటాడు. ఇద్దరూ కలసి ఎంచక్కా భోజనం చేస్తారు
ప్రభావతి కాల్ చేయడంలో ఇంటికి వస్తుంది కామాక్షి. ఇల్లంతా పూలు చూసి షాక్ అవుతుంది. ఇన్ని పూలు చూస్తుంటే మళ్లీ పెళ్లిచేసుకోవాలి అనిపిస్తోంది అంటుంది కామాక్షి. అంటే మామను వదిలేస్తావా అని బాలు సెటైర్ వేస్తాడు. సత్యం జోక్యం చేసుకుని నువ్వు మీనా మళ్లీ పెళ్లిచేసుకున్నారు కదా అలా అన్నమాట అంటాడు. ఇంటికి వచ్చిన శ్రుతి రవి ఇల్లంతా పూలు చూసి సంతోషిస్తారు. పెద్ద ఆర్డర్ వచ్చినందుకు సంతోషిస్తారు. ఇద్దరూ కూడా ఫ్రెష్ అయి వచ్చి పూలు కట్టేందుకు కూర్చుంటారు. శ్రుతి పూలు కడుతూ పక్కనే ఉన్న కామాక్షి మొహానికి చేతిని తగిలిస్తుంది. లబో దిబోమని గోల పెడుతుంది కామాక్షి. ఇక్కడ అందరూ పని చేస్తున్నారు నువ్వు ఒక్కదానివే ఖాళీగా ఉన్నావ్ వెళ్లి అందరకీ టీ పెట్టి తీసుకురా అంటాడు బాలు. టీ కూడా పెట్టడం రాదా అని అంతా సెటైర్స్ వేయడంతో తప్పని పరిస్థితుల్లో టీ పెట్టి తీసుకొస్తుంది ప్రభావతి.
రాత్రి అవడంతో అందరకీ భోజనాల ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో వంట వీలవదని బయటి నుంచి తెప్పిద్దాం అనుకుంటారు. రవి మాత్రం అందరకీ నేనే వంట చేసి పెడతా అంటాడు. ఇంతమందికి సరుకులు లేవని ప్రభావతి అంటుంది. మనోజ్ ని బయటకు పంపించి సరుకులు తెప్పించనంటాడు బాలు. నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడని ప్రభావతి ఫైర్ అవుతుంది. ఇందాక నన్ను టీ ఇమ్మన్నారు, ఇప్పుడు వాడిని సరుకులు తెమ్మంటారా అంటుంది.
బాలు , రవి ఇద్దరూ కలసి వంట చేస్తుంటారు. పల్లీలు పొట్టు తీయమని చెబితే ఆ పని మనోజ్ కి బాగా వచ్చంటూ సెటైర్స్ వేస్తాడు. మనోజ్ ని ఆడుకుంటుంటే సత్యం వస్తాడు. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు మనం వాళ్లకోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అంటాడు సత్యం. ఇక తండ్రి, ముగ్గురు కొడుకులు కలసి వంట చేస్తారు.కిచిడీ కాకుండా ఇంకేమైనా చేస్తున్నావా అంటుంది రోహిణి. నాకు కిచిడి నచ్చదు అంటాడు మనోజ్. నాకు మనోజ్ కి కిచిడి నచ్చదు మేం ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం అంటుంది రోహిణి. రేయ్ రవి విన్నావా ఆమె మలేషియా ఆడబిడ్డ, వీడు కెనడా బిడ్డ.. ఇద్దరూ కలసి రిచ్ ఫుడ్ తింటారులే అని ఆడుకుంటాడు.
మరోవైపు గుణ..మీనా ఇచ్చిన వార్నింగ్ తలుచుకుని రగిలిపోతాడు. వాళ్లకు పెద్ద ఆర్డర్ వచ్చింది దాన్ని చెడగొట్టాలి అనుకుంటాడు
అందరితో పాటూ నా కూతురు కూడా ఉండి ఉంటే బావుండేది అంటాడు సత్యం. మౌనికకు కాల్ చేసి మాట్లాడుతుంది. నాకు అంతా తెలిసిపోయిందని బాలు అనడంతో మౌనిక షాక్ అవుతుంది






















