జూన్ 06 శుక్రవారం నిర్జల ఏకాదశి - ఈ రోజుకున్న విశిష్టత ఇదే!

నిర్జల ఏకాదశి జూన్ 06 శుక్రవారం వచ్చింది..ఈ రోజు మొత్తం ఏకాదశి తిథి ఉంది

ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచే నియమాలు పాటించాలి

జూన్ 07 శనివారం మొత్తం ద్వాదశి తిథి ఉంది.. ఏకాదశి ఉపవాసం విమరించే రోజు ఇది

చుక్కనీరు కూడా ముట్టుకోకుండా చేసే ఉపవాసం ఇది..అందుకే నిర్జల ఏకాదశి అంటారు

నిర్జల ఏకాదశిలో రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశుల పుణ్యాన్ని అందిస్తుంది

ఏకాదశికి ఆచరించే ఉపవాసం వల్ల మానసిక , శారీరక శుద్ధి జరుగుతుంది

శ్రీ మహావిష్ణుకి ప్రీతికరమైన ఏకాదశి నియమాలు పాటించేవారిపై స్వామివారి ఆశీస్సులుంటాయి

ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది