Gruhalakshmi Serial Today January 18Th: ‘గృహలక్ష్మీ’ సీరియల్: లాస్యను పెళ్లి చేసుకోబోతున్న నంద – తులసికి వార్నింగ్ ఇచ్చిన లాస్య
Gruhalakshmi Today Episode: తనను పెళ్లి చేసుకోకుంటే మీ నాన్నకు తులసి తీర్థం పోసుకోవాల్సిందే అని లాస్య, నందకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.
![Gruhalakshmi Serial Today January 18Th: ‘గృహలక్ష్మీ’ సీరియల్: లాస్యను పెళ్లి చేసుకోబోతున్న నంద – తులసికి వార్నింగ్ ఇచ్చిన లాస్య Gruhalakshmi serial today episode January 18Th written update Gruhalakshmi Serial Today January 18Th: ‘గృహలక్ష్మీ’ సీరియల్: లాస్యను పెళ్లి చేసుకోబోతున్న నంద – తులసికి వార్నింగ్ ఇచ్చిన లాస్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/18/36e03a2c3ac30a57f8d49650ac201e991705546449537879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gruhalakshmi Serial Today Episode: లాస్య వచ్చి నందతో బయటకు వెళ్దామని అడుగుతుంది. నా ప్రేమ అర్థం చేసుకో అని బతిమాలుతుంది. దీంతో నంద అతిగా ఆశలు పెట్టుకోమాకు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అయితే గుడ్‌బై నేను వెళ్తున్నాను అంటుంది లాస్య. నువ్వు మధ్యలో వెళ్లిపోతే ఎలా నాన్న గారి పరిస్థితి ఎంటి అని అడుగుతాడు. అయితే నన్ను మరోసారి పెళ్లి చేసుకో.. మామయ్యగారిని కంటికిరెప్పలా చూసుకుంటాను అంటుంది లాస్య. సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. నన్ను భార్యగా ఒప్పుకో.. లేదంటే మీ నాన్నగారి నోట్లో తులసి తీర్థం పోసుకో అంటూ డెడ్‌లైన్ విధించి వెళ్లిపోతుంది లాస్య. మూడీగా లోపలికి వచ్చిన నందు ఆలోచిస్తూ కూర్చుంటాడు.
తులసి: ఎందుకు అలా ఉన్నారు. ఏం జరిగింది. అత్తయ్యా మీ అబ్బాయి ఎందుకో చిరాగ్గా ఉన్నాడు. అడుగుతే చెప్పడం లేదు. మీరే కనుక్కొండి
అంటూ తులసి వెళ్లిపోతుంది.
అనసూయ: ఇంట్లో అందరి తలనొప్పులకు కారణం ఆ లాస్యే కదా..
నంద: కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నావల్ల కావడం లేదు అమ్మా..తనని చంపేస్తానేమో
అనసూయ: అలాంటి పిచ్చి పని మాత్రం చేయకు నష్టం మనకే
అని అనసూయ చెప్పగానే ఇంతకన్నా నష్టం ఏం జరుగుతుందని.. అది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎవ్వరం కూడా సంతోషంగా లేమని నంద ఫీలవుతాడు. అది తనను మళ్లీ పెళ్లి చేసుకోమంటుంది అంటూ బాధపడతాడు. కావాలని కుక్క నోట్లో కాలు పెడితే అది కరవకుండా ఉంటుందా? మీ నాన్న కోసం మనం ఇదంతా భరించాల్సి వస్తుంది అంటూ వెళ్లిపోతుంది అనసూయ. మరోవైపు సంజయ్, రాజ్యలక్ష్మీ, బసవయ్య ముగ్గురు కూర్చుని ఆలోచిస్తుంటారు.
బసవయ్య: అక్కాయ్ దివ్య నీకు క్లాస్ పీకిన తర్వాత నీలో చాలా మార్పు కనిపిస్తుంది.
రాజ్యలక్ష్మీ: ఇంక ఆపుతావా? దెబ్బ తగిలితే పులి మరింత ఆవేశంగా గాండ్రిస్తుంది.
బసవయ్య: హమ్మయ్య ఆ మాటన్నావు ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది.
సంజయ్: అయినా దివ్య నీ మీద అరవడం ఏంటమ్మా.. నువ్వెందుకు ఊరుకున్నావు.
అనగానే రాజ్యలక్ష్మీ అరవని అది కూడా చూస్తానని చెప్తుంది. ముందు ఆ 50 ఎకరాల మామిడి తోటని నామీదకు ట్రాన్స్‌ఫర్ చేయించు అని సంజయ్ అడగ్గానే. డైరెక్టుగా నీ పేరు మీద కాకుండా ముందు మీ మామయ్య పేరు ట్రాన్స్ ఫర్ చేయించి తర్వాత నీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుందాము అనగానే బసవయ్య ఉబ్బితబ్బి పోతాడు. అయితే మామిడి తోటను బసవయ్య పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆడాల్సిన నాటకం గురించి రాజ్యలక్ష్మీ బసవయ్యకు చెప్తుంది. బసవయ్య సరే అంటాడు. మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర లాస్య లేదని తాను తిననని ఆలిగి వెళ్లిపోతూ లాస్యను పిలుస్తాడు పరంధామయ్య. లాస్య వచ్చి వడ్డిస్తూ.. నందను మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. నీకిచ్చిన గడువు సాయంత్ర వరకేనని చెప్తుంది. మళ్లీ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిజం మీ నాన్నగారికి చెప్తానంటుంది లాస్య. దీంతో నంద మళ్లీ పెళ్లికి ఒప్పుకుంటున్నట్లు చెప్తాడు. అసలు ఏం జరిగింది లాస్య అని పరంధామయ్య అడగ్గానే రేపు గుడికి వెళ్దామంటే ఒప్పుకోలేదు. మీకు చెప్తాననగానే ఒప్పుకున్నారని లాస్య చెప్తుంది. నంద భోజనం చేయకుండా లేచి వెళ్లిపోతాడు. నంద దగ్గరకు వెళ్లిన..
తులసి: ఎందుకు అంత ఫీలవుతున్నారు. ఏంటి? ప్రాబ్లమ్ నా దగ్గర ఎందుకు దాస్తున్నారు.
నంద: ప్రాబ్లమ్ ఏం లేదు.
తులసి: ఉంది. మీ కళ్లల్లో కనబడే కలవరం చెబుతుంది. గిల్టీగా ఫీలవుతున్నారని.. తడబడే మీ మాటలు చెప్తున్నాయి. ఏదో తప్పు చేయబోతున్నారని
అనగానే నంద బాధపడుతూ పుట్టించిన దేవుడే నన్ను పట్టించుకోనప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతావు తులసి.. అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే లాస్య వస్తుంది. నువ్వు నా భర్తతో మాట్లాడటానికి వీల్లేదు అంటూ లాస్య, తులసికి వార్నింగ్ ఇస్తుంది. ఆయన విషయంలో జోక్యం చేసుకోవద్దని.. తులసికే కాదు నందుకు కూడా వార్నింగ్ ఇస్తుంది తులసితో మాట్లాడొద్దని.. అంటూ నందును తీసుకుని వెళ్తుంది లాస్య. తులసి షాక్ అవుతుంది. మరోవైపు విక్రమ్, దివ్య హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)