Gruhalakshmi September12th: జాహ్నవి మనసులో విష బీజం వేసిన రాజ్యలక్ష్మి- విక్రమ్ కి దివ్య దూరం కానుందా!
Gruhalakshmi September12th: దివ్యకి సవతిని తీసుకొచ్చి దింపుతుంది రాజ్యలక్ష్మి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Gruhalakshmi Serial September12th: సామ్రాట్ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే తనకి ఎందుకని వాళ్ళ గురించి ఆలోచించొద్దని తులసి చెప్తుంది. విక్రమ్, జాహ్నవి సరదాగా ఉంటే దివ్య చూస్తుంది. రాజ్యలక్ష్మి వచ్చి దివ్యని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
రాజ్యలక్ష్మి: చూడముచ్చటగా ఉన్నారు కదా. నీకు వాళ్ళని చూస్తే జలస్ గా లేదా
దివ్య: వాళ్ళిద్దరూ బావ మరదలు. చిన్నప్పటి నుంచి అలాగే ఆడుకున్నారు కదా. విక్రమ్ మనసులో నేను తప్ప ఎవరూ లేరు ఇక రారు కూడా
రాజ్యలక్ష్మి: విక్రమ్ మనసులో నీ ప్లేస్ ఉంటుందని అంత గ్యారెంటీ ఏంటి? నీకు గుండె పగిలే న్యూస్ ఒకటి చెప్తాను విను. జాహ్నవి చుట్టపు చూపుగా ఇంటికి రాలేదు. నీకు సవతిగా మారడానికి నేనే పిలిపించాను
దివ్య: కాకమ్మ కథలు చెప్పి భయపడితే బెదిరిపోతానా? నేను ఉండగా వేరే అమ్మాయిని విక్రమ్ జీవితంలోకి రానివ్వను
ALso Read: ముకుంద, మురారీలని చూసి ముక్కలైన కృష్ణ మనసు- ఆదర్శ్ తిరిగి వస్తాడా!
రాజ్యలక్ష్మి: ప్రస్తుతం విక్రమ్ మనసులో నువ్వు లేవు. నీకు డైవర్స్ ఇస్తే తన మనసులోనే కాదు జీవితంలో కూడా చోటు ఇస్తాడు. చూస్తూ ఉండు కథ నేను నడుపుతాను. జాహ్నవి రాకతో ఈ ఇంట్లో నీ కథ ముగిసిపోయింది. బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళడానికి రెడీ ఆవు. కళ్ల ముందు జరిగేది శాంపిల్ మాత్రమే ముందు ముందు ఇంకా జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చూస్తుంది నిన్ను ప్రేమించిన విక్రమ్ కాదు ఇక నువ్వేమి చేయలేవు
రత్నప్రభ సామ్రాట్ బాబాయ్ మీద చిందులు వేస్తుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా తులసి ఆస్తి లాగేసుకుని ఇంట్లో తిష్ట వేస్తుందని మండిపడుతుంది. మధ్యలో కూతురు స్వీటీ కల్పించుకుని సెటైర్లు వేస్తూ ఉంటుంది.
రత్నప్రభ: తులసికి ఫోన్ చేసి ఈ ఇంటి విషయాలు పట్టించుకోవద్దని చెప్పండి. ముసలాయన ఫోన్ చేసిన అసలు లిఫ్ట్ చేయవద్దని చెప్పండి
ధనుంజయ్: అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది ఏమో తొందరపడకు. అయినా తులసితో మనకున్న సమస్య ఏంటి
రత్నప్రభ: ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి
ధనుంజయ్: తులసిని అబ్జర్వ్ చేద్దాం. ఏ మాత్రమ అనుమానం వచ్చినా తనకి వార్నింగ్ ఇద్దాం
తులసి గార్డెన్ లో కూర్చుని ఉంటే నందు చూస్తూ ఉంటాడు. పరంధామయ్య వచ్చి కొడుకుని చూసి బాధపడతాడు. తులసికి దగ్గరగా వెళ్ళి తన మనసు ఏంటో తెలుసుకోమని సలహా ఇస్తాడు. తన మనసులో ఏముందో చెప్పేసింది కదా ఇంకేముంది తెలుసుకోవడానికని నందు అసహనంగా మాట్లాడతాడు.
నందు: తులసి ఎప్పటికీ నా తప్పులు క్షమించదు. తను దగ్గర అవదు. ఇంకొకసారి తనకి భర్త అయ్యే అవకాశం నాకు ఇవ్వదు
పరంధామయ్య: తులసి గుండెల్లో రగులుతున్న మంట అర్పితే టని నీది అవుతుంది. నీ ప్రయత్నాలు ఆపకు
విక్రమ్ గదిలో దేని కోసమో వెతుకుతుంటే జాహ్నవి వెళ్ళి వెనుకగా వెళ్ళి కౌగలించుకుంటుంది పట్టుకుంది దివ్య అనుకుని చిరాకుగా మాట్లాడతాడు. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి ముట్టుకోవద్దు అంటే ఎందుకు ముట్టుకుంటున్నావ్. ఎందుకు నా సహనాన్ని పరీక్షిస్తున్నావ్ చేతులు తీస్తావా లేదా అని తనని ముందు లాగి కొట్టబోతాడు. తీరా చూస్తే జాహ్నవి ఉంటుంది. సోరి దివ్య అనుకున్నా అనేసి విక్రమ్ వెళ్లిపోతుంటే ఏమైందని జాహ్నవి అడుగుతుంది. విక్రమ్ విషయం చెప్పకుండా దాటేసి వెళ్ళిపోతాడు.
జాహ్నవితో మాట్లాడి విక్రమ్ ని దారిలోకి తెచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలని రాజ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా తనే ఎదురుగా వస్తుంది.
Also Read: కావ్య వెనుక కుక్కపిల్లలా తిరుగుతున్న రాజ్- కళ్యాణ్ తో ప్రేమలో అప్పు!
జాహ్నవి: బావ, దివ్య సంతోషంగా కాపురం చేసుకుంటున్నారా? ఏమైంది అసలు. బావ బాధకి కారణం ఏంటి?
రాజ్యలక్ష్మి: ఇంకెవరూ దివ్య
జాహ్నవి: దివ్య మంచిది కాదా?
రాజ్యలక్ష్మి: దివ్యకి పుట్టింటి వాళ్ళు తప్పితే అత్తింటి వాళ్ళు నచ్చదు. నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. తనకి నచ్చినట్టు ఉంటానని మాట ఇచ్చాను కానీ మారలేదు. నాకు విక్రమ్ కి మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేసింది. మీ బావకి ప్రశాంతత లేకుండా చేసింది. గొడవ డైవర్స్ దాకా వెళ్ళింది. బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళింది
జాహ్నవి: మళ్ళీ మనసు మార్చుకుని తిరిగి వచ్చిందా?
రాజ్యలక్ష్మి: మారినట్టు నాటకం ఆడుతుంది. అవకాశం దొరికినప్పుడు గొడవ చేస్తుంది. నిజానికి నిన్ను బావకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆశ పడ్డాను. నా మనసులో మాట చెప్పే లోపు దివ్య ప్రేమ విషయం చెప్పాడు. నేను కాదనలేకపోయాను. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి అయి ఉంటే ఈ ఇంటి పరిస్థితి ఇలా ఉండేది కాదు
జాహ్నవి: ఇప్పుడు ఇవన్నీ ఎందుకు
రాజ్యలక్ష్మి: దేవుడు ఇప్పటికైనా నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిని చేస్తాడని ఆశ
జాహ్నవి: ఆలోచించాల్సింది అది కాదు బావ కాపురం నిలబెట్టాలి
రాజ్యలక్ష్మి: దివ్య దూరమైతేనె వాడి మొహంలో సంతోషం కనిపిస్తుంది. వాడి నుంచి దివ్యని తప్పించు అంటుంది