Gruhalakshmi September 20th: రత్నప్రభకి రివర్స్ వార్నింగ్ ఇచ్చిన నందు- జాహ్నవిని బుజ్జగించిన విక్రమ్!
దివ్య జీవితంలోకి జాహ్నవి ఎంటర్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Gruhalakshmi September 20th: దాండియా అడుతుంటే జానూ వల్ల దివ్య తలకి గాయం అవుతుంది. నందు సీరియస్ అవుతాడు. పొరపాటున జరిగిన దాన్ని ఎందుకు పెద్దది చేయడమని బావతో ఆట ఆడాలని సరదా పడిందని తులసి వెనకేసుకొస్తుంది. విక్రమ్ కూడా జానూ మీద అరుస్తాడు. దివ్యని చూసి విక్రమ్ విలవిల్లాడిపోతాడు. తులసి కూతురు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే విక్రమ్ తను చేస్తానని అంటాడు. తన తలకి కట్టు కడతాడు. పెద్ద ప్రమాదం తప్పిందని తులసి అంటుంది. ఇక ఇంటికి వెళ్లిపోదామని పండగ సందడి అయిపోయింది కదా అంటాడు. తను కూడా విక్రమ్ తో వెళ్లిపోతానని చెప్తుంది. తులసి హనీని కావాలని తన ఇంటికి రప్పించుకుందని రత్నప్రభ రగిలిపోతుంది.
స్వీటీ: తులసి ఆంటీని అనవసరంగా తిడుతున్నారు. తను చాలా మంచిది వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది
రత్నప్రభ: నీకు నేను తప్ప అందరూ మంచివాళ్లే. వెంటనే తులసికి ఫోన్ చేసి హనీని తీసుకురమ్మని చెప్పండి
స్వీటీ: హనీ చచ్చినా రాదు. నువ్వు ఏమైనా చేసుకో
రత్నప్రభ: ఆ తులసి కంటే నువ్వే నాకు పెద్ద శత్రువు అయ్యావ్. నిన్న కాక మొన్న పరిచయం అయిన తులసికి ఇది కూడా తన పార్టీలో చెరిపోయింది
ధనుంజయ్: ఎందుకో తులసి మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తుంది. ఈ ఆస్తి దక్కాలంటే తులసిని హనీకి దూరం చేయాలి. అందుకోసం ప్లాన్ చేయాలి
Also Read: కృష్ణమూర్తి మీద రౌడీల అటాక్ - కావ్యని కోలుకోలేని దెబ్బ కొట్టిన రుద్రాణి
ఆల్రెడీ తను ప్లాన్ ఆలోచించానని చెప్పి భర్తకి ఏదో చెప్తుంది. విక్రమ్ తిట్టాడని జానూ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పడానికి చూస్తారు. తన కూతురికి మామూలు అవమానం జరగలేదని బసవయ్య కల్లబొల్లీ ఏడుపు మొదలుపెడతాడు.
జానూ: నాకు ఎందుకు అబద్దం చెప్పావ్ అత్తయ్య. బావ, దివ్య ఉప్పు నిప్పూ వాళ్ళకి పడటం లేదని ఎందుకు చెప్పావ్. కానీ వాళ్ళు ఇడ్లీ సాంబార్ లాగా కలిసిపోయి ఉన్నారు
రాజ్యలక్ష్మి: ఎక్కడో ఏదో తేడా జరిగింది. విక్రమ్ కి దివ్య అంటే పడదు
బసవయ్య: మీ బావ కళ్లలో ఆనందం చూడటం కోసం నిన్ను పిలిపించింది. దివ్యకి దూరం జరిగి నీకు దగ్గర అవుతున్నాడు. దివ్యకి దెబ్బ తగిలేసరికి మొగుడు ప్రేమ బయటకి వచ్చింది
రాజ్యలక్ష్మి: దివ్య విషయంలో మీ బావ నరకం అనుభవిస్తున్నాడు. వాడిని ఈ బాధ నుంచి బయటకి తీసుకొస్తావని ఆశ పడ్డాను. అరిచాడని వదిలేస్తే ఎలా? దివ్య నుంచి విముక్తి కలిగితేనే వాడి జీవితం బాగుపడుతుంది
నందు హనీని తీసుకుని సామ్రాట్ ఇంటికి వస్తాడు. తనని డ్రాప్ చేసి వెళ్లబోతుంటే ధనుంజయ్ వాళ్ళు ఆపుతారు. తులసి రాలేదు ఏంటని రత్నప్రభ దెప్పి పొడిచేలా మాట్లాడుతుంది.
రత్నప్రభ: హనీ మీద ఈ ఇంటి మీద సర్వ హక్కులు మావే.. కేవలం మావే
ధనుంజయ్: ముసలాయన కేవలం సామ్రాట్ కి మాత్రమే పెద్దాయన మాకు కాదు
నందు: సామ్రాట్ కి ఎంత గౌరవం ఇచ్చామో ఆయనకి అంతే గౌరవం ఇచ్చాం
రత్నప్రభ: సామ్రాట్ కి ఎంత గౌరవం ఇచ్చారో ఇప్పుడు మాకు అలాగే అంత గౌరవం ఇవ్వాలి. ఈ ఇంటితో మీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఈ మాటని మా మాటగా తులసికి చెప్పండి
ధనుంజయ్: హనీని అడ్డం పెట్టుకుని తులసి ఈ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది
రత్నప్రభ: తులసిని తన హద్దుల్లో ఉండమనండి. హీరోలా అడ్డుపడి మీ మాజీ భార్యని కాపాడుకోవచ్చని అనుకుంటున్నారేమో
నందు: అసలు మీ సమస్య ఏంటి? తులసికి సహాయం చేయడం తప్ప అన్యాయం చేయడం తెలియదు. మీరు ఎందుకు తనని చూసి భయపడుతున్నారు. తులసి హనీకి దగ్గర అయ్యేది ఆస్తి కోసమని అనుకుంటున్నారు. తనకి అలాంటి పిచ్చి ఆశలు లేవు. ఇంకొక మాట నా దగ్గర మాట్లాడినట్టు తులసితో మాట్లాడితే హనీని తన దగ్గరే ఉంచుకుంటుంది
ALso Read: కృష్ణ-మురారి దొంగ పోలీస్ ఆట, తింగరిపిల్ల అల్లరి చూసి రగిలిపోతున్న ముకుంద!
ఆవేశంగా ఇంటికి వచ్చి వాళ్ళ మాటలు తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. జరిగిన గొడవ తులసికి చెప్తే కోపంగా వెళ్ళి వాళ్ళతో అరుస్తుందని అనుకుంటాడు. తులసి నందుని చూసి పలకరిస్తుంది. హనీ ఎలా ఉందోనని తులసి తనకి కాల్ చేయబోతుంటే నందు కోపంగా ఫోన్ లాగేసుకుంటాడు. నిజం చెప్పకుండా హనీ నిద్రపోయిందని అబద్దం చెప్పి కవర్ చేస్తాడు.