News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gruhalakshmi August 30th: రోత పుట్టించేసిన సీరియల్, సూసైడ్ ప్లాన్ సక్సెస్- ఒకే గూటి కిందకి ఒక భర్త, ఇద్దరు మాజీ పెళ్ళాలు

నందు ఇంటికి చేరడం కోసం లాస్య సూసైడ్ ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

నందు, తులసిని కలపడం కోసం లక్కీ ముసలోళ్లని తీసుకుని పార్క్ కి చెక్కేస్తాడు. ఇక ఇంట్లో మాజీ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఒంటరిగా ఉంటారు. ఎలాగైనా తన ప్రేమ సంగతి చెప్పాలని నందు తులసిని పిలుస్తాడు. తన జీవితం గురించి మాట్లాడాలని అంటాడు.

నందు: తులసితో గడిపిన సంతోష క్షణాలకి సంబంధించిన ఫోటోస్ ఉన్న ఆల్బమ్ చూపిస్తాడు. నా జీవితంలో నీతో గడిపిన మధుర క్షణాలు

తులసి: చేజారిపోయిన తర్వాత కొన్నింటి విలువ తెలుస్తుందని అంటారు అది నిజమే అన్నమాట

నందు: 25 ఏళ్లు మనం భార్యాభర్తలుగా ఉన్నప్పుడు నిన్ను కన్నీళ్ళు పెట్టించాను. ఇప్పుడు అవే నన్ను బాధపెడుతున్నాయి

తులసి: ఇప్పుడు ఆ కన్నీళ్ళు శవం ముందు కార్చేవి. వాటితో ప్రయోజనం లేదు

Also Read: ఇంద్రాదేవి ఆన్ ఫైర్, తలవంచిన కోడలు - కావ్య వ్రతం చేసుకోవడానికి అపర్ణ ఒప్పుకుంటుందా?

నందు: నేను నీకు ద్రోహం చేసినా ఇంట్లో వాళ్ళకి అందమైన జీవితం ఇచ్చావు. నా బాధ్యత కూడా నువ్వే మోశావు. ఈ ఫోటోస్ లో ఉం నందు, తులసిలా నవ్వుతూ ఎప్పటికీ దగ్గరగా ఉండలేమా? గదిలో ఎక్కడ చూసినా సోరి తులసి అని రాసి ఉండటం చూస్తుంది. ఇన్ని రోజులు పడిన బాధకి ముగింపు పలకాలని అనుకుంటున్నా అని గులాబీ పువ్వు తీసుకుని తనకి ఎదురు వెళతాడు. అప్పుడే దివ్య తులసికి ఫోన్ చేసి లాస్య సూసైడ్ చేసుకుని హాస్పిటల్ లో ఉందని చెప్తుంది. వెంటనే తులసి కంగారుగా నందుకి విషయం చెప్పేసి హాస్పిటల్ కి వెళ్దామని అంటుంది.

విక్రమ్, దివ్య, రాజ్యలక్ష్మి హాస్పిటల్ లో టెన్షన్ పడుతూ ఉంటారు. సంజయ్ తనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. తులసి వచ్చి లాస్యకి ఎలా ఉందని అడుగుతుంది. కన్న కొడుకు దూరం చేయడం వల్ల ఇలా జరిగిందని రాజ్యలక్ష్మి తులసి వాళ్ళని దెప్పి పొడుస్తుంది. లక్కీని వెళ్ళమని చెప్పినా వినకుండా మొండితనంగా వాడే ఉంటున్నాడని తులసి చెప్పినా కూడా రాజ్యలక్ష్మి వినిపించుకోదు. సంజయ్ బయటకి వచ్చి లాస్య బాగానే ఉందని స్పృహలోకి వచ్చిందని చెప్తాడు. లక్కీ తల్లి పరిస్థితి చూసి ఏడుస్తాడు.

లక్కీ: ఎందుకు మమ్మీ చచ్చిపోవాలని అనుకున్నావ్

లాస్య: నువ్వు తప్ప నాకు ఎవరున్నారు. నీకు కూడా నేను అక్కర్లేకుండ పోయాను మాట్లాడటం కూడా మానేశాను. నీకోసం ఆ ఇంటికి వస్తే అందరూ తిడుతున్నారు. రాక్షసి అంటున్నారు. ఇంకోసారి గడప తొక్కవద్దు అంటున్నారు. ఇంకా ఎందుకు బతికి ఉండాలి

లక్కీ: సోరి మమ్మీ ఇంకెప్పుడు అలా అనను. నాకు మమ్మీ కావాలి. ఆంటీ నేను మనసు మార్చుకున్నా నాకు మమ్మీ కావాలి

తులసి: సంతోషం నువ్వు మీ మమ్మీతో కలిసి ఉంటున్నందుకు

లక్కీ: మమ్మీ నీతో కలిసి ఉండటానికి ఆంటీ వాళ్ళు ఒప్పుకున్నారు. నువ్వు కూడా నాతో డాడీ ఇంటికి వచ్చేయ్

లాస్య: నీ ఇష్టప్రకారమే వస్తాను నిన్ను బాధపెట్టను

నందు: మేం ఒప్పుకుంది మీ ఇద్దరు కలిసి ఉండటానికి మా ఇంటికి రావడానికి కాదు

Also Read: సైకోలా మారుతున్న ముకుంద - కృష్ణతో యుద్ధం మొదలు, మురారీ పరిస్థితి ఏంటి?

లక్కీ: నాకు మమ్మీతో పాటు డాడీ కూడా కావాలి

నందు: అది కుదరదు

రాజ్యలక్ష్మి: ఎందుకు కుదరదు మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళి లాస్య ఇంట్లో ఉండండి

నందు తులసిని ఏంటి ఇదంతా అంటాడు. తమది అంతా ఒకటే కుటుంబమని అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటామని చెప్తాడు. దీంతో లాస్య మళ్ళీ చనిపోతానని నటిస్తుంది. లక్కీ తులసి కాళ్ళ మీద పడి డాడీ, మమ్మీ ఇద్దరు కావాలని అనాథని చేయవద్దని బతిమలాడతాడు. విక్రమ్ కూడ లాస్యకి సపోర్ట్ గా మాట్లాడతాడు. చేసేది లేక తులసి అందుకు అంగీకరిస్తుంది. మీ మమ్మీని కూడా మా ఇంటికే తీసుకుని వెళ్దామని అనేసరికి తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రాజ్యలక్ష్మి వాళ్ళు సంతోషపడతారు. నందు కోపంగా వెళ్ళిపోతాడు. ఎందుకు లాస్యని ఇంటికి తీసుకెళ్లాడానికి ఒప్పుకున్నావని నందు నిలదీస్తాడు.

లాస్య ఏడుపు కాదు లక్కీ ఏడుపు చూసి వాడికి అన్యాయం చేయలేనని తులసి అంటుంది. దివ్య కూడా తులసి నిర్ణయాన్ని తప్పుబడుతుంది.

తరువాయి భాగంలో..

లక్కీ సంతోషంగా అనసూయ వాళ్ళ దగ్గరకి వచ్చి మమ్మీ ఇంటికి వస్తుందని చెప్తాడు. తులసి మాట ఇచ్చింది చేసేదేమి లేదని నందు అసహనంగా చెప్తాడు. ఇక లాస్య ఎప్పటిలాగానే తులసిని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. తన అసలు రూపం బయట పెడుతుంది. నిన్ను నమ్మి తప్పు చేశానని తులసి తలబాదుకుంటుంది.

Published at : 30 Aug 2023 10:19 AM (IST) Tags: Gruhalakshmi Serial Written Update Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Kasthuri Gruhalakshmi Serial August 30th Update

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?