By: ABP Desam | Updated at : 17 Aug 2023 10:10 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
లాస్య చెప్పినట్టుగానే లక్కీ ఎవరికీ కనిపించకుండా నందు ఇంట్లోకి దూరతాడు. తులసి నందు కోసం టిఫిన్ చేసి టేబుల్ మీద పెడుతుంది. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లాస్య తెగ సంబరపడుతుంది. వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది. లక్కీ మళ్ళీ కనిపించడం లేదని, ఇంట్లో నుంచి పారిపోయాడని బాధపడుతున్నట్టుగా నటిస్తూ మాట్లాడుతుంది. ఆ మాట వినేసరికి తులసి నిజమే అనుకుని కంగారుపడుతుంది. అక్కడికి వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని లాస్య అంటే సరేనని చెప్తుంది. కంగారుగా పరంధామయ్య వాళ్ళ దగ్గరకి వెళ్ళి లక్కీ మళ్ళీ పారిపోయాడంట లాస్య ఏడుస్తూ ఫోన్ చేసిందని చెప్తుంది. అలా ఎలా పారిపోతాడు. తల్లిగా ఆ మాత్రం కూడా చూసుకోలేదా అని నందు అంటాడు. వాళ్ళ మాటలన్నీ లక్కీ దూరం నుంచి వింటూ ఉంటాడు. మనం కూడా వెళ్ళి లక్కీని వెతుకుదామని తులసి అంటే వద్దని అంటాడు.
Also Read: కృష్ణని అపార్థం చేసుకుని అసహ్యించుకున్న నందు- మెసేజ్ డిలీట్ చేసిన మురారీ
దివ్య, ప్రియ కలిసి రాజ్యలక్ష్మి తిక్క కుదర్చడం కోసం ప్లాన్ చేస్తారు. దివ్య రాజ్యలక్ష్మి గదిలోకి వెళ్తుంది. మావయ్యని కష్టాలు పెట్టి నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని రాజ్యలక్ష్మి బాత్ రూమ్ లో కొబ్బరి నూనె పోస్తుంది. అప్పటి వరకు రాజ్యలక్ష్మినిన్ ప్రియ గదిలోకి వెళ్ళకుండా మాటల్లో పెట్టి మేనేజ్ చేస్తుంది. ఈలోపు దివ్య పని పూర్తి చేసి బయటకి వచ్చేస్తుంది. లోపల సెట్టింగ్ రెడీ అయిపోయింది. ఇంకాసేపటిలో రాజ్యలక్ష్మి నూనె మీద కాలేసి జారిపడుతుందని తోడికోడళ్ళు నవ్వుకుంటారు. అప్పుడే చచ్చాను బాబోయ్ అని రాజ్యలక్ష్మి కింద పడి గావు కేక పెడుతుంది. సంజయ్ తల్లి కాలు చెక్ చేస్తాడు. నిజంగా పడిందా లేదంటే నాటకం ఆడుతుందా అని బసవయ్య వాళ్ళు అనుకుంటారు. రాజ్యలక్ష్మి కాలు విరిగిపోయిందని వీల్ చైర్ కి పరిమితం అయిపోతుందేమోనని ప్రకాశం అంటాడు.
ప్రకాశం: ఏంటమ్మా నడవడం కష్టమేనా?
సంజయ్: జారి పడటంతో కాలు బెణికింది. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది
ప్రకాశం: నాకు ఎందుకో అనుమానంగా ఉంది. దివ్య నువ్వు కూడా ఒకసారి టెస్ట్ చేయమ్మా
పెద్దాయన: రాజ్యలక్ష్మి అడ్డం పడితే హాస్పిటల్ వ్యవహారాలు ఎవరు చూస్తారు
ప్రకాశం: సంజయ్ చిన్న పిల్లోడు తను ఎలా చూస్తాడు. విక్రమ్ ఈ వారం రోజులు హాస్పిటల్ వ్యవహారాలు నువ్వే చూసుకో
విక్రమ్: నాకేం తెలుసు నేనేం చదువుకున్నాన
ప్రకాశం; చదువుకున్న పెళ్ళాం పక్కన ఉంది కదా ఇంకేంటి సమస్య. మీ అమ్మ మొహం చూడు నువ్వు కాదంటున్నావ్ అని ఎంత బాధపడుతుందో. మీ అమ్మ కష్టాల్లో ఉంటే ఆ మాత్రం బాధ్యత తీసుకోవా? ఇదేనా అమ్మ రుణం తీర్చుకునే పద్ధతి
విక్రమ్: నేను హాస్పిటల్ బాధ్యతలు తీసుకుంటానులే
పరంధామయ్య ఆమ్లెట్ కావాలని తులసిని అడుగుతాడు. అనసూయ మాత్రం వేయొద్దని చెప్తుంది. కానీ తులసి నందు కోసం ఆమ్లెట్ వేసి టేబుల్ మీద పెడుతుంది. అది లక్కీ వెళ్ళి దొంగతనంగా తీసుకుని తినేస్తాడు. నందు వచ్చి ఆమ్లెట్ కోసం వెతుకుతాడు. వేయడం మర్చిపోయానేమో అనుకుని తులసి మళ్ళీ ఆమ్లెట్ వేసి ఇస్తే దాన్ని కూడా లక్కీ లాగించేస్తాడు. రాజ్యలక్ష్మి ఇంట్లో పని చేసే ఆవిడ హాస్పిటల్ లో తన కొడుక్కి టెస్ట్ లు చేయించిందని నర్స్ వచ్చి సంజయ్ కి చెప్తుంది.
Also Read: రాజ్ కి ఉప్మా కష్టాలు- అపర్ణ బుర్రలో విషం నింపుతున్న రుద్రాణి
పనిమనిషి: బిల్లు లేకుండానే టెస్ట్ లు చేయించుకోమని దివ్యమ్మ చెప్తేనే వచ్చాను సర్
సంజయ్: బిల్లు పదిహేను వేలు అయ్యింది. కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను
దివ్య: టెస్ట్ లు చేయించావా?
పనిమనిషి: టెస్ట్ లు ఏమో కానీ బిల్లు పదిహేను వేలు అయ్యింది
దివ్య: బిల్లు ఏంటి? నేను వద్దని చెప్పాను కదా
సంజయ్: బిల్లు కట్టకపోతే ఆడిట్ నుంచి ప్రాబ్లం అవుతుంది. దీని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు దివ్య
దీంతో దివ్య వెంటనే సంజయ్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అంటున్నాడని ఇరికిస్తుంది. హాస్పిటల్ పెట్టింది సేవ చేయడానికి సంపాదన కోసమని క్లాస్ పీకుతాడు.
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
/body>