అన్వేషించండి

Krishna Mukunda Murari August 17th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: కృష్ణని అపార్థం చేసుకుని అసహ్యించుకున్న నందు- మెసేజ్ డిలీట్ చేసిన మురారీ

కృష్ణ అత్తింటిని వీడి వెళ్లిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఇంట్లో పెళ్లి అగ్రిమెంట్ సంగతి చెప్పకుండా వెళ్లిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉందని కృష్ణ బాధపడుతుంది. తర్వాత అగ్రిమెంట్ సంగతి తెలిస్తే అందరూ ఏమనుకుంటారు. ‘నా అవసరం కోసం మీ ఫ్యామిలీని మోసం చేశానని అనుకుంటారు కదా. నన్ను చెప్పనివ్వలేదు. మీరు చెప్పలేదు కానీ అందరి దృష్టిలో నన్ను దోషిని చేశారని’ ఫీలవుతుంది. ఇద్దరూ విడిపోతున్నందుకు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అప్పుడే కృష్ణ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. నందు మెసేజ్ చేసిందా? ఖచ్చితంగా తను నా ప్రేమ గురించి చెప్తూ మెసేజ్ చేసి ఉంటుంది. అది కృష్ణ చూడకూడదని మురారీ మనసులో అనుకుంటాడు. దారి మధ్యలో ఒక చోట ఆగి కారు దిగి షాపు దగ్గరకి వెళ్తుంది కృష్ణ. అప్పుడు మురారీ కృష్ణ ఫోన్ తీసుకుని నందు పంపించిన మెసేజ్ డిలీట్ చేస్తాడు. ఒకరి ప్రేమ మరొకరు చెప్పుకోకుండా అపార్థాలు చేసుకుంటూ దూరం కావడం ఏంటో? రోజురోజుకీ సీరియల్ మరింత వరస్ట్ గా మార్చేస్తున్నారు.

నందు కృష్ణ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇందాకటి దాకా కృష్ణ డీపీ కనిపించింది ఇప్పుడు అది కూడా కనిపించడం లేదంటే తను నెంబర్ బ్లాక్ చేసి ఉంటుందని నందు అనుకుంటుంది. కాల్ ట్రై చేస్తే కలవదు. చాలా బాధగా ఉంది గౌతమ్.

Also Read: రాజ్ కి ఉప్మా కష్టాలు- అపర్ణ బుర్రలో విషం నింపుతున్న రుద్రాణి

నందు: వాయిస్ మెసేజ్ వినే బ్లాక్ చేసింది. మా అన్నయ్య చెప్పింది కరెక్ట్ తను వాడిని ప్రేమించడం లేదు

గౌతమ్: కృష్ణ విషయంలో మురారీ కరెక్ట్ గానే ఉన్నాడు. ఇందులో కృష్ణ తప్పు లేదు. కృష్ణ దృష్టిలో మురారీ జీవితాన్ని ఇచ్చిన దేవుడు అని ఉంది

నందు: కేవలం తన గోల్ రీచ్ అవడం కోసం అన్నయ్యని, మా ఫ్యామిలీని మోసం చేసినట్టే కదా. ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా ఎలా ఉంటారు. మనసులో ఇంత పెట్టుకుని పైకి ఎంత ప్రేమ ఒలకబోసింది. వాడితో నటించినట్టే మనతో కూడా నటించి ఉంటుంది కదా. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి. పద వెళ్లిపోదాం

నంది వెలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్ దగ్గరకి మురారీ కృష్ణని తీసుకుని వస్తాడు. ఇద్దరూ మళ్ళీ మనసులోనే మాట్లాడుకుంటారు. జీవితాంతం మిమ్మల్ని మార్చిపోలేనని కృష్ణ మనసులో అనుకుని చేతులెత్తి దణ్ణం పెడుతుంది. తన బ్యాగ్స్ మొత్తం కారులో నుంచి తీసుకోవడంతో కృష్ణ ఇక రాదు తన నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుందని మురారీ బాధపడతాడు. కృష్ణని దింపేసి వెళ్ళిపోతాడు. తను వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

Also Read: ట్విస్టుల మీద ట్విస్టులు, అభిమన్యుతో చేతులు కలిపిన మాళవిక - వేద మీద రౌడీల అటాక్

భవానీ దేవి గదిలో కృష్ణ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. మీరే నాకు గురువు, దైవం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని లెటర్ రాసి పెడుతుంది. అది చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. ఇక ముకుంద కృష్ణ లేదని హ్యాపీగా ఉంటుంది. ఇంటి గుమ్మం ముందు నిలబడి ఈ ఇంట్లోకి ఆదర్శ్ భార్యగా ఎడమ కాలు పెట్టి లోపలికి వచ్చాను. ఇప్పుడు మురారీ భార్యగా కుడి కాలు పెట్టి లోపలికి వస్తానని అనుకుని అలాగే ఇంట్లోకి వస్తుంది. మురారీతో సంతోషంగా గడిపినట్టు ఊహించుకుంటుంది. టేబుల్ మీద ముకుందకి కృష్ణ లెటర్ రాసి పెడుతుంది. పెళ్లి శాశ్వతం, ప్రేమని మర్చిపొమ్మని చెప్తుంది. ఆ పేపర్ ని కోపంగా విసిరేస్తుంది. ముకుంద నీకు అన్నీ తెలుసు. నీ ప్రేమని మర్చిపోయి పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపు. నీ టాలెంట్ ని నీలో దాచుకోకుండా ప్రపంచానికి తెలిసేలా చెయ్యి. నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ దాన్ని చెరగనివ్వకు అని రాస్తుంది. ఆ లెటర్ ని కోపంగా చింపేస్తుంది.

ముకుంద: నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు కానీ మురారీ భార్యగా వచ్చావని అసూయ. నాకు దక్కాల్సిన ప్రేమ నీకు ఎక్కడ దక్కుతుందా అని భయం. కానీ ఇప్పుడు నీమీద మంచి ఫీలింగ్ కలిగింది. నువ్వు నాకు మంచి ఫ్రెండ్

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
Godavari Serial Today July 14th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
Nindu Manasulu Serial Today July 14th: నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!
నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget