Gruhalakshmi July 14th Update: సామ్రాట్ ఎంట్రీ అదుర్స్ - నందు యాక్సిడెంట్ చేసిన పాపని కాపాడి తులసి చిక్కుల్లో పడనుందా?
తులసి జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చేశాడు. దీంతో కథనం ఆసక్తిగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గృహలక్ష్మి సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది. నందు, లాస్య కలిసి సామ్రాట్ అనే వ్యక్తిని కలిసేందుకు కారులో వెళ్తుండగా రోడ్డు మీద వెళ్తున్న పాపని ఢీ కొడతారు. దీంతో పాప కింద పడి బాగా దెబ్బలు తగులుతాయి. పాప కింద పడిపోవడంతో నందు చూడటం కోసం వెళ్లబోతుంటే లాస్య ఆపేస్తుంది. అటుగా వెళ్తున్న తులసి కిందపడిపోయిన పాపని చూసి వెంటనే తనని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. అది గమనించిన నందు తప్పు చేసింది నేను కానీ తులసి ఇబ్బంది పడుతుంది మనం కూడా హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు కానీ లాస్య ఒప్పుకోదు. అయిన లాస్య మాట వినకుండా నందు హాస్పిటల్ కి వెళతాడు.
డాక్టర్ వచ్చి పాపకి ఏమైంది మీకు ఏమవుతుందని అడుగుతుంది. ఇక తులసి పాప నా కూతురే అని చెప్తుంది. తనని ఎలాగైన కాపాడండి అని వేడుకుంటుంది. యాక్సిడెంట్ అయిన చిన్నారి గురించి నందు ఆందోళన పడుతుంటే లాస్య మాత్రం అతడిని హాస్పిటల్ నుంచి బయటకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక పాపని వెతుక్కుంటూ తనకి సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్ అయిన దగ్గరకి వచ్చి చూసి ఎవరో పాపని కిడ్నాప్ చేశారని అనుకుంటారు. ఇక నందు, లాస్య సామ్రాట్ దగ్గరకి ఇంటర్వ్యూ కి వస్తారు. సామ్రాట్ ఆఫీసు కి వెళ్ళగానే పాప కనిపించడం లేదంటూ పనివాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఇంటికి వచ్చిన సామ్రాట్ ఇంట్లో పని వాళ్ళని తిడతాడు. సీన్ మళ్ళీ హాస్పిటల్ దగ్గరకి వస్తుంది. పాపకి బాగానే ఉంది కాకపోతే షాక్ కు గురైందని డాక్టర్ చెప్పడంతో తులసి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక తనని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకి చేరిస్తే నా బాధ్యత తీరిపోతుందని అనుకుంటుంది. అది నందు, లాస్య కూడా వింటారు.
Also Read: అదిరిపోయే సీన్, నిజం తెలుసుకున్న యష్- ఇక కైలాష్ కి దబిడి దిబిడె
ఇక తులసి పాప దగ్గర కూర్చుని తనతో మాట్లాడుతుంది. నా పేరు హాసిని ఇంట్లో అందరూ హనీ అని పిలుస్తారని ఆ చిన్నారి తులసికి చెప్తుంది. చిన్నపిల్లవి రోడ్డు మీదకి సైకిల్ మీద రావొచ్చా అందరూ కంగారు పడతారు మీ డాడీ నెంబర్ చెప్పు ఫోన్ చేస్తానని అడుగుతుంది. అయ్యో ఈ ఆంటీ కూడా మా నాన్నలాగా మాట్లాడుతుంది నేను ఊరంతా తిరగాలని అనుకుంటున్నా డాడీకి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుందని మనసులో అనుకుంటుంది. ఈ ఆంటీ ని అడ్డుపెట్టుకుని ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చెయ్యాలని ఫోన్ నెంబర్ చెప్పకుండా తప్పించుకుంటుంది. ఇల్లు ఎక్కడో చెప్పమని తులసి అడుగుతుంది. నాకు గుర్తుకురావడం లేదని పాప అబద్ధం చెప్తుంది. ఇల్లు ఎక్కడో చూపిస్తానని చెప్పి తులసిని ఆటోలో ఊరంతా తిప్పుతూ ఉంటుంది. మరోవైపు పాప కోసం సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు.