(Source: ECI/ABP News/ABP Majha)
Ennenno Janmalabandham April 24th: వసంత్ దగ్గర మాట తీసుకున్న మిస్టర్ యారగెంట్- వేద, యష్ ని కలనివ్వకుండా మాళవిక ప్లాన్
యష్ వేదకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేదకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యానని యష్ అంటాడు. తనకి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పమని వసంత్ యష్ ని నిలదీస్తాడు. అప్పుడే వేద కాల్ చేస్తుంది. మీరు అమెరికా వెళ్తున్నారా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా? నాకు చెప్పకూడదు అనుకున్నారా అని అడుగుతుంది. నువ్వు పడుకుని ఉన్నావ్ ఆఫీసుకి వచ్చేశాను జస్ట్ పది రోజులు ట్రిప్ మాత్రమే అంటాడు. నేను పంపించను వసంత్ ని పంపించొచ్చు కదా అంటుంది. మీటింగ్ లో ఉన్నానని అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. పది రోజులు ఆయన్ని వదిలి పెట్టి ఉండగలనా అనుకుంటుంది. నీకు దణ్ణం పెడతాను యష్ మనసు మార్చుకో ఇది కరెక్ట్ కాదు విడాకులు అంటే వేద వదిన తట్టుకోలేదని చాలా బాధగా వసంత్ చెప్తాడు. నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేను నా తమ్ముడిగా నా నిర్ణయాన్ని గౌరవిస్తే చాలు. నేను అమెరికా ఫ్లైట్ ఎక్కిన ఒక గంట తర్వాత మీ వదినకి ఈ విడాకుల పేపర్స్ ఇవ్వాలని యష్ చెప్తాడు.
Also Read: భవానీకి ఎదురుతిరిగిన మురారీ- నందినికి గతం గుర్తుకు వస్తుందా? పెళ్లి జరుగుతుందా?
వదినకి నేను ద్రోహం చేయలేనని వసంత్ చాలా బాధపడతాడు. దీంతో యష్ వసంత్ చేతిని తన తల మీద పెట్టుకుని వినకపోతే నేను చచ్చినంత ఒట్టు. నాకు ప్రామిస్ చెయ్యి నేను చెప్పినట్టు చేస్తానని. ఈ మాట ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయి. నా మాట జవాదాటావో నా శవాన్ని చూస్తావని యష్ ఖరాఖండీగా చెప్తాడు. ప్రామిస్ వదినకు నేను చచ్చినా చెప్పనని కోపంగా వెళ్ళిపోతాడు. దుర్మార్గుడిని కాదు నేను భర్త స్థానంలో నేనొక ఫెయిల్యూర్. ఒప్పందం పెళ్లి చేసుకుని కలిశాం, ఒప్పందం అయిపోయింది విడిపోతున్నాం. వేద హ్యాపీగా ఉండాలి అలా జరగాలంటే నేను దూరం అవాలి. అందరూ నా మీద కొప్పడవచ్చు నిందిస్తారు. అన్నీ భరిస్తాను. నలుగురిలో చులకన కావడం నాకేమీ కొత్త కాదు కదా అని యష్ బాధపడుతూ ఉంటాడు. అటు ఇంట్లో వేద తన ప్రేమను యష్ కి చెప్పడం కోసం లవ్ లెటర్ రాస్తూ ఉంటుంది.
Also Read: అఖిల్ బాబుకి బారసాల, గొడవ చేసిన జెస్సి - రామని జానకి తీసుకొస్తుందా?
విన్నీ ఫోన్ చేస్తే యష్ అమెరికా వెళ్తున్నాడని బాధగా చెప్తుంది. ఆయన వెళ్ళేలోపు నా మనసులో ఫిలింగ్స్ చెప్పాలని ఉంది అందుకే ఒక లెటర్ రాస్తున్నానని చెప్పి రాసింది చదివి వినిపిస్తుంది. ఇవన్నీ అవసరమా కళ్ళ ముందు మీ ఆయన ఉంటే ఈ లెటర్స్ ఎందుకు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చెప్పేసేయ్ వేరే ఆలోచన చేయకు. మీ ఆయన్ని తీసుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ రెడీ చేసి కళ్ళలో కళ్ళు పెట్టి నీ మనసులో ప్రేమ చెప్పేయ్ అని ఐడియా ఇస్తాడు. వేద ఆఫీసుకి వచ్చి యష్ ని పార్టీకి తీసుకుని వెళ్తానని అంటుంది. వసంత్ విషయం చెప్పబోయి కూడా ఆగిపోతాడు. మనం ఇద్దరం రెస్టారెంట్ కి వెళ్ళి పార్టీ చేసుకుందాం రమ్మని వేద గోముగా అడుగుతుంది. రేపటి నుంచి ఉండరు కదా అమెరికా వెళ్తున్నారుగా మళ్ళీ ఉండరు రండి ప్లీజ్ అని బతిమలాడుతుంది. యష్ రావడంతో వేద మొహం వెలిగిపోతుంది. యశోధర్ నీకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతున్నాడు తప్పు చేస్తున్నావ్ రా వదిన, యష్ విడిపోకుండా నువ్వే కాపాడాలని వసంత్ మనసులోనే కోరుకుంటాడు. ఇద్దరూ ఒక రెస్టారెంట్ కి వస్తారు. ఆ రెస్టారెంట్ యానివర్సరీ సందర్భంగా కాంపిటీషన్ పెట్టామని గెలిస్తే ప్రైజ్ మనీ ఇస్తామని హోటల్ లో పని చేసే అమ్మాయి చెప్తుంది.