Ennallo Vechina Hrudayam Serial Today March 28th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: ఒక్కటైపోయిన గాయత్రీ, అనంత్.. ఊర్వశితో పెళ్లి ఫిక్స్ చేసిన త్రిపుర.. గాయత్రీకి నిజం తెలిస్తే!!
Ennallo Vechina Hrudayam Today Episode అనంత్ ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పడం త్రిపుర ఊర్వశిని అనంత్ ప్రేమిస్తున్నాడని అనుకొని ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్ గాయత్రీకి వీడియో చూపిస్తాడు. మీ ఇంటికి కూడా వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర పెళ్లి ఏర్పాట్లు చూసి ఆ వెధవ మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నాను అని సారీ చెప్తాడు. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప ఇంకెవరినీ నా పక్కన స్థానం లేదని నన్ను ప్రేమిస్తే ఈ ఉంగరం తీసుకో అని అంటాడు. గాయత్రీ తీసుకోవడం లేదని హర్ట్ అయి వెళ్లిపోతాడు కానీ గాయత్రీ చేతులు కట్టేసి ఉండటం గమనించడు.
గాయత్రీ సైగ చేస్తే అప్పుడు కట్లు విప్పుతాడు. చేతులు కట్టేసి ఉంగరం తీసుకో అంటే ఎలా అని అడుగుతుంది. దాంతో కట్లు విప్పి అనంత్ రింగ్ ఇస్తాడు. గాయత్రీ రింగ్ తీసుకొని తప్పుగా అర్థం చేసుకున్నా అని సారీ చెప్పి అనంత్‌ని హగ్ చేసుకుంటుంది. ఇక ఉదయం అనంత్ దగ్గరకు త్రిపుర వెళ్తుంది.
త్రిపుర: అనంత్ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి. అనంత్ గారు మీరు మా చెల్లి ప్రేమించుకుంటున్నారు కదా.
అనంత్: గాయత్రీ నా గురించి త్రిపుర గారికి చెప్పుంటుంది. అవును అండీ కానీ చిన్న ప్రాబ్లమ్ ఉంది.
త్రిపుర: ప్రేమ అంటేనే ప్రాబ్లమ్ అండీ మీరు క్లియర్‌గా ఉంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీ ఇంటి వాళ్లకి చెప్పే ధైర్యం ఉండాలి.
అనంత్: మీరు మీ చెల్లిని ఒప్పిస్తారా.
త్రిపుర: మా చెల్లి మిమల్ని డీప్‌గా ప్రేమిస్తుంది. ఆలస్యమే ప్రేమకు శత్రువు.
అనంత్ ఇప్పుడే తన ప్రేమ గురించి ఇంట్లో అందరికీ చెప్తానని లోపలికి వెళ్లి అందరికీ పిలుస్తాడు. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అందరికీ చెప్తాడు. అనంతూ నువ్వు లవ్ చేస్తున్నావా ఎవరు ఆ అమ్మాయి అని బాల అడుగుతాడు. దానికి అనంత్ మన త్రిపుర గారి చెల్లి అని చెప్తాడు. త్రిపుర బామ్మతో మీకు గుడిలో కనిపించిందే తనే మా చెల్లి అని చెప్తుంది. అనంత్ గాయత్రీ గురించి చెప్తే త్రిపుర, బామ్మ వాళ్లు ఊర్వశి అనుకుంటారు. వాసుకి ఇంట్లో వాళ్లతో మీరు ఎందుకు సంబర పడిపోతున్నారు... ఈరోజుల్లో అమ్మాయిలు డబ్బున్న వాళ్లకి వల వేస్తున్నారని అంటుంది. మేం అలాంటి వాళ్లం కాదని అంటుంది. బామ్మ కూడా త్రిపుర ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా తన చెల్లి కూడా అలాగే ఉంటుందని మా నమ్మకం అని బామ్మ, యశోద వాళ్లు చెప్తారు. మొత్తానికి అనంత్ ప్రేమకు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అనంత్ గాడి పెళ్లి అంటూ గెంతులేస్తాడు. శ్రీరామ నవమి రోజు నిశ్చితార్థం చేసుకుందామని బామ్మ ఇంట్లో చెప్పమని అంటుంది. అందరికీ చాలా థ్యాంక్స్ అని అనంత్ అంటాడు.
బాలకి త్వరగా నయం అయిపోతే ముందు బాలకి పెళ్లి చేయాలని కానీ దేవుడు ఇలా తలరాత రాశాడని యశోద ఏడుస్తుంది. బాల తల్లిని ఏడ్వొద్దని చెప్తాడు. ఇక అనంత్ రెండు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తానని చెప్తాడు. మనసులో తర్వాత వచ్చి గాయత్రీకి సర్‌ఫ్రైజ్ చేయాలి అనుకుంటాడు. ఇక త్రిపుర బాలకి ధ్యానం చేయడం నేర్పిస్తుంది. త్రిపుర కళ్లు మూసుకొని ధ్యానం చేస్తుంటే బాల ధ్యానం చేయకుండా దగ్గరకు వచ్చి త్రిపురని చూస్తాడు. ఇలా చేస్తున్నారేంటి అని అడిగితే నువ్వే కదా సుందరి శ్వాస మీద ధ్యాస పెట్టమన్నావ్ కదా అందుకే నీ శ్వాస మీద నేను ధ్యాస పెట్టానని అంటాడు. ఇక వాసుకి, నాగభూషణం ఎందుకు మా బాబుతో ఇలా చేయిస్తున్నావ్ అంటే మంచిది అని త్రిపుర చెప్తుంది. తర్వాత బామ్మ, యశోద అక్కడికి వచ్చి చూస్తారు. బాల త్రిపుర చెప్పినట్లు చేస్తుంటే చాలా సంతోష పడతారు. యోగా చేస్తే మామూలుగా అయిపోతాడా అని వాసుకి వాళ్లు అనుకుంటారు. త్రిపురని చూస్తే వాడిని మామూలు మనిషిని చేసేలా ఉందని అనుకుంటారు. ఫణి బాలని పూర్తిగా పిచ్చెక్కించేలా చేస్తానని అందుకు యాపిల్‌లో మెడిసిన్ కలిపిన ఇంజక్షన్ వేస్తానని చెప్పి వేస్తాడు. ఇక బాల వచ్చి ఆకలి వేస్తుంది అని అంటాడు. యాపిల్ ఇవ్వమని బామ్మ చెప్తుంది. త్రిపుర వెళ్లి ఇంజెక్షన్ చేసిన యాపిల్ తీసుకొస్తుంది. బాల తినడానికి రెడీ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















