అన్వేషించండి
Ennallo Vechina Hrudayam Serial Today February 8th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: ఆఈఊ అంటే ఏంటి? లవర్స్‌కి కొత్త పజిల్.. త్రిపురతో రత్నమాల బేరం!
Ennallo Vechina Hrudayam Today Episode బాల త్రిపుర తండ్రికి ఇవ్వాల్సిన చెక్కును అనంత్ ఫైల్‌లో పెట్టడం అనంత్ ఆ ఫైల్ గాయత్రీకి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్
Source : Zee5/YouTube
Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల ఒక్కసారిగా మామూలు మనిషిగా మారి లెక్కలన్నీ చెప్పేస్తాడు. ఇంతలో మళ్లీ చిన్న పిల్లాడిలా అయిపోతాడు. బాలలో మార్పు వస్తుందని అందరూ సంతోషపడతారు. బాల బాబాయ్ పిన్ని మాత్రం వాడు మామూలు మనిషిగా మారకూడదని అందుకు ఎవరూ లేని టైం చూసి ఎప్పటికీ బాల మారకుండా ఉండేందుకు ఓ మందు పట్టాలని అనుకుంటారు.
బాల ఆడుకుంటూ ఉండగా ఫైల్స్ కింద పడిపోతాయి. ఇంతలో ఆ ఫైల్స్‌లో త్రిపుర తండ్రికి ఇవ్వాల్సిన చిట్టీ చెక్ చూసిన బాలకి ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు మాటలు గుర్తొస్తాయి. అంతలోనే మర్చిపోతాడు. అనంత్ వచ్చేలోపు అంతా సర్దేయాలి అని ఆ ఫైల్ తీసుకెళ్లి పక్కన పెట్టేస్తాడు. అనంత్ రావడంతో ఆ ఫైల్ ఇచ్చి నేనేం కింద పడేయలేదు అని చెప్తాడు. మరోవైపు రమాదేవి ఏదో ప్లానే వేసి ఇంట్లో త్రిపుర తప్ప ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకుంటుంది. గాయత్రీ ఆఫీస్‌కి వెళ్తూ అక్కకి బాయ్ చేప్తే రమాదేవి గాయత్రీకి జాగ్రత్తలు చెప్తుంది. దాంతో ఎప్పుడూ లేనిది ఈవిడ జాగ్రత్తలు చెప్తుంది ఏంటా అని గాయత్రీకి అనుమానం వస్తుంది. గాయత్రీ ఆఫీస్‌కి వెళ్తుంటే రత్నమాల, గిరి ఎదురవుతారు.
రత్రమాల: ఏంటి కోడలా మా అన్నయ్య ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు చేసేశావా. అసలు వ్యక్తి మా పెద్ద వదిన వచ్చేస్తుందా.
త్రిపుర: అమ్మ వస్తుంది అత్తయ్యా.
రత్రమాల: ఎలా వస్తుందే అక్కడ సేటు 15 లక్షలు ఇస్తే కానీ వదలను అన్నాడు కదా. ఎలా వస్తుంది. ఇదిగో నీ చెల్లెలు దగ్గర నిజం దాచేసినట్లు నా దగ్గర నీ పప్పులు ఉడకవు. దాయలేవు. పాపం వదిన పాస్ పోర్ట్ లాగేసుకున్నారంటగా. అసలు ఈ దేశానికి ఎలా వస్తుందే.
గిరి: ఏంటి ఏంటి బాధ పడుతున్నావు. నిన్ను బాధ పడనిస్తానేంటి. డబ్బులు తీసుకొచ్చాను తీసుకో.
త్రిపుర: నా కష్టాన్ని తెలుసుకొని మీరు ఇంత సాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా అయినా తీర్చుకుంటాను.
గిరి: ఈ ముక్క డబ్బు తీసుకొని చెప్పు.
రత్నమాల: ఆగు. ఆ డబ్బు నువ్వు ముట్టుకోవాలి అంటే నీ మెడలో నా కొడుకు తాళి కట్టాలే. అట్టా జరిగిన మరుక్షణమే ఆ డబ్బు అంతా నీదే. అప్పుడు మీ అమ్మని స్వేచ్ఛగా ఇక్కడికి తీసుకురావొచ్చు.
పెద్దాయన: అసలు నువ్వు మనిషివేనా. కష్టంలో ఉన్న ఆడపిల్లని ఆదుకోకుండా పెళ్లి బేరాలు పెడుతున్నావ్.
రత్నమాల: ఓసోస్ నువ్వే చెప్పావ్ కదా నాన్న దీపం ఉండగానే ఇళ్లు సక్కబెట్టాలని. మా కోరిక మీరు తీర్చుకొని ఆ డబ్బు తీసుకొని మీ కోరిక మీరు తీర్చుకోండి. ఇలాగే ఉండిపోయావ్ అనుకో మీ నాన్నకి దినం పెట్టిన తర్వాతే మీ అమ్మకి తద్దినం పెట్టాల్సి ఉంటుంది.
త్రిపుర: అత్తయ్యా ఏంటి ఆ మాటలు.
పెద్దాయన: నోర్ముయ్ కూతురివి అని వాడు నా మనవడు అని ఆగుతున్నా. నా కొడుకు చచ్చిపోయిన రోజే వాడు ఇచ్చిన మాట చచ్చిపోయింది అనుకో. ఇలాంటి రౌడీకి నా మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయను మెడ పట్టుకొని గెంటేయకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.
డబ్బు వాళ్లు ముఖాన కొట్టి వాళ్లని పంపేస్తాడు. రమాదేవిని కూడా పెద్దాయన తిట్టి పంపేస్తాడు. త్రిపుర చాలా ఏడుస్తుంది. మరోవైపు అనంత్ ఫైల్‌లో గాయత్రీ కోసం సైట్ దగ్గర వెయిట్ చేస్తాడు. గాయత్రీ రావడంతో ఫైల్ గాయత్రీకి ఇస్తాడు. రిజస్ట్రేషన్ పెట్టుకుందామని అంటాడు. సరే అని చెప్పి గాయత్రీ వెళ్లబోతే అనంత్ ఆపి కాసేపు మాట్లాడుకుందామని అంటాడు. గాయత్రీ కూడా అనంత్‌తో మీ కోసం ఎంత టైం అయినా కేటాయిస్తాను అంటుంది. అనంత్ ప్రేమగా మాట్లాడితే గాయత్రీ అలా చూస్తూ ఉంటుంది. అనంత్ తన వైపు చూసిన తర్వాత ఏం తెలీనట్లు నటిస్తుంది. అనంత్ తిరునాళ్లలో ఇచ్చిన గిఫ్ట్ గురించి అడుగుతాడు.
బియ్యం గింజ మీద ఏం రాశానో చూశారా అని అడుగుతాడు. చూశాను అని గాయత్రీ అంటే ఏం అర్థమైంది అని ఒక్క ఐ అనే లెటరే ఉందని నాకు ఏం అర్థం కాలేదు అని అంటుంది. దాని మీద ఏం ఉందో మీరు చూశారు నాకు సమాధానం చెప్పు అని అడుగుతాడు. గాయత్రీ చెప్తాను అని అర్థం కానట్లు ఐలవ్‌యూ అంటుంది. ఆఈఊ అంటుంది. దానిలోనే నా సమాధానం ఉందని అర్థం చేసుకోమని అంటుంది. దీని అర్థం ఏంటి అని అనంత్ అనుకుంటాడు. త్రిపుర తెలిసిన వాళ్ల అందరి దగ్గరకు వెళ్లి డబ్బు సాయం అడుగుతుంది. ఎవరూ లేవని చెప్పేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్‌కి షాక్ మీద షాక్‌లు.. పుల్ల పెట్టేసిన మేన కోడలు.. హోమం దగ్గర ఏం గొడవో!
ఇంకా చదవండి





















