Ennallo Vechina Hrudayam Serial Today February 6th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గల్ఫ్‌లో చిక్కుకున్న త్రిపుర తల్లి.. 15 లక్షలు ఫైన్ త్రిపుర కట్టగలదా!
Ennallo Vechina Hrudayam Today Episode రమాప్రభ రత్నమాల దగ్గరకు వెళ్లి డబ్బు అడగటం త్రిపుర, గిరిలకు పెళ్లి అయితేనే ఇస్తానని రత్ర తేల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బామ్మ చిన్నకొడుకు కోడలి మీద విశ్వరూపం చూపిస్తుంది. బాల తెలివి వల్ల ఆస్తి పదింతలు పెరిగిందని ఇంకోసారి మావి మీవి అంటే ఊరుకునేది లేదని సీరియస్ అవుతుంది. మరోవైపు రత్నమాల ఇంటికి రమాప్రభ, ఊర్వశి వెళ్తారు.
రమాప్రభ: వదిన మాకు ఏం కావాలి అన్నా నువ్వే దిక్కు కదా వదిన. ఇది తన కొత్త ల్యాప్‌ట్యాప్ పాడు చేసుకుంది. ఇప్పుడు కొత్తది కావాలంటే ఒక 50 వేలు ఉంటే ఇవ్వు వదిన. త్రిపురని మీ ఇంటి కోడలిగా నేను చేస్తాను వదిన. అందుకే కదా వాళ్ల నాన్న ఏ మాట ఇవ్వకపోయినా గిరి ఇచ్చినట్లు చెప్పి అందరూ నమ్మేలా చేసింది.
రత్నామాల: సరే కానీ ఈ మూటలో ఎంత డబ్బు ఉందో లెక్క పెట్టు. అమ్మీ ఈ సంచిలో ఉన్న పదిలక్షలు నీకు ఇచ్చేస్తా కానీ త్రిపుర మెడలో నా కొడుకు తాళి కడితేనే ఇస్తా. ఇప్పటికే నీకు చాలా డబ్బులు ఇచ్చా వాటన్నింటికి లెక్కలు కట్టమంటావా ఏంటి.
అనంత్ ల్యాండ్ కొనడానికి డబ్బులు బ్యాగ్‌లో పెడతాడు. బాల చూసి ఎందుకు అనంత్ అంత డబ్బు అని అడిగితే మనం ఈ ఊరిలో రిసార్ట్ కడుతున్నాం అన్నయ్యా అందుకే ఈ డబ్బులు అంటాడు. దాంతో బాల గదిలోకి వెళ్లి తన బ్యాగ్‌లో ఉన్న కిడ్డీ బ్యాంక్‌లు తీసుకొచ్చి వాటిని నేల మీద వేసి పగల గొడతాడు. తన దగ్గరున్న డబ్బులన్నీ పోగేసి అనంత్‌తో నీ దగ్గరున్న డబ్బులో ల్యాండ్ కొంటే నా డబ్బుతో రిసార్ట్ కడదామని అంటారు. బాల మనసుకి అందరూ ముచ్చటపడతారు. నాగభూషణం బాలని వెటకారం చేస్తే బామ్మ తిడుతుంది. తన వాళ్లకి తన వంతు సాయం చేయాలని వాడు ఆలోచిస్తే మనకి ఆ మాత్రం బుద్ధి కూడా లేదని చిన్న కొడుకుకి తిడుతుంది. బాలకి అసలు బుర్రే లేదని నాగభూషణం అంటాడు. దాంతో బామ్మ వాడిలో చిన్నగా మార్పు వస్తుంది మార్పు వస్తుందని అంటుంది. అనంత్ డబ్బు తీసుకొని జాగ్రత్త చేయాలని చూస్తే నాగభూషణం భార్య ఎలా అయినా అవి కొట్టేయాలి అని అంటుంది. దాంతో బాల బాబాయ్ డబ్బు కొట్టేయాలి అని అనుకుంటున్నావా అని అడుగుతాడు.
త్రిపుర తండ్రి ఫొటో పట్టుకొని ఎమోషనల్ అవుతుంటుంది. తన తండ్రి చనిపోయిన రోజులు గుర్తు చేసుకుంటుంది. తండ్రి ఫొటో దగ్గర దీపం పెట్టి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాధపడుతుంటే తల్లి ఈ కష్టాన్ని మనం అధిగమించాలి అందుకే నేను మన ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం నేను గల్ఫ్‌కి వెళ్లి పని చేస్తానని చెప్తుంది. తండ్రి జ్ఞాపకంగా ఓ రింగ్‌ను త్రిపుర చేతిలో పెట్టి తల్లి గల్ప్‌కి వెళ్లిపోతుంది. తండ్రి ఫొటో చూస్తూ త్రిపుర ఇప్పుడు ఆ సంగతులు గుర్తు చేసుకుంటుంది. జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా పొగొట్టుకున్నాను నాన్న అని ఏడుస్తుంది. ఇక తాతయ్య వచ్చి ఎల్లుండి కార్యక్రమానికి అన్నీ తీసుకొచ్చా మీ అమ్మ ఎప్పుడు వస్తుందో ఫోన్ చేసి అడుగు అంటే త్రిపుర కాల్ చేస్తుంది. స్విఛ్ ఆఫ్ వస్తుందని చెప్తుంది. ఇంతలో త్రిపుర ఫ్రెండ్ ఫోన్ చేసి టీవీలో న్యూస్ చూడు అని చెప్తుంది. టీవీలో గల్ఫ్‌లో తెలుగు వాళ్లు ఇరుక్కుపోయారని చెప్తారు. లక్షల్లో ఫైన్ కడితే కానీ గల్ఫ్ ప్రభుత్వం వాళ్లని వదలదని పాస్పోర్ట్‌లు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో త్రిపుర బిత్తరపోతుంది.
రమాప్రభ, ఊర్వశి రాగానే ఇద్దరూ విషయం దాచేస్తారు. తాతయ్య మనవరాలు బయటకు వెళ్లడం చూసిన రమాప్రభ వాళ్లని ఫాలో అవుతుంది. త్రిపుర వాళ్లు ఓ పెద్దాయన దగ్గరకు వెళ్లి గల్ఫ్ ఏజెంట్‌కి కాల్ చేయమని అంటారు. ఆయన కూడా కాల్ లిఫ్ట్ చేయడు. ఇక ఓ షేక్‌కి త్రిపుర కాల్ చేస్తుంది. తన తల్లిని వదిలేయమని కోరుతుంది. దాంతో ఆ షేక్ పదిహేను లక్షలు ఫైన్ కట్టాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!





















