Ennallo Vechina Hrudayam Serial Today February 20th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కండీషన్ సీరియస్.. బతకడం కష్టమే.. త్రిపుర బతుకు ఆగమే!
Ennallo Vechina Hrudayam Today Episode బాలకి ఫణి ఇచ్చిన విషం పని చేసి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల పడుకొని ఉంటే అనంత్ అక్కడికి వచ్చి అన్నయ్య నిన్ను ప్రేమగా చూశాను.. గర్వంగా చూశాను.. ధైర్యంగా చూశాను.. కానీ ఇలా ఎప్పుడూ జాలిగా చూడలేదని బాధపడతాడు. నువ్వు కోలుకుంటే బిజినెస్‌లు నీ చేతిలో పెట్టాలి అనుకుంటున్నా అన్నయ్య. నీకు ఈ దుస్థితికి కారణం ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ దాని వల్ల నువ్వు ఇలా అయిపోయావు. ఆ యాక్సిడెంట్ వల్ల ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అనుకుంటాడు.
ఉదయం త్రిపుర, గిరిల పెళ్లికి పసుపు దంచే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తారు. అందరూ ఆ ఏర్పాట్లు చేస్తుంటే గాయత్రీ ఆఫీస్‌కి బయల్దేరిపోతుంది. అందరూ ఉండమంటే నాకు పని ఉందని చెప్పి వెళ్లిపోతుంటే త్రిపుర గాయత్రీతో కాసేపు ఈ అక్కని క్షమించి నాతో ఉండవే అంటుంది. దాంతో గాయత్రీ అక్కని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతుంది. ఇంతలో రత్నమాల, గిరిలు వస్తారు. గాయత్రీ వెళ్తా అంటే కాసేపు ఆగవే చిన్న కోడలా అని రత్నమాల అంటుంది. త్రిపురని చూసి రత్నమాల నగలు వేసుకోలేదా ఓ మీకు తిండికే గతి లేదు కదా అంటుంది. దానికి గాయత్రీ మా పరిస్థితి తెలిసే అక్కని పెళ్లి చేసుకుంటా అంటున్నారు ఇప్పుడు ఎందుకు ఇలా అంటుంది. ఇక గిరి త్రిపురకు చీర మార్చుకోమని అంటాడు. వద్దని త్రిపుర అంటే నాకు నచ్చలేదని మార్చుకో అని తాను తీసుకొచ్చిన చీర కట్టుకోమని చెప్తాడు. ఏ మాటకు ఆ మాట గిరి తెచ్చిన చీర చాలా బాగుంటుంది. రత్నమాల చూసి అంతా బాగుంది కానీ ఏదో లోపం ఉందని చెప్పి తాము తెచ్చిన నగలు అలంకరించమని కొడుకుకు చెప్తుంది. త్రిపుర వదిన నేను రెడీ చేసి తెస్తాను అంటే నా తిప్పుకి నేనే నగలు పెడతానని గిరి త్రిపురని తీసుకొని గదికి వెళ్తాడు.
త్రిపురని అద్దం ముందు కూర్చొపెట్టి పాపిట బొట్టు నుంచి కమ్మలు నక్లెస్‌లు వేస్తూ డ్యాన్సులు వేస్తూ మురిసిపోతాడు. త్రిపురని తాకుతూ ఎంతందంగా ఉన్నావే నా తిప్పు అని పాటలు పాడుతూ ఉంటాడు. ఇక త్రిపుర నడుముకు వడ్డానం పెట్టబోతే గాయత్రీ వచ్చి నేను అక్కని రెడీ చేస్తాను నువ్వు వెళ్లు అని పంపేస్తుంది. మరదలి సరసం అని గిరి వెళ్లిపోతాడు. త్రిపురని రెడీ చేసి వదిన, గాయత్రీ తీసుకొస్తారు. గిరి, రత్నమాల త్రిపురని చూసి నోరెళ్లబెడతారు. ఇక పసుపు దంచుతారు. గిరి, త్రిపుర పక్కన నిల్చొంటే జంట చూడముచ్చటగా ఉందని రత్నమాల అంటుంది. వాళ్లని అలా చూడలేక గాయత్రీ పని ఉందని వెళ్లిపోతుంది.
ఇక అనంత్ రెడీ అయి కిందకి వస్తాడు. రిజిస్ట్రేషన్ పని ఉందని అందరినీ పిలుస్తాడు. బాల వచ్చి యాక్టివ్‌గా అనంత్‌తో మాట్లాడుతాడు. మందు పని చేయడం లేదేంటి అని వాసుకి, నాగభూషణం ఫణిని అడుగుతారు. ఇంతలో బాల అమ్మా అబ్బా అని కడుపు, గుండె పట్టుకొని విలవిల్లాడిపోయి తల పట్టుకొని కూలబడిపోతాడు. అందరూ ఏడుస్తూ హడావుడిగా బాలని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. మరోవైపు రత్నమాల అందరికీ తాంబూలం ఇస్తుంది. పసుపు దంచడం అయిపోయింది కదా మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేయండి అని అంటుంది. ఇక గిరి త్రిపురతో పసుపు దంచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్లకూడదు నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దని చెప్తూనే వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు గాయత్రీ అనంత్ ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనంత్ వాళ్లు బాలని తీసుకొని ఆశ్రమానికి వెళ్లి ఉన్నట్టుండి పడిపోయాడు అని చెప్తారు.
గురువుగారు పరీక్షించి బాల పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. ఎవరో కావాలనే విరుగుడు మందు ఇచ్చారని చెప్తారు. అందుకే ఇలా కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తారు. అందరూ చాలా ఏడుస్తారు. కషాయం ఇచ్చింది మీరే అది వికటించడంతో ఇలా అయిందని నాగభూషణం, వాసుకి గురువుగారి మీద కేకలేస్తారు. గురువుగారు వైద్యం మొదలు పెడదామని అంటారు. నా కొడుకుని కాపాడండి అని యశోద చాలా ఏడుస్తుంది. బామ్మ యశోదకు ధైర్యం చెప్తుంది. మరోవైపు గాయత్రీ చాలా సేపు ఎదురు చూసి అనంత్‌కి కాల్ చేస్తుంది. అనంత్ గాయత్రీతో తన అన్నయ్యకి సీరియస్‌గా ఉందని చెప్తాడు. ల్యాండ్ నీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోమని అనంత్‌కి చెప్తే అనంత్ వద్దని అంటాడు. దాంతో ఫణీ పేరు మీద పెట్టుకోమని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!





















