Ennallo Vechina Hrudayam Serial Today February 13th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: గిరి బావే తన భర్తని తెగేసి చెప్పిన త్రిపుర.. రేపే లగ్గాలు!
Ennallo Vechina Hrudayam Today Episode గిరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు త్రిపుర ఇంట్లో చెప్పడం గాయత్రీ అక్కతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాలతో బామ్మ డబ్బు తీసుకొని అలా వెళ్లిపోకూడదని చెప్తుంది. దాంతో బాల నువ్వే కదా బామ్మ మనకు సాయం చేసిన వాళ్లు కష్టంలో ఉంటే సాయం చేయమని చెప్పావ్ సుందరి కష్టంలో ఉందని అంటాడు. ఇక త్రిపుర పెళ్లికి ఒకే చెప్పి ఇంటికి వెళ్తానని అంటే రత్నమాల త్రిపురని ఇంటి దగ్గర దింపమని గిరితో చెప్తుంది.
గిరి త్రిపుర చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. గిరి చాలా సంతోష పడితే త్రిపుర బాధ పడుతుంది. గిరి తన బండి మీద త్రిపురని ఎక్కించుకుంటాడు. మీద చేయి వేసి పట్టుకోమని చెప్తాడు. ఇబ్బంది పడుతూనే త్రిపుర గిరి భుజం మీద చేయి వేసి పట్టుకుంటుంది. ఇక గాయత్రీ ఆఫీస్‌లో అర్జున్ అనే తన బెస్ట్ ఫ్రెండ్ కొలిగ్‌తో సరదాగా మాట్లాడుతుంటుంది. ఇంతలో అనంత్ అక్కడికి వస్తాడు.
అనంత్: మిమల్ని ఒకటి అడగటానికి వచ్చాను. ఈ ఊరిలో సుందరి అని ఎవరైనా ఉన్నారా.
గాయత్రీ: నాకు తెలిసిన వరకు సుందరి అని ఎవరూ లేరే.
అనంత్: మనసులో మరి అన్నయ్య చెప్తుంది ఎవరి గురించి.
గాయత్రీ: అయినా ఎందుకు.
అనంత్: ఏం లేదు. ఇది అడ్వాన్స్ మీరు ఎప్పుడు అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం.
గాయత్రీ: నేను ఇచ్చిన పజిల్ గురించి చెప్పకుండా సందరి అంటారేంటి.
బాలకి కషాయం తాగించాలని యశోద వెళ్తుంది. నాగభూషణం, వాసుకి తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటారు. బాల బాబాయ్‌తో నీ మీద నాకు అనుమానంగా ఉంది బాబాయ్ ఎప్పుడూ నా గురించి పట్టించుకోని నువ్వు కషాయం తాగమన్నావ్ అంటే ఏదో అనుమానంగా ఉంది అంటాడు. అలా అనకూడదు అని బామ్మ అంటుంది. ఇక యశోద కషాయం తీసుకొస్తుంది. బామ్మ కషాయం కలిపి బాలకి ఇస్తుంది. బాల తాగుతున్న టైంలో అనుకోకుండా వాసుకి టీవీలో యాక్సిడెంట్ సినిమా వేసేస్తుంది. దాంతో బాలకు విపరీతంగా కోపం వచ్చి కంట్రోల్ తప్పి చేతిలో కషాయం పడేసి ఫిట్స్ వచ్చినట్లు అయిపోతాడు. బామ్మ టీవీ ఆపమని వాసుకితో చెప్తాడు. ఇక బాలని గదిలోకి తీసుకెళ్తారు. ఇక నాగభూషణం వాసుకిని తిడతాడు.
గౌరి త్రిపురని తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ చూడాలని ఇంటి దగ్గర హారన్ కొడతాడు. అందరితో నాకు త్రిపురకు రేపు గుడిలో లగ్గాలు చూస్తారని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటని గాయత్రీ అక్కని ప్రశ్నిస్తుంది. ఏదో ఒక రోజు గిరి చేసుకోవాల్సింది దీన్నే కదా అని రమాదేవి అంటుంది. అలాంటి రౌడీని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మా అక్కకేంటి అని గాయత్రీ అంటుంది. పెళ్లికి ఒప్పుకున్నానని త్రిపుర అంటుంది. ఇంతలో త్రిపుర అన్న వచ్చి త్రిపురని అలా ఎలా ఒప్పుకుంటావమ్మా అని కోప్పడతాడు. పెళ్లి అయితే గిరి దారిలోకి వస్తాడు.. త్రిపుర గిరిని మార్చుతుందని రమాదేవి అంటుంది. ఇంతలో రమాదేవి కోడలు గిరికి ఊర్వశి నచ్చితే ఇచ్చేస్తావా అని అడుగుతుంది.
గాయత్రీ: వాళ్లతో పెళ్లి వద్దని చెప్దాం పద అక్క.
త్రిపుర: నిర్ణయం అయిపోయింది రేపు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయిపోతుంది. ఎవరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది.
గాయత్రీ: సరే అక్క నీ పెళ్లి నీ ఇష్టం అయితే ఈ పెళ్లి కి రావాల్సిన అవసరం నాకు లేదు.
బాలని తీసుకొని బామ్మ వాళ్లు గుడికి వస్తారు. బాల జాతకం చూపించాలని అనుకుంటారు. బాల అందరి చెప్పులు గొలుసుకి కట్టి తాళం వేస్తాడు. ఎందుకు నాన్న ఇలా చేశావ్ అంటే అక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాశారు కదా అంటాడు. త్రిపుర వాళ్లు కూడా గుడికి వస్తారు. బాల వాళ్లు స్వామీజీకి కలుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!





















