Ennallo Vechina Hrudayam Serial Today February 11th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సెల్యూట్ మూవీలో నయన్ సీన్ బాల పిన్నీబాబాయ్‌లకు రిపీట్.. నగలతో త్రిపుర బ్యాంక్‌కి పరుగులు!
Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర తల్లి కోసం నగలు తీసుకొని బ్యాంక్‌లో తాకట్టు పెట్టడానికి వెళ్లడం గిరి దొంగలా బ్యాంక్‌కి వచ్చి అందరిని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల త్రిపుర తండ్రి ఫొటో చూసి పాండు రంగారావు మీ నాన్న అని అంటాడు. మా నాన్న మీకు తెలుసా అని త్రిపుర అడిగితే తెలుసు అని చెప్తాడు. ఇక ఎలా తెలుసు అని త్రిపుర అడిగే సరికి చిన్న పిల్లాడిలా మారిపోయి గుర్తు రావడం లేదని ఆయన తనకు తెలుసు అని అంటాడు. ఇక భోజనం అక్కడ చూసిన బాల ఏంటి అని అడుగుతాడు. కాకుల కోసం ఇలా పెట్టామని బాలకు త్రిపుర చెప్తుంది.
బాల ఆ ఆకుతో భోజనం తీసుకొని వెళ్లి ఓ చెట్టు దగ్గర పెట్టి ఇక్కడ పెట్టాలి అని కావ్ కావ్ అని అరుస్తాడు. కాబోయే అల్లుడిని నేను పిలిస్తే రాలేదు వీడు పిలిస్తే వస్తాయా అని గిరి అంటాడు. ఇంతలో ఓ కాకి వచ్చి ఆ పిండం భోజనం తింటుంది. త్రిపుర, గాయత్రీ, పెద్దాయన చాలా సంతోషిస్తారు. మిగతా వాళ్లు షాక్ అయిపోతారు. త్రిపుర బాల వైపు చూసి మురిసిపోతుంది. వీడు పెట్టగానే తినేసింది వీడికి మామకి ఏమైనా సంబంధం ఉందా అని గిరి తల్లిని అడిగితే వాళ్లకి సంబంధం ఏంట్రా వాడు బయటి వాడు అని అంటుంది. ఇక త్రిపుర, గాయత్రీలు బాలకి థ్యాంక్స్ చెప్తారు. దాంతో బాల ఫుడ్ పెట్టింది మీరు నాకు థ్యాంక్స్ ఎందుకు అంటాడు. ఇక మరోవైపు బాల ఫ్యామిలీ మొత్తం బాల కోసం వెతుకుతారు. ఇంతలో బాల వచ్చి ఎక్కడికి వెళ్లావ్ అంటే సుందరి కనిపించి వెళ్లా అంటాడు.
బాల పిన్ని, బాబాయ్‌లు ఇంట్లో బాల గదిలోకి వెళ్లాలనుకుంటారు. డోంట్ డిస్ట్రబ్ మీ అని రాసి తలుపులకు అతికించి ఉన్న బోర్డ్ తీసేసి డిస్ట్రబ్ చేయడానికి వస్తున్నామ్ అని బోర్డ్ విసిరేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే అడ్డంగా దారం కట్టి ఉండగా దాన్ని తన్నేసి పడిపోతారు. ఇద్దరి ముక్కలు పగిలిపోతాయి. అయినా సరే లక్ష్యం ముఖ్యం అనుకొని ముందుకు వెళ్తారు. అక్కడే ఉన్న తాడుని నాగభూషణం లాగేస్తాడు. దాంతో ఇద్దరి ముఖం మీద పిండి పడిపోతుంది. వెనక్కి వెళ్లిపోదాం బాల గట్టిగానే ప్లాన్ చేశాడని అంటే వాసుకి లక్ష్యం ముఖ్యం అంటుంది. దాంతో ముందుకు వెళ్లిన నాగభూషణం గోలీల మీద కాలు వేసి జారి ముందు వెళ్లి గోడకు తగిలి పెన్సిల్‌లు లేఖినిలు ఉన్న కుర్చీ మీద కూర్చొండిపోతాడు. దాంతో సీట్ చిరిగిపోతుంది. నాగ భూషణం కెవ్వుమంటాడు. వెనక్కి తగ్గేదే లేదని ముందుకు వెళ్తే కరెంట్ షాక్ కొట్టి కాకిల్లా కొట్టుకుంటారు. ఈ సీన్ చూస్తే అచ్చం సెల్యూట్ సినిమాలో నయన తారకు చిన్న పిల్లలు ప్లాన్ చేసి చుక్కలు చూపించిన సీన్ గుర్తొస్తుంది. బాల పిన్ని బాబాయ్‌లు తర్వాత కషాయం దగ్గరకు వెళ్లి మందు కలపాలని కషాయం తీసి అందులో మందు కలిపేస్తారు. వచ్చిన పని అయిపోయిందని తిరిగి వెళ్తుంటే ఎదురుగా ఇంటిళ్లపాది నిల్చొంటారు. నాగభూషణం, వాసుకిల గెటప్ చూసి పిచ్చెక్కిపోతారు.
త్రిపురకు తల్లి వీడియో కాల్ చేసి ఆబ్దికం బాగా జరిగిందా అని అడిగి ఏడుస్తుంది. యజమానిని చాలా సేపు బతిమాలితే ఫోన్ చేయడానికి ఒప్పుకున్నారని ఇక తిడతారని ఫోన్ కట్ చేస్తానంటుంది. త్రిపుర తల్లికి ధైర్యం చెప్తుంది. ఇక త్రిపుర తన దగ్గర ఉన్న బంగారు నగలు మొత్తం తీసుకొని బ్యాంక్‌కి బయల్దేరుతుంది. ఎంతొస్తే అంత డబ్బు తీసుకొస్తానని తాతయ్యకి చెప్పి పరుగులు తీస్తుంది. ఇంతలో గాయత్రీ మొత్తం చూసేస్తుంది. త్రిపుర, తాతయ్య చాలా కంగారు పడతారు. అయితే గాయత్రీ తన మేనత్త, గిరిబావ పెళ్లి కోసం ఇబ్బంది పెడుతున్నారని అనుకొని నేను చూసుకుంటా ఏమైందో చెప్పు అక్క అంటుంది. పెళ్లి చేయాలి అనే కదా అప్పు తీర్చమని అత్త ఇబ్బంది పెడుతుందని అంటుంది. దాంతో త్రిపుర మొత్తం నేను చూసుకుంటా వదిలేయ్ అంటుంది. త్రిపుర గోల్డ్ తాకట్టు పెట్టడానికి వెళ్లిందని రమాప్రభ రత్నమాలకు కాల్ చేసి చెప్తుంది. దాంతో రత్నమాల కొడుకు త్రిపుర బావ గిరి ముసుగు వేసుకొని తన రౌడీలతో కలిసి బ్యాంక్‌కి దొంగల్లా వచ్చి అందరి దగ్గర డబ్బు నగలు తీసుకుంటారు. ఇక గిరి త్రిపుర దగ్గరకు వెళ్తే నా దగ్గర ఏం లేవని త్రిపుర అంటుంది. గిరి త్రిపుర మెడ మీద చాకు పెట్టి బెదిరిస్తాడు. మరోవైపు బాల, అనంత్‌లు బ్యాంక్‌కి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!





















