Ennallo Vechina Hrudayam Serial Today February 10th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: జ్యూస్ తెచ్చిన తిప్పలు.. కాకి ముట్టని పిండం.. త్రిపుర కష్టం తీరిపోతుందా!
Ennallo Vechina Hrudayam Today Episode అక్కాచెల్లెళ్లు తండ్రికి పిండం పెట్టడం చూసిన బాల వచ్చి త్రిపుర తండ్రిని గుర్తు పట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode నాగభూషణం అతని భార్య బాల పూర్తిగా కోలుకోకుండా చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకు జ్యూస్‌లో మందు కలిపి బాలతో తాగిస్తే మతి పూర్తిగా పోతుందని అనుకుంటారు. బాల పిన్ని అందరికీ టీ ఇస్తే నాగభూషణం బాలకి జ్యూస్ ఇస్తాడు.
బాల జ్యూస్ తాగే టైంకి అనంత్ వచ్చి కషాయం తాగావు కదా ఇప్పుడు మ్యాంగో జ్యూస్ తాగొద్దని చెప్తాడు. దాంతో బాల జ్యూస్ వేస్ట్ అయిపోతుందని అంటే బాల నానమ్మ మీ బాబాయ్‌కి కూడా మ్యాంగో జ్యూస్ ఇష్టం అని అంటే బాల బలవంతంగా తాగించేస్తాడు. ఇంతలో వాసుకి చూసి షాక్ అయిపోతుంది. మీ పిన్నికి కూడా తాగించరా అని నాగ భూషణం చెప్పడంతో బాల వాసుకికి కూడా బలవంతంగా తాగించేస్తాడు. మరోవైపు త్రిపుర తాతయ్యతో డబ్బు సర్దుబాటు అవ్వలేదని అంటుంది.
రమాప్రభ: అంటే మీ అమ్మ రేపు ఆబ్దికానికి రాదుగా. కోరి వచ్చిన అవకాశాన్ని వదలుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎవరైనా సర్దడానికి అవేమైనా వందలా లక్షలు అక్షరాలా 15 లక్షలు. బావ గారి ఆబ్దికానికి గంగ అక్క రాకపోతే మరి కార్యక్రమం ఎవరు జరిపిస్తారు.
తాతయ్య: త్రిపుర జరిపిస్తుంది.
గాయత్రీ: అక్క అమ్మ ఇంకా రాలేదా. రేపే కదా నాన్న ఆబ్దికం. ఇప్పుటి వరకు రాలేదు అంటే ఇంకెప్పుడు వస్తుంది.
త్రిపుర: గాయత్రీ రేపు నాన్న ఆబ్దికానికి అమ్మ రావడం లేదు.
గాయత్రీ: ఏ అక్క ఎందుకు రావడం లేదు.
త్రిపుర: అమ్మ పని చేసే ఓనర్ గారి భార్యకి బాలేదంట అమ్మ ఉండిపోయింది.
తాత: రేపు ఆబ్దికం మీరే చేయాలి.
గాయత్రీ: సరే తాతయ్య.
త్రిపుర, గాయత్రీ తండ్రికి ఆబ్దికం చేస్తారు. ఆడపిల్లలతో చేయిస్తే నా అన్న ఆత్మ శాంతిస్తుందా.. అదే నా కొడుకుని పెళ్లి చేసుకొని వాడితో చేయించి ఉంటే ఆత్మ శాంతించేదని రత్నమాల అంటుంది. నీ కొడుకుతో చేయిస్తే మా నాన్న ఆత్మ శాంతించదు అని గాయత్రీ అంటుంది. దాంతో గౌరి చిన్న దానికి ముక్కు తాడు వేసి త్రిపురని పెళ్లి చేసుకోవాలని అంటాడు. మరోవైపు అనంత్ అమ్మానాన్న, బామ్మ, బాలని తీసుకొని వచ్చి అక్కడ ల్యాండ్ చూపిస్తాడు. అదే మనం కొంటున్నామని అంటాడు. బాల బైనాక్యూలర్‌లో మొత్తం చూస్తుంటాడు. ఇంతలో త్రిపురని చూసి సుందరి అని అనుకుంటూ అక్కడికి వెళ్లడానికి నడుస్తాడు. మరోవైపు మందు కలిపిన జ్యూస్ తాగిన నాగభూషణం, వాసుకిలు కడుపు పట్టుకొని బాత్‌రూమ్‌కి తిరుగుతూ ఉంటారు. ఈ సారి మందు వాడికి ఇచ్చిన కషాయంలో కలిపేయాలని అనుకుంటారు.
త్రిపుర, గాయత్రీ ఇద్దరూ పిండ ప్రధానం చేస్తారు. ఒక్క కాకి రాలేదని రమాప్రభ, రత్రమాలలు ఆత్మ శాంతించలేదని నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. నా కొడుకుని అల్లుడుని చేసుకోవాలని మాట తీసుకున్నారు త్రిపుర, గిరిల పెళ్లి జరగడం లేదని ఇలా అయిందని అనుకుంటారు. బావకి ఏం తక్కువ అని ఊర్వశి అంటే అయితే నువ్వే చేసుకోవే అని గాయత్రీ అంటుంది. ఇక రత్నమాల త్రిపుర దగ్గరకు వెళ్లి మీ నాన్న రాడు.. మీ నాన్నకి ఇష్టమైన అమ్మ అక్కడి చిక్కుకుపోతే వాడి ఆత్మ ఎలా శాంతిస్తుంది.. మీ అమ్మని నేను రప్పిస్తా నువ్వు నా కొడుకుని మనువాడు అని రత్నమాల త్రిపురతో చెప్తుంది. త్రిపుర ఏడుస్తుంది.
ఇక బాల వచ్చి త్రిపురని చూసి సుందరి అని నవ్వుతాడు. వీడు ఇక్కడికి వచ్చేశాడు అని గిరి కొట్టడానికి వెళ్తే రత్నమాల ఆపుతుంది. ఇక ఇక్కడ ఏం జరుగుతుందని బాల అడిగితే త్రిపుర తన తండ్రికి ఆబ్దికం అని చెప్తుంది. బాలకి అర్థం కాకపోవడంతో తన తండ్రి చనిపోయాడని చెప్తుంది. బాల భయంతో తన చేతిలో ఉన్న బైనాక్యులర్ కింద పడేస్తాడు. అది తీసుకోబోతూ పాండు రంగారావు ఫొటో చూస్తాడు. అతను గుర్తొచ్చి పాండు రంగారావు గారు అంటాడు. మా నాన్న నీకు తెలుసా అని త్రిపుర అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Aalso Read: సత్యభామ సీరియల్: ఇంకా లేదేంటా అనుకుంటే వచ్చేసిందిగా సంధ్యకి సవతి.. అమ్మాయిలంతా ఇలాంటి వెదవలకే పడతారేంట్రా!





















