అన్వేషించండి

Ennallo Vechina Hrudayam Serial Today April 1st: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?

Ennallo Vechina Hrudayam Today Episode త్రిపుర, బాల ఇద్దరూ కలిసి సీతారాముల విగ్రహాలు ఊరేగించడం అనంత్ కోసం గాయత్రీ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode శ్రీరామ నవమి వేడుకుల కోసం బాల ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. పంతుల్ని కలుస్తారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు తర్వాత కల్యాణం అని పట్టు బట్టలు మార్చుకోమని పంతులు చెప్తారు. బాల, అనంత్‌లను పెద్దావిడ పంపిస్తుంది. ఇక పంతులుతో తన చిన్న మనవడికి వాడికి కాబోయే భార్యకి కంకణాలు కట్టాలని చెప్తుంది. 

అనంత్‌ని చూసి షాకైన ఊర్వశి..

త్రిపుర వాళ్లు కూడా గుడికి వస్తారు. ఊర్వశి చక్కగా రెడీ అయి వస్తుంది. ( ఊర్వశి తల్లి క్యారెక్టర్ మారుంటుంది) బాలకు పంచె కట్టుకోవడం రాక చాలా తిప్పలు పడతాడు. చుట్టేస్తాడు అందరూ బాలని చూసి నవ్వుతారు. త్రిపుర అది చూసి బాల దగ్గరకు వెళ్తుంది. అనంత్‌ని చూసిన ఊర్వశి దొరికిపోతానేమో కంకణాలు కట్టనప్పుడు ఏం చేస్తామని అంటుంది. దానికి రమాదేవి అనంత్ మాత్రమే వచ్చాడు కదా గాయత్రీ రాలేదు కదా ఏం కాదులే ఏదో ఒకటి చేద్దామని అంటుంది. 

బాలకి పంచె కట్టిన త్రిపుర..

బాల దగ్గరకు త్రిపుర వెళ్లి పంచె కడతానని అంటుంది. బాల వద్దని అంటాడు. ఏం పర్లేదు అందరూ నవ్వుతున్నారని చెప్పి త్రిపుర కడుతుంది. బాలని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. పంచె కట్టు చాలా బాగుందని అనుకుంటారు. ఇక త్రిపుర బాలని తీసుకొని బాల ఫ్యామిలీ దగ్గరకు వెళ్తుంది. పంచె కట్టులో చాలా బాగున్నావ్ అని అందరూ అంటే సుందరి కట్టిందని బాల చెప్తాడు. 

బాల, త్రిపురల చేతుల మీదగా ఊరేగింపు..

స్వామి వారి ఊరేగింపు చూసి బాల రా సుందరి అని అక్కడికి పరుగులు తీస్తాడు. త్రిపుర వెంటే వెళ్తుంది. ఊర్వశి వాళ్లు వచ్చి అందరినీ పలకరిస్తారు. అందరూ ఊరేగింపు దగ్గరకు వెళ్తారు. ఊరేగింపులో రామయ్య విగ్రహం పడిపోబోతే బాల పట్టుకుంటాడు. సీతమ్మ విగ్రహం పడిపోకుండా త్రిపుర పట్టుకుంటుంది. అందరూ విగ్రహాలు పడిపోలేదని సంతోష పడతారు. ఇద్దరూ విగ్రహాలు పడిపోబోతే పంతులు ఆపి స్వామి వారు ఏ కల్మషం లేని మీ చేతులు మీదగా తమ విగ్రహా ఊరేగింపు జరగాలని కోరుకున్నారని మీ ఇద్దరూ విగ్రహాలు ఊరేగించండి అని చెప్తారు. బాల, త్రిపుర ఇద్దరూ పక్క పక్కన నిల్చొని విగ్రహాలు ఊరేగిస్తారు. 

త్రిపుర ఇంట్లో ఫణి రెక్కీ..

త్రిపుర ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెన్‌లో ఉన్న సాక్ష్యం కోసం ఫణి త్రిపుర ఇంటికి వెళ్లి మొత్తం వెతుకుతాడు. కానీ ఎక్కడా పెన్ దొరకదు. కల్యాణం ప్రారంభం అవుతుంది. బాల, త్రిపుర పక్కపక్కన కూర్చొంటే... అనంత్ పక్కన ఊర్వశి కూర్చొంటుంది. అనంత్ మాత్రం గాయత్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అనంత్ పక్కకు వెళ్లి గాయత్రీకి కాల్ చేస్తాడు. ఊర్వశి, రమాదేవి చాలా టెన్షన్ పడతారు. ఇంతలో గాయత్రీ గుడికి వచ్చేస్తుంది. అనంత్‌కి కాల్ చేస్తే నాకు పని ఉంది రాలేనని చెప్తుంది. దాంతో అనంత్ మనద్దరం గుడిలో కంకణం కట్టుకోవాలని బామ్మ చెప్పింది అది కట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్లే అని చెప్తాడు. గాయత్రీ కావాలనే రాలేనని అంటుంది. 

అనంత్ పక్కనే గాయత్రీ.. కుళ్లుకున్న ఊర్వశి..

గాయత్రీ అనంత్ కోసం గిఫ్ట్ తీసుకొని గుడికి వస్తుంది. ఊర్వశి తల్లితో మనం దొరికిపోతామని భయంగా ఉందని అంటుంది. గిఫ్ట్‌తో వచ్చిన గాయత్రీని చూసి ఊర్వశి, రమాదేవి షాక్ అయిపోతారు. అనంత్ గాయత్రీని చూసి చాలా సంతోషిస్తాడు. వచ్చి పక్కన కూర్చోమని సైగ చేసి ప్లేస్ ఇస్తాడు. అనంత్ పక్కన గాయత్రీ కూర్చొవడంతో ఊర్వశి ఉడికిపోతుంది. గిఫ్ట్ గురించి బాల అడుగుతాడు.  

పెళ్లి అంటే ఏంటి సుందరి..

బాల త్రిపురతో సుందరి కల్యాణం అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి త్రిపుర పెళ్లి అని చెప్తుంది. పెళ్లి అంటే ఏంటి అని అడిగితే మనకు నచ్చిన వ్యక్తిని జీవితాంతం మనతోనే ఉండేలా కలిపే బంధం పెళ్లి అని త్రిపుర చెప్తుంది. నిజంగానా అని బాల అడిగితే అవును అని పంతులు దగ్గర ఉన్న తాళి చూపించి దాంతో ఇద్దరు మనుషుల్ని ఇద్దరి మనసుల్ని కలిపే శక్తి ఉందని చెప్తుంది. గాయత్రీ, అనంత్ ఇద్దరూ చనువుగా మాట్లాడుతూ ఉంటారు. పంతులు తాళి అందరికీ చూపించి సీతమ్మకి వేస్తారు. త్రిపురకు తలంబ్రాలు తీసుకురమ్మని చెప్తారు. తలంబ్రాలకు టైం ఉందని 108 కొబ్బరి కాయలు కొడతానని మొక్కుకున్నావు కదా అది తీర్చుకొని రమ్మని త్రిపురతో చెప్తారు. బాల పక్కన త్రిపుర లేదు కాబట్టి మన ప్లాన్ పక్కాగా అమలు చేయొచ్చని వాసుకి బాలని చాటుగా పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget