అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 9th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను మిస్సింగ్.. ఒకరిని ఒకరు హగ్ చేసుకొని పడుకున్న తండ్రీకొడుకులు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జున్నుకి తల్లీతండ్రితో కలిసి సంతోషంగా ఉన్నట్లు కల రావడంతో రాత్రి లేచి మిత్ర పక్కన పడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషాని ఇంటి నుంచి పంపించేస్తానని లక్ష్మీ అంటుంది. మనీషా కూడా లక్ష్మీని ఇంటి నుంచి పంపించడానికి జున్నుని అడ్డు పెట్టుకోవాలని అనుకుంటుంది. ఉదయం లక్ష్మీ నిద్ర లేచి పక్కన చూస్తే జున్ను ఉండడు. లక్ష్మీ కంగారుగా కిందకి వస్తుంది. జాను కనిపిస్తే జున్ను గురించి అడుగుతుంది. ఇంట్లో అందరికీ అడుగుతుంది. ఎవరూ కనిపించలేదని అంటారు. లక్ష్మీ జున్ను గురించి కంగారు పడటం దేవయాని చూస్తుంది. పడుకొని ఉన్న మనీషాకు లేపి జున్ను కనిపించడం లేదని చెప్తుంది. ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇక వివేక్‌తో పాటు అందరూ వెతికి ఎక్కడా కనిపించలేదని అనుకుంటారు.

మనీషా: ఏంటి లక్ష్మీ జున్ను కనిపించడం లేదంట నీ కంటే ముందు నీ కొడుకు వెళ్లిపోయాడా. 
దేవయాని: ఇది నా ఇళ్లు నా నాన్న ఇళ్లు అని నిన్ను పొగరుగా మాట్లాడాడు. తెల్లారే సరికి వెళ్లిపోయాడు.
మనీషా: ఎలాగూ వెళ్లిపోవాలని అనుకొని ముందే వెళ్లిపోయాడు. వాడికున్న తెలివి కూడా నీకు లేదు లక్ష్మీ.
దేవయాని: వాడే వెళ్లిపోయాడు నువ్వు ఇక ఎందుకెమ్మా బ్యాగ్ రెడీ చేసుకొని పో.
అరవింద: ఆపుతావా దేవయాని చిన్న పిల్లాడు కనిపించడం లేదు అన్న కామన్‌ సెన్స్ లేకుండా నీ సెటైర్లు ఏంటి. అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్లాడేమో ఒకసారి కాల్ చేయ్ లక్ష్మీ.
లక్కీ: అక్కర్లేదు నానమ్మ జున్ను ఎక్కడికీ వెళ్లలేదు ఇంట్లో నిద్రపోతున్నాడు. 
లక్ష్మీ: నిద్ర పోతున్నాడా నా రూమ్‌లో లేడే.
లక్కీ: వేరే రూంలో నిద్రపోతున్నాడు రండి చూపిస్తా.

మిత్ర, జున్ను ఒకర్ని ఒకరు వాటేసుకొని పడుకోవడం లక్కీ అందరినీ తీసుకెళ్లి చూపిస్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. మనీషా దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతారు. మనీషా కోపంగా వెళ్లి మిత్రని నిద్ర లేపుతుంది.  జున్ను గాడిని నువ్వు నీపై పడుకోపెట్టుకున్నావ్ ఏంటని అడుగుతుంది. మిత్ర జున్నుని నిద్ర లేపుతాడు. జున్ను నిద్ర లేచి గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ మనీషా అని అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఈ రూమ్‌లో ఎందుకు పడుకున్నావ్ అని మనీషా అడిగితే మా నాన్న దగ్గర పడుకున్నాను అని అంటాడు. 

దేవయాని: మిత్ర దగ్గర పడుకోవాలని నీకు ఎవరు చెప్పారురా మీ అమ్మ చెప్పిందా.
జున్ను: లేదు చిన్న నానమ్మ నాన్న గుండెల మీద పడుకోవాలి అని నేనే అమ్మతో చెప్తూ ఉంటాను. 
లక్కీ: అందుకే నాన్న దగ్గర పడుకున్నావన్నమాట.
జున్ను: ఇక నుంచి రోజూ ఇలాగే నాన్న దగ్గర పడుకుంటా. 
లక్ష్మీ: లక్కీ, జున్ను రండి స్కూల్‌కి రెడీ చేస్తాను.
జున్ను: సరే అమ్మ నాన్న ఈ రోజు నువ్వే నన్ను లక్కీని స్కూల్‌లో డ్రాప్ చేయాలి. 
జయదేవ్: ఏ గూటి పక్షి ఆ గూటికి చేరడం అంటే ఇదే అరవింద.

చెప్పకుండా ఎందుకు నాన్న దగ్గరకు వెళ్లావని జున్నుని అందరూ అడుగుతారు. దాంతో జున్ను రాత్రి తనకు నాన్న గోరు ముద్దలు తినిపించినట్లు కల వచ్చిందని అన్నం తిన్న తర్వాత నాన్న తాను క్రికెట్ ఆడామని ఇంకా కలలో నాన్న నేను చాలా చేశాం అని అలసిపోతే నాన్న నన్ను పడుకోపెట్టారు అని అందుకే నేను వెళ్లి నాన్న దగ్గర పడుకున్నానని అంటాడు. ఇక లక్కీ కలలో నేను ఉంటే బాగుండేది అని అంటే ఈ సారి నువ్వు నేను నాన్న వచ్చేలా కల కంటానని అంటాడు. ఇద్దరూ రెడీ అవ్వడానికి వెళ్తారు. లక్ష్మీ తన వల్లే జున్ను తండ్రిని దూరం అయ్యాడని అంటే అదంతా తన వల్లే అని అరవింద ఫీలవుతుంది. తన అక్కా బావలను జున్నునే కలుపుతాడని జాను అంటుంది.  

మనీషా: ఏం జరుగుతుంది మిత్ర ఇక్కడ. నాకు నువ్వు చేసిన ప్రామిస్ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి. జున్నుని నీ దగ్గర పడుకోపెట్టుకోవడం ఏంటి. 
మిత్ర: మనీషా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడు జున్ను అనుకోలేదు లక్కీ అనుకున్నా. పడుకునేటప్పుడు ఎలా వచ్చాడో నాకు తెలీదు. 
మనీషా: మిత్ర నిజమే చెప్తున్నావా. 

ఇక మనీషా మిత్రని లక్ష్మీ నీ భార్య అని ఇంకే ఏదో అనబోతే దేవయాని మనీషాని బయటకు తీసుకొస్తుంది. నువ్వే వాళ్లని ఒకటి చేసేలా ఉన్నావని అంటుంది. మనీషా జున్నుని చూస్తే భయం వేస్తుందని వాడే లక్ష్మీ, మిత్రలను ఒకటి చేసేలా ఉన్నాడని అంటుంది. మిత్ర గదిలోకి లక్కీ వస్తుంది.   ఇక లక్కీ తండ్రితో నిన్న నేనే నీ కూతుర్ని అని ఈరోజు జున్నుని పక్కన పెట్టుకొని పడుకున్నావ్ అంటే నా మీద ప్రేమ జున్ను మీదకి షిఫ్ట్ అయిందా అని అడుగుతుంది. దానికి మిత్ర అలా ఏం లేదు అని జున్ను రావడం తనకు తెలీదని అంటాడు. దానికి లక్కీ బుంగమూతి పెట్టుకొని నీకు నా కంటే నీ కొడుకే  ఎక్కువ అయ్యాడని అంటుంది. మిత్ర లక్కీని బుజ్జగించడానికి ప్రయత్నిస్తాడు. ఇక లక్కీ నవ్వేస్తుంది. సరదాగా అన్నాను అని అంటుంది. జున్ను నీ దగ్గర పడుకున్నందుకు నేనేం ఫీలవలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి వచ్చిన నర్శింహ చేతిలో బలైపోయిన కార్తీక్.. కండీషన్ సీరియస్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Embed widget