అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 3rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మనసులో ఇంకా లక్ష్మీ ఉందా.. సంయుక్త ప్రశ్నలకు మిత్ర పెళ్లి ఆపేస్తాడా.. లక్ష్మీ ప్లాన్ ఏంటి?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర పెళ్లి ఆపకపోతే నీ జీవితం నాశనం అయిపోతుందని ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపమని లక్ష్మీతో అందరూ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. లక్ష్మీ అలియాస్ సంయుక్త మిత్ర నుదిటిన బాసిటం కడుతుంది. ఇక లక్ష్మీ గురించి మిత్రని అడుగుతుంది. లక్ష్మీ తనని మోసం చేసిందని తను బతికి ఉన్నా క్షమించనని మిత్ర అంటాడు. 

సంయుక్త: లక్ష్మీ తప్పు చేసిందని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా. మీ మాటలను బట్టి చూస్తుంటే లక్ష్మీ బతికే ఉందని మీరు నమ్ముతున్నారని అర్థమవుతుంది. మనసులో ఒకరిని ఉంచుకొని మరొకరి మనసులో తాళి కట్టడం కరెక్టేనా. మీరు అనుకున్నట్లు లక్ష్మీ తప్పు చేసిందే అనుకో మరి మీరు చేస్తుందేంటి.
మిత్ర: నేను ఈ పెళ్లి చేసుకుంటున్నది లక్కీ కోసం. ఈ పెళ్లి వల్ల నేను పొందబోయేది ఏం లేదు. 
సంయుక్త: నష్టపోయేది కూడా ఏం లేదా. ఈ పెళ్లితో ఏం లాభం లేదు అంటున్నారు నష్టం కూడా లేదా అని అడుగుతున్నాను.
మిత్ర: ఈ పెళ్లి వల్ల లక్కీకి మంచి అమ్మ దొరుకుతుంది. 
సంయుక్త: ఈ పెళ్లి జరిగితే మీరు లక్ష్మీకి శాశ్వతంగా దూరం అయిపోతారు కదా. 
మిత్ర: అది ఆలోచించుకోవాల్సింది లక్ష్మీ నేను కాదు. 
సంయుక్త: మిమల్ని కాపాడిన లక్ష్మీని మీరు మర్చిపోయారా. సగం నిజం మిగతా సగం నిజం కాదేమో అని మీకు మీ మనసు చెప్పడం లేదా. అది అబద్ధం అయింటుందని అనిపించడం లేదా. ఈ పెళ్లి మీరు లక్కీ కోసం చేసుకుంటున్నారు సరే మరి లక్ష్మీ సంగతేంటి. ఇదంతా నేను మీరు మీ బంధానికి ఇవ్వబోయే విలువ కోసం చెప్తున్నా. మిత్ర గారు పొందేది ఏమీ లేనప్పుడు పోగొట్టుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. అది వ్యాపారం అయినా జీవితం అయినా. అని చెప్పి సంయుక్త వెళ్లబోతే తన చీర కొంగు మిత్ర బ్రేస్‌లేట్‌కి అంటుకుంటుంది.

మిత్ర దాన్ని తీయడంతో సంయుక్త వెళ్లిపోతుంది. వివేక్ ఆ మాటలు విని మిత్ర దగ్గరకు వస్తాడు. లక్ష్మీ వదినను నువ్వు ఇంకా మర్చిపోలేదని అంటాడు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని మిత్ర ఆపేస్తాడు. మరోవైపు దేవయాని మనీషాని రెడీ చేస్తుంటుంది. జాను సంయుక్త దగ్గరకు వెళ్లి అక్క ఎప్పుడు సంయుక్తలా ఉన్న నువ్వు ఈ రోజు లక్ష్మీలా ఎందుకు రెడీ అయ్యావని ఇదే చివరి సారిగా లక్ష్మీగా చనిపోతున్నావని అంటుంది. మిత్రకు జరగబోయే ఈ పెళ్లి లక్ష్మీగా నిన్ను చంపేస్తాయని అంటుంది. అందరి నోరు మూయించేసిన నీకు ఇక కన్నీళ్లే గతి అని జాను అంటుంది. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. అరవింద కూడా ఇక నీకు కనీళ్లే గతి అని అంటుంది. అరవింద కొంగు చాచి నువ్వు నా కొడుకు కలిసి ఉండాలని అడుగుతుంది. దానికి లక్ష్మీ మీరు నన్ను అడుగుతుంది నా జీవితాన్ని కాదు మీ శాపాన్ని అడుగుతున్నారని ఏడుస్తుంది. నిన్ను కాపాడటానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడే అని అరవింద ఏడుస్తుంది. 

అరవింద కోపంగా అక్షితలు తీసుకొచ్చి వాటిని లక్ష్మీ నెత్తిన వేసి చంపేద్దామని ఆవేశంగా అరుస్తుంది. నిజం తెలియని మిత్ర, నిజం తెలిసిన మనం అందరం హంతకులు అయిపోదామని అంటుంది. ఇక వివేక్ మిత్ర కూడా లక్ష్మీ గురించి బాధ పడుతున్నాడని చెప్తుంది. దానికి లక్ష్మీ మిత్రకి నేను ఇష్టంగా గుర్తు లేదని కోపంతో గుర్తున్నానని అంటుంది. ఎలా అయినా పెళ్లి ఆపమని జాను లక్ష్మీని ప్రాధేయపడుతుంది. మరోవైపు లక్ష్మీ పెళ్లి ఆపుతుందా అని మనీషా టెన్షన్ పడుతుంది. దానికి దేవయాని అందర్ని సెట్ చేశావని నువ్వు తప్ప ఇంకెవరూ ఈ పెళ్లిని ఆపలేరని దేవయాని అంటుంది. మరోవైపు జున్ను లక్కీతో మనీషా ఆంటీ నీకు అమ్మగా ఓకేనా తను నిన్ను సరిగా చూసుకోదని అంటాడు. ఇక లక్కీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని జున్నుతో చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గ్రానీని అడిగి నిజం నిర్ధారించుకున్న జ్యోత్స్న ఇప్పుడేం చేయనుంది.. అసలైన ఆట ఇప్పుడు మొదలైందా!
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget