Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 23rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీకి తనకు ఏదో సంబంధం ఉందని అత్తతో చెప్పిన లక్ష్మీ.. టెన్షన్‌లో మనీషా, దేవయాని!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ పుట్టక గురించి లక్ష్మీ అరవిందకు అడగటం అది విన్న మనీషా, దేవయాని చాలా టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ, జున్నుల పుట్టక ఒకేలా ఉండటం వాళ్లిద్దరూ తన పిల్లలే అని తెలియని లక్ష్మీ లక్కీ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక జున్నుని కొత్త డ్రస్ వేసి రెడీ చేస్తుంది. జాను వచ్చి జున్నుని ముద్దు పెట్టుకొని విషెస్ చెప్తుంది. లక్ష్మీ పరధ్యానంలో ఉండటం చూసిన జాను ఏమైందని అడుగుతుంది.
లక్ష్మీ: రాత్రి నుంచి నా మనసు మనసులో లేదు జాను.
జాను: ఏమైంది అక్క.
లక్ష్మీ: అది.. తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య ఎక్కడున్నారు ఆమెతో ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఇక లక్ష్మీ ఒక వ్యక్తికి కాల్ చేసి భాస్కర్ గురించి అడుగుతుంది. ఆయన తనకు ఏం తెలీదని అంటాడు.
మిత్ర లక్కీని చక్కగా రెడీ చేస్తాడు. జాను, వివేక్ అక్కడికి వస్తారు. లక్కీ కోసం పట్టీలు తెమ్మని చెప్పా కదా ఏవి అని మిత్ర అడుగుతాడు. వివేక్ మర్చిపోయా గదిలో ఉన్నాయని అంటే జాను వివేక్‌తో బాబాయ్ పిన్ని కోసం అయితే ఏమీ మర్చిపోవు కానీ నా కోసం అయితే మర్చిపోతావ్ అని అంటుంది. మిత్ర, జాను నవ్వుకుంటారు. ఇక వివేక్‌ని పట్టీలు తీసుకొని రమ్మని మిత్ర చెప్తే వివేక్ జానుకు చెప్తాడు. నేను వెళ్లనంటే నేను వెళ్లనని ఇద్దరూ గొడవ పడతారు. జానుని లక్కీ వెళ్లమని చెప్తుంది. జాను వెళ్తుంది. ఇక దేవయాని జానుకి ఎదురై పట్టీలు మాత్రమే తీసుకో వివేక్ ఉంగరాలు, చైనులు తీసుకోకు అంటుంది.
జాను గదిలోకి వెళ్లి పట్టీలు తీసుకొని అక్కడున్న కొత్త డ్రస్ చూస్తుంది. చిన్న పిల్లల డ్రస్ కాదే వివేక్ ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడని అనుకుంటుంది. అద్దం ముందుకు వెళ్లి తనకు బాగుందా లేదా చూస్తుంది. ఇంతలో వివేక్ వచ్చి డ్రస్ బాగుందా అని అడుగుతాడు. జాను సిగ్గు పడుతుంది. డ్రస్ నీ కోసమే తీసుకున్నానని అందుకే పట్టీల కోసం పట్టు పట్టి మరీ తీసుకొచ్చానని అంటాడు. సాయంత్రం పార్టీలో వేసుకోమని అంటాడు. అది చూసిన దేవయాని మీ ప్రేమ కథ గిఫ్ట్‌ల వరకు వెళ్లిందా ఈ సాయంత్రం వరకే నీ సంతోషం రేపు నిన్ను ఏడిపిస్తా అని అంటుంది.
ఇక లక్కీ, జున్నులు తాతయ్య, నానమ్మలకు దండం పెడతారు. తర్వాత తల్లిదండ్రుల దీవెనులు తీసుకోమని అరవింద చెప్తుంది. మిత్ర, లక్ష్మీలు దీవిస్తారు. ఇక లక్కీని తండ్రికి గిఫ్ట్ అడగమని అరవింద అంటుంది. లక్కీ నాన్న అమ్మని గిఫ్ట్‌గా ఇస్తావా అని అంటుంది. మంచి గిఫ్ట్ అడిగావని జయదేవ్ అంటాడు. మనీషా కలుగజేసుకొని త్వరలో నేను మీ నాన్నని పెళ్లి చేసుకొని నీకు అమ్మని అవుతా అంటుంది. దానికి లక్కీ నాకు నువ్వు వద్దు లక్ష్మీ అమ్మే నాకు అమ్మగా కావాలని అంటుంది. నాకు లక్ష్మీ అమ్మే కావాలి నాన్న మీరు అమ్మ కలిసిపోండని మిత్రని లక్కీ అడుగుతుంది. పిల్లలిద్దరూ లక్ష్మీని లక్కీకి అమ్మగా ఒప్పుకోమని చెప్తారు. ఇంతలో లక్ష్మీ పిల్లల్ని స్కూల్‌కి పంపేస్తుంది.
లక్ష్మీ: అత్తయ్య లక్కీ ఎక్కడ పుట్టింది.
అరవింద: మున్నార్‌లో పుట్టిందని నీకు తెలుసు కదా.
లక్ష్మీ: ఆరోజు బాగా వర్షం పడిందని రాత్రి అన్నారు. జున్ను పుట్టినప్పుడు కూడా అలాగే జరిగింది. లక్కీ, జున్నులు ఒకే రోజు పుట్టడం ఒకే చోట పుట్టడం, వర్షం ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది. లక్కీకి నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది.
అరవింద: అదెలా సాధ్యం లక్ష్మీ.
లక్ష్మీ: అదే నాకు అర్థం కావడం లేదు. మీరే చెప్పాలి. అంటే మీకు లక్కీ తల్లి ఎవరో తెలీదా. లక్కీ మున్నార్‌లో ఎక్కడ పుట్టింది.
అరవింద: అదేదో.. అని చెప్పబోతూ జయదేవ్‌కి కాలికి గాయం కావడంతో వెళ్లిపోతారు. గాయం ఎలా అయిందని అంటే చాక్లెట్స్ కోసం బాక్స్ తీయగా సీసా పడిపోయిందని అంటుంది లక్కీ. దాంతో దేవయాని, మనీషాలు జున్నుని తిడతారు. ఇక చాక్లెట్స్ ఎవరు అక్కడ పెట్టారని అంటే మనీషా తానే పెట్టానని అంటుంది. ఇక గొడవలు వద్దని లక్ష్మీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.