అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రలను ఒకే బెడ్ మీద అలా చూసేసిన మనీషా.. జానుతో పెళ్లికి వివేక్ ఏర్పాట్లు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, లక్ష్మీలు రాత్రి మొత్తం ఒకే గదిలో ఉండిపోవడం మనీషా నిద్ర పోకుండా ఏం జరుగుంటుందా అని జుట్టు పీక్కోడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలను ఒకే గదిలో పెట్టేసి రాత్రి లక్కీ, జున్నులు తాళం వేసేస్తారు. ఒక దుప్పటి ఇస్తే మీకు ఇబ్బంది పెట్టకుండా నేల మీద పడుకుంటానని లక్ష్మీ అంటుంది. దానికి మిత్ర అవును అవును నాకు విడాకులు ఇచ్చేసి వేరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నాకు ఇబ్బంది లేకుండా.. నన్ను వదిలేసి ఏళ్ల తరబడి దూరంగా ఉంటావ్ నన్ను ఇబ్బంది పెట్టుకుండా.. ఒకవైపు నన్ను ఇబ్బంది పెట్టను అంటావ్ మరోవైపు నన్ను పట్టించుకోవు. నా బాధ నీకు అక్కర్లేదు నా సంతోషం నీకు అక్కర్లేదు నా మీద నీకు ఎలాంటి ఇది లేదు అయినా సరే నేను నీలా కాదు నిన్ను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు.

మిత్ర: ఒక్క రాత్రికి నువ్వు నా గదిలో ఉంటే నాకు నష్టం లేదు నా మదిలో చోటు ఇవ్వకపోయినా నా గదిలో చోటు ఇవ్వగలను. 
మనీషా: ఆంటీ ఇదంతా మిత్రకు దగ్గర అవ్వడానికి లక్ష్మీ వేసిన స్కెచ్. నేనే అనుకుంటే అది నన్ను మించిపోయింది.
దేవయాని: ఈ రాత్రి దేనికైనా దారి తీయొచ్చు అసలే భార్య భర్తలు ఆపై ఏకాంతం దొరికింది. ఇద్దరూ మాట్లాడుకొని అపార్థాలు తొలగించుకుంటే ఇక ఈ రాత్రి ఏమైనా జరగొచ్చు మనీషా.
మనీషా: అంటే మిత్ర, లక్ష్మీలు ఒక్కటైపోతారా. దేవుడా 

మిత్ర, లక్ష్మీని పట్టుకొని పడుకుంటాడు. ఉదయం లక్ష్మీ లేచి అది చూసి మిత్ర చేయి తీయబోతే మిత్ర వదలడు. ఇక మనీషా రాత్రి మొత్తం జాగరణ చేస్తుందని దేవయాని వచ్చి మనీషా మీద సెటైర్లు వేస్తుంది. మనిద్దరి తప్పా అందరూ మిత్ర లక్ష్మీలను కలపాలి అని చూస్తున్నారని అందుకే ఆ గది గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని దేవయాని అంటుంది. ఆ డోర్ తెరిపించే ప్రయత్నం చేయమని మనీషాకి చెప్తుంది. ఇంతలో లక్కీ కీ దొరికిందని గెంతుతూ వస్తుంది. లక్కీ కీ తీసేసరికి మిత్ర, లక్ష్మీ ఒకర్ని ఒకరు పట్టుకొని పడుకోవడం దేవయాని, మనీషా చూసి షాక్ అయిపోతారు. లక్కీ ఇద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్పి గుడికి వెళ్లాలి రెడీ అవ్వండని చెప్తుంది. లక్ష్మీ కావాలనే మనీషాని చూసి వెటకారంగా నవ్వుతుంది. మనీషా మిత్రని నిలదీస్తుంది.  ఏదేదో ఊహించుకుంటున్నావని మనీషాని అంటాడు. 

ఇక సంజన గుడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. చూడటానికి పూజలా ఉండాలి కానీ పెళ్లి జరగాలని అంటుంది. దాంతో పంతులు పెళ్లి అని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకి పెళ్లి అని తెలుసా అని అడిగితే సంజన పెళ్లి కొడుకుకి తెలుసని అంటాడు. పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలీకూడదని జరిగిన తర్వాత పెళ్లి అని తెలియాలని అంటుంది సంజన. ఇక సంజన తల్లికి ఫోన్ చేసి బయల్దేరారని అడుగుతుంది. త్వరగా రమ్మని పిలుస్తుంది. సంజన ఏం అర్థం కాకుండా మాట్లాడుతుందని అనుకుంటుంది. ఇక వివేక్ పెళ్లి కొడుకులా రెడీ అవ్వడం చూసి లక్ష్మీ వివేక్ పెళ్లి కొడుకులా రెడీ అయ్యావ్ ఇది నిజంగానే పూజ ఏనా అని అడుగుతుంది. ఇక జాను కూడా రెడీ అయి వస్తుంది. జానుని చూసి వివేక్ పెళ్లి కూతురు నడిచి వచ్చినట్లు ఫీలవుతుంది. మనీషా జాను పెళ్లి కూతురిలా రెడీ అయిందని అంటుంది. ఇక వివేక్ అన్న, పెద్దనాన్నలతో కలిసి ఒక కారులో వస్తానని మిగతా ఆడవాళ్లని మరో కారులో రమ్మని చెప్తాడు.

జయదేవ్ వివేక్‌ని పెళ్లి కొడుకులా ఉన్నావని అంటే అరవింద జానుని పెళ్లి కూతురిలా ఉన్నావని అంటుంది. పెళ్లి రాత లేదు అని దేవయాని జానుని ఏడిపిస్తుంది. లక్ష్మీ తన చెల్లి పెళ్లి తాను చేస్తానని అంటే కొంప తీసి ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుందా ఏంటి అని మనీషా అంటుంది. ఇక సంజన ఎదురైతే జయదేవ్ మీ ఇంటి ఫంక్షన్‌కి మీ వాళ్లు రాలేదేంటి అని అడుగుతాడు. దానికి వివేక్ ఇది నా పెళ్లి పెద్ద నాన్న అని జయదేవ్‌కి షాక్ ఇస్తారు. ఇంత సింపుల్‌గా గుడిలో పెళ్లి ఏంటి అని జయదేవ్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: అయ్యో క్రిష్.. ఫస్ట్ నైట్ కోసం ఎన్ని తిప్పలొచ్చాయ్ నీకు?.. ఆస్తిలో వాటా ఇస్తారా అని ప్రశ్నించిన సత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
Embed widget