Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 16th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రతో క్లోజ్‌గా మనీషా ఫీలైన లక్ష్మీ.. పిల్లల మీద అటాక్, వాళ్ల మీదే లక్ష్మీ అనుమానం!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని చంపడానికి ఎవరో తమని ఫాలో అవుతున్నారని లక్ష్మీకి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అందరూ ఊరు వెళ్తుంటారు. వివేక్ కారులో జాను చేయి పట్టుకొని నలుపుతుంటాడు. దాంతో జాను గిచ్చేస్తుంది. వివేక్ పెద్దగా అరుస్తాడు. ఏమైందని దేవయాని అడిగితే దోమ కరిచిందని అంటాడు. దానికి మనీషా ప్రేమ దోమ కుట్టుంటుందని అంటుంది. దానికి దేవయని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని కొడుకు కోడల్ని హెచ్చరిస్తుంది. మరోవైపు జున్ను, లక్కీలు చెరకు తోటలు పొలాలు చూస్తానని అనడంతో మిత్ర సైడ్‌కి కారు ఆపుతాడు.
పిల్లలు ఇద్దరూ చెరకు తోటలోకి వెళ్లి గంతులేస్తూ సరదాగా ఉంటారు. ఇక అందరూ టిఫెన్స్ చేయడానికి రెడీ అవుతారు. లక్ష్మీ టిఫిన్స్ సిద్ధం చేస్తుంది. జాను లక్ష్మీకి సాయం చేస్తుంది. ఇక వివేక్ కూడా జానుకి సాయం చేస్తాడు. కింద చాప వేసి అరవింద, జయదేవ్, వివేక్, జాను, లక్ష్మీలు కూర్చొంటారు. లక్ష్మీ జానుని పంపించి అత్తని పిలవమంటే జాను వెళ్తుంది దాంతో దేవయాని నీ పని చూసుకో అని జానుని పంపేస్తుంది. మరోవైపు మిత్ర కొలను దగ్గరకు వెళ్లి కలువ పువ్వలు చూస్తూ గతంలో తాను లక్ష్మీ ఆ పువ్వులు తీయడానికి ఎలా ప్రయత్నించారో గుర్తు చేసుకుంటాడు. ఇక లక్ష్మీ దూరం నుంచి మిత్రని చూస్తుంది. ఇంతలో మనీషా మిత్ర దగ్గరకు వెళ్లి మిత్ర చేతిని చుట్టేసి భుజం మీద వాలిపోతుంది. మిత్ర ఏం అనకుండా అలా ఉండిపోతాడు. లక్ష్మీ చూసి ఫీలవుతుంది.
లక్ష్మీ: ఆయన్ని మనీషాని పిల్లలు అలా చూస్తే ఏమనుకుంటారో.
మనీషా: మిత్ర తన చేతిలో మనీషా చేయి తీసేయడంతో.. ఏమైంది మిత్ర.
మిత్ర: పిల్లలు ఉన్నారు మనీషా. మనీషా కోపంతో వెళ్లిపోతుంది.
జయదేవ్ లక్కీ, జున్నులను పిలుస్తాడు. వివేక్, జాను గిల్లిగజ్జాలను చూసి దేవయాని రగిలిపోతుంది. మనీషా కూడా వచ్చి పక్కన నిల్చొంటే వాడికి కనీసం నేను ఉన్నాను అన్న సిగ్గు భయం లేదని అంటుంది. ఇక వాళ్లు కపుల్స్ కదా భయం, సిగ్గు ఎందుకు ఉంటుందని అంటుంది మనీషా. ఇక మనీషా చేయి పట్టుకోగానే విడిపించేశాడని చెప్తుంది. ఇక జున్ను, లక్కీలు పరుగున వస్తుంటారు. స్పీడ్‌గా ఓ కారు వస్తుంటుంది. లక్ష్మీ, మిత్ర ఇద్దరూ చూసి వాళ్లని ఆపడానికి పరుగులు పెట్టి మిత్ర లక్కీని, లక్ష్మీ జున్నుని తీసుకొని తప్పించుకుంటారు. ఇక వాళ్లు కావాలనే అటాక్ చేయడం గుర్తించిన లక్ష్మీ అందులో ఒక రౌడీని చూసి ఎక్కడో చూసినట్లందని అనుకుంటుంది.
ఇక అందరూ ఊరు చేరుకుంటారు. ఊరి పెద్ద మనుషులు లక్ష్మీని పొడుగుతారు. మరోవైపు రౌడీలు దూరం నుంచి లక్ష్మీ వాళ్లని బైనాక్యూలర్‌లో గమనిస్తూ ఉంటారు. లక్ష్మీకి అనుమానం వచ్చి చుట్టూ అనుమానంగా చూస్తుంది. ఇక జాను చిన్న కోడలు అని పరిచయం చేస్తారు. ఇక జున్నుని చూసి అచ్చం మిత్ర లానే ఉన్నారని అంటారు. అందరూ లోపలికి వెళ్లిపోతారు. లక్ష్మీ ఒక్కర్తే బయట ఉంటే ఏమైందని అరవింద అడిగితే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్లు ఉందని అంటుంది. ఇక గతంలో మిత్రని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకరిని చూశానని అంటుంది. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మీ అంటుంది. ఇక రౌడీలు అటాక్ చేయకముందే మనల్ని గుర్తు పట్టేసిందని దాన్ని చంపకపోతే మేడం చంపేస్తుందని అనుకుంటారు.
లక్కీ, జున్నులు తమకు ఇళ్లు బాగా నచ్చిందని అంటారు. ఇక జున్ను ఖడ్గం గురించి తాతయ్య, నానమ్మలకు అడుగుతాడు. అరవింద పిల్లలకు ఖడ్గం చూపించడానికి తీసుకెళ్తుంది.a మిత్ర ఒంటరిగా ఉండటం చూసి వివేక్ వెళ్తాడు. ఏమైంది అన్నయ్యా అలా ఉన్నావ్ అని అడుగుతాడు. పాత రోజులు గుర్తొస్తున్నాయా ఆ రోజులు మళ్లీ వస్తాయిలే అని చెప్తాడు. ఇక అరవింద, జయదేవ్ ఖడ్గం పిల్లలకు చూపిస్తారు. ఖడ్గం పట్టుకుంటా అని జున్ను అంటే జయదేవ్ ఇస్తాడు. ఇక అందంతా చూస్తున్న మనీషా లక్ష్మీని ఈసారి పూజ నుంచి తప్పిస్తానని అంటుంది. జాను వెళ్తుంటే వివేక్ పట్టుకొని పక్కకి లాగుతాడు. ముద్దు లేదు ముచ్చట లేదు పెళ్లి చేసుకొని వేస్ట్ అంటాడు. మా అమ్మ ఒప్పుకునే సరికి నేను ముసలాడినైపోతానని అంటాడు. వివేక్ జానుకి ఒక ముద్దు అడుగుతాడు. దానికి కూడా అత్తయ్య పర్మిషన్ కావాలని జాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.