Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today October 15th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: వివేక్, జానుల ఫస్ట్ నైట్ తెలివిగా ఆపేసిన మనీషా.. ఖడ్గం పూజకు ఊరు బయల్దేరిన ఫ్యామిలీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అత్తయ్య ఒప్పుకునేవరకు కలవొద్దని మనీషా జానుతో చెప్పడం జాను ఫస్ట్ నైట్ ఆపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్ ఇద్దరూ ఫస్ట్ నైట్ గదిలో ఉంటారు. మన ప్రేమ ఫలించింది మనం దంపతులం అయ్యాం అని వివేక్ ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇక పంతులు చెప్పిన టైం అయింది లైట్ ఆఫ్ చేస్తా అని వివేక్ అంటే జాను వద్దని అంటుంది. వివేక్‌ని బెడ్ మీద పడుకోమని తాను చాప మీద పడుకుంటా అని అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని వివేక్ జానుని అడుగుతాడు. దాంతో జాను తన దగ్గరకి దేవయాని మనీషా వచ్చి మాట్లాడిన విషయం వివేక్‌కి చెప్తుంది.
దేవయాని: నా ఇష్టం లేకుండా నువ్వు నా కోడలివి అయ్యావ్. నా ఇష్టం లేని అనుమతి లేని ఈ పెళ్లిని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఈ ఇంట్లో నీ సంతోషం ఎండమావి. అది ఎప్పటికీ నీకు దొరకదు. నీ అక్క లాగే నువ్వు కూడా కుమిలి కుమిలి చస్తావ్. ఇది నా శాపం కాదు నా శాసనం.
మనీషా: అరేరే ఏంటి జాను ఇది శుభమా అని శోభనం చేసుకుంటున్నావ్ కన్నీళ్లు పెట్టుకోవచ్చా. నా కోపం మీ అక్క మీదే కానీ నీ మీద కాదు. కాస్తో కూస్తో జాలి ఉంది. మీ అక్క మీద కోపానికి నువ్వు బలి అయిపోయావని. దేవయాని ఆంటీ మాటలకు బాధ పడకు తను నిన్ను కోడలిగా అంగీకరించే రోజు త్వరలోనే వస్తుంది. కాకపోతే నువ్వు కూడా కాస్త తగ్గాల్సి ఉంటుంది. ఆంటీ కోపం తగ్గే వరకు నువ్వు ఓ త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ పెళ్లి ఎలాగూ ఆంటీ ఇష్టంతో జరగలేదు కదా కనీసం మీ ఫస్ట్ నైట్ అయినా తన అంగీకారంతో అయితే బాగున్ను. ఆంటీ కోపం తగ్గే వరకు మీరు కలవకపోతే అప్పుడు తన ఈగో తగ్గిపోతుంది. తానే మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుంది. నిన్ను కూతురిలా చూసుకుంటుంది. అరవింద ఆంటీ మీ అక్క ఎంత మంచిగా ఉంటున్నారు అలాగే నువ్వు మీ అత్త కూడా సంతోషంగా ఉండొచ్చు.
వివేక్: అసలు నీకైమైనా పిచ్చి పట్టందా మా అమ్మ ఏదో చెప్పిందని మనీషా ఇంకేదో చెప్పిందని మనం దూరంగా ఉండటం ఏంటి.
జాను: వాళ్లు చెప్పారని కాదు కానీ నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది.
వివేక్: మా అమ్మ ఎప్పటికీ మారదు జాను. వివేక్ ఎంత చెప్పినా జాను వినదు. జాను.. జాను.. దేవుడా కష్టపడి ప్లాన్ చేసి పెళ్లి చేసుకుంది ఇందుకా ప్రేమికులుగా ఇన్నాళ్లు విడిగా ఉన్నాం పెళ్లి తర్వాత కూడానా ఏంటి నాకీ శిక్ష దేవుడా.
జాను: శిక్షా లేదు కక్షా లేదు పడుకో గుడ్ నైట్.
వివేక్: బ్యాడ్ నైట్.
ఉదయం లక్ష్మీ అందరికీ కాఫీ ఇస్తుంది. మిత్ర కూడా వస్తాడు. మిత్రకు కూడా లక్ష్మీ కాఫీ ఇస్తుంది అయిష్టంగానే కాఫీ తాగిన మిత్ర కాఫీ టేస్ట్ బాగుందన్నట్లు ఫీలవుతాడు. మరోవైపు అంతా చాటుగా చూస్తున్న దేవయాని, మనీషాలు వివేక్, జానులు ఇంకా రాలేదని ఫస్ట్ నైట్ అయిపోయిందేమో అని టెన్షన్ పడతారు. ఇక సంజన జానుని ఆటపట్టించడానికి వెళ్తుంది. జానుకి సపోర్ట్ చేయడానికి లక్ష్మీవెళ్తుంది. సంజన డోర్ కొడితే జాను వచ్చి డోర్ తీస్తుంది. జాను ఎలా వెళ్లిందో అలానే ఉంటుందని సంజన షాక్ అవుతుంది. దేవయాని, మనీషా మాత్రం తమ ప్లాన్ సక్సెస్ అయిందని నవ్వుకుంటారు. ఇక లక్ష్మీ అక్కడికి వస్తుంది. వివేక్ అప్ సెట్ అవ్వడం చూసి ఏమైందో అనుకుంటుంది. ఎందుకు విడివిడిగా పడుకున్నారని జానుని సంజన, లక్ష్మీ అడుగుతారు. దానికి జాను మనీషా తనతో మాట్లాడిన మాటలు చెప్తుంది. జాను పిచ్చి పని చేసిందని సంజన అంటుంది. మా అమ్మ మారదని ఇంత కష్టపడి పెళ్లి చేస్తే విడివిడిగా ఉంటారని అంటుంది. కానీ లక్ష్మీ మాత్రం జానునే కరెక్ట్ అంటుంది. వివేక్ అప్ సెట్ అవ్వకుండా తనకు అర్థమయ్యేలా చెప్పు అని లక్ష్మీ జానుతో చెప్తుంది.
మిత్ర ల్యాప్ టాప్ చూస్తుంటాడు. పిల్లలు హోం వర్క్ చేస్తుంటే అరవింద, జయదేవ్ వచ్చి అందరం ఊరి వెళ్దామని దసరా పూజ చేయాలని అంటారు. మిత్ర ఒకే అంటాడు. ఇక పూజ అంటే ఆ కత్తికే కదా అని మనీషా అడుగుతుంది. పిల్లలు ఏంటి ఆ కత్తి అంటే అది వంశ పారపర్యంగా వస్తున్న కత్తి అని దానితోనే మీ అమ్మ ఈ వంశాన్ని కాపాడిందని అంటారు జయదేవ్, అరవిందలు. ఊరిలో రెండు మూడు రోజులు ఉంటామని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోమని అందరికీ చెప్తారు. మిత్ర, పిల్లలు లక్ష్మీ జయదేవ్ ఓ కారులో బయల్దేరితే మనీషా, దేవయాని వివేక్ జానులు మరో కారులో బయల్దేరుతారు. వివేక్ కావాలనే జాను చేయి పట్టుకుంటాడు. జాను వద్దని సైగలతో వారిస్తే వివేక్ వదలడు ఇంతలో జాను వివేక్‌ని గిచ్చేస్తుంది. దాంతో వివేక్ అరుస్తాడు. దేవయాని ఏమైందని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!