అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 2nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ప్రమాదం, దగ్గరుండి సేవలు చేస్తున్న మిత్ర.. మనీషాకి గట్టి షాక్ ఇచ్చిన అరవింద!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మీద అటాక్ చేయించింది మనీషానే అని తెలుసుకున్న అరవింద మనీషాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ ఇంజనీర్‌తో మాట్లాడుతుంటుంది. మనీషా వచ్చి బైనాక్యూలర్‌లో లక్ష్మీ ఉన్న పరిసరాలు చూసి లక్ష్మీకి ఏం కాకపోవడంతో సరయుకి కాల్ చేస్తుంది. మనీషా సరయుకి కాల్ చేస్తుంది. లక్ష్మీకి ఇంకా ఏం కాలేదు ఎందుకని అంటుంది. దానికి సరయు ఒకసారి ప్రయత్నించా తప్పించుకుంది మరోసారి ప్రయత్నిస్తానని చెప్తుంది. లక్ష్మీ మీద రాళ్లు పడేలా చేస్తానని చెప్తుంది. అలా చేస్తే లక్ష్మీ చచ్చిపోతుందని అలా అయితే మిత్రకు కూడా ప్రమాదమని ఈ ప్లాన్ ఇక్కడే ఆపేయ్ అని చెప్తుంది. సరయు మాత్రం మాట వినకుండా ఫోన్ కట్ చేసేస్తుంది. 

సరయు లక్ష్మీ కచ్చితంగా చనిపోవాలని డ్రైవర్‌కి చెప్తుంది. మిత్ర కూడా అక్కడ ఉన్నాడు మిత్రకి ఏమైనా జరిగితే అని మనీషా పరుగులు తీస్తుంది. లక్ష్మీ కూడా మిత్రని చూస్తుంది. డ్రైవర్‌ని సరయు కంగారు పెడుతుంది. మిత్ర కోసం ఒకవైపు నుంచి మనీషా, మరోవైపు లక్ష్మీలు పరుగులు పెడతారు. ఇక లక్ష్మీ మిత్రను తోసేస్తుంది. లక్ష్మీకి మీద రాళ్లు పడటం చూపించలేదు కానీ ఎస్ అంటూ సరయు గెంతులేస్తుంది. మరోవైపు వివేక్ పిల్లల్ని మధ్యలోనే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు. మనీషా సరయుతో ఎంత పని చేశావ్ సరయు ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు ఇది పెద్ద కేసు అవుతుందని కంగారు పడుతుంది. 

అరవింద, జయదేవ్‌లు ఇంటికి పోలీసులు వస్తారు. ఇన్విస్టిగేషన్ తొందరగా పూర్తి చేయమని అరవింద వాళ్లు పోలీసులతో మాట్లాడుతారు. పిల్లలు కంగారుగా పరుగున వచ్చి అమ్మా, నాన్నలకు ఏమైనా అయిందా ఎవరికి ఏమైంది చెప్పండని అడుగుతారు. పిల్లలు ఇద్దరూ అమ్మా నాన్న అని అరుచుకుంటూ పైకి వెళ్తారు. అక్కడ లక్ష్మీ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. తలకు చేతికి కట్లు కట్టి ఉంటాయి. ఏం కాలేదని సైట్ విజిటింగ్‌కి వెళ్తే చిన్న యాక్సిడెంట్ అయిందని నాన్న నన్ను కాపాడారని లేదంటే పెద్ద ప్రమాదం జరిగుండేదని లక్ష్మీ చెప్తుంది. జున్ను తండ్రికి థ్యాంక్స్ చెప్తాడు. మిత్ర తనకు పునర్జన్మ ఇచ్చాడని లక్ష్మీ అంటుంది. దానికి అరవింద మిత్రకు నేను జన్మని ఇస్తే నువ్వు పునర్జన్మ ఇచ్చావని అంటుంది. ఈ రోజు కూడా నువ్వే మిత్రని కాపాడుంటావని అంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు జీవితాంతం కాపాడుకుంటూ ఉండాలని అంటుంది. ఇద్దరి మధ్యలోకి ఏ ఆపద రాకూడదని అరవింద అంటుంది. ఇంతలో మనీషా అక్కడికి వస్తుంది. 

అరవింద: ఏమీ తెలీనట్లు ఎంత బాగా నటిస్తున్నావ్ మనీషా. లక్ష్మీకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు బాగా తెలుసు. నీ కంగారే చెప్తుంది నువ్వు చేయించావని ఆ అవసరం నీకు మాత్రమే ఉంది ఎందుకంటే మిత్రతో నీ పెళ్లి ఆగిపోయింది. మిత్ర లక్ష్మీకి దగ్గరవుతున్నాడు. 
మనీషా: ఆంటీ ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు. ఇది నేను చేయలేదు ఆ సరయు చేసింది. 
అరవింద: సరయుతో నువ్వే చేయించావ్ నువ్వు తను కలిసే చదువుకున్నారని తెలుసు. ఇద్దరూ కలిసి కంపెనీ లేపేయాలి అనుకున్నారు అది కుదరక లక్ష్మీని లేపేయాలి అనుకున్నారు. ఇదంతా నువ్వే చేశావని ఆధారాలతో సహా మిత్ర దగ్గర ఫ్రూప్ చేస్తా. యాక్సిడెంట్ గురించి కూడా చెప్పేస్తా. మిత్రతో నిన్ను గెంటించేస్తా. నీ పాపం పండింది మనీషా.

జాను వివేక్‌లు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతారు. మిత్ర కూడా వెళ్లిపోతుంటే లక్ష్మీ తనని చూసుకోడానికి ఉండమని అంటుంది. పనోడిలా పని చేయమంటే పతిదేవుడిలా చేయమని అంటుంది. లక్ష్మీ మిత్రకు మంచి నీళ్లు తాగించమని అంటుంది. మిత్ర దూరంగా ఉండి తాగిస్తే లక్ష్మీ మిత్రతో లక్కీకి ఎలా తాగిస్తారో అలా తాగించండి అని అంటే మిత్ర లక్ష్మీ పక్కన కూర్చొని తన భుజం మీద చేయి వేసి పట్టుకొని దగ్గరకు తీసుకొని నీరు తాగిస్తాడు. లక్ష్మీ పైన నీరు పడితే కొంగుతో పెదవులు తుడుస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజుని ఇంట్లో నుంచి తరిమేసిన తల్లిదండ్రులు.. అల్లుడి హోదాలో తీసుకెళ్లిన సూర్యప్రతాప్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget