Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని ప్రమాదం నుంచి తప్పించిన మిత్ర.. జానుకి ఇంటి బాధ్యతలు అప్పగించిన అరవింద!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode దేవయానిని కాదని జానుకి అరవింద ఇంటి బాధ్యతలు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని ప్రమాదం నుంచి తప్పించిన మిత్ర.. జానుకి ఇంటి బాధ్యతలు అప్పగించిన అరవింద! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today november 1st episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని ప్రమాదం నుంచి తప్పించిన మిత్ర.. జానుకి ఇంటి బాధ్యతలు అప్పగించిన అరవింద!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/01/f96b2b3f8714241de8c1a7d123157dc01730434124451882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలు కలిసి సైట్ చూడటానికి కారులో వెళ్తుంటారు. లక్ష్మీ మిత్రనే చూస్తుంటే మిత్ర ఏయ్ ఎందుకు అలా చూస్తున్నావ్ ఏదోలా ఉంది అని అడుగుతాడు. దానికి లక్ష్మీ మీరు కూడా నన్ను చూడండి అని అంటుంది. దాంతో మిత్ర కారు సైడ్‌కి ఆపి వెనక్కి వెళ్లు అని అంటాడు. వెనక్కి వెళ్లిన లక్ష్మీ అద్దంలో మిత్రనే చూస్తూ ఉంటుంది. అలా కూడా చూడొద్దని మిత్ర అంటాడు. ఇక నుంచి ఎక్కడికైనా మీతోనే వస్తానని లక్ష్మీ అంటుంది.
ఇంట్లో జాను నైల్ పాలీష్ పెట్టుకుంటే దేవయాని చూసి పెద్ద యువరాణిలా కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొంది నేను వెళ్తే కాలు తీస్తుందో లేదో చూడాలని వెళ్లి జాను ఎదురుగా కూర్చొంటుంది. జాను పట్టించుకోదు. దాంతో దేవయాని దీనికి ఎంత పొగరు అని అనుకుంటుంది. కళ్లు నెత్తికెక్కాయే నీకు అని అంటే నా కాలు నా మీద వేసుకున్నా నీ మీద వేయలేదు కదా అత్త అంటే రాత్రి వేశావు కదా అంటుంది. ఈ రోజు కూడా నా పడక నీ గదిలోనే కదా అత్త అని అంటుంది. ముందు దేవయాని వద్దు అని తర్వాత సరే అంటుంది.
ఇక జయదేవ్, అరవిందలు రావడం చూసి జాను లేచి నిల్చొంటుంది. దానికి దేవయాని నన్ను చూసి కాలు కూడా పక్కకు జరపలేదు ఇప్పుడు మాత్రం అక్కని చూసి లేచి నిల్చొంది దీనికి నేను అత్తనా జానుకి అత్తనా అని అంటుంది. ఇక దేవయాని అరవిందతో పనివాళ్లు జీతం అడుగుతున్నారు నువ్వు బీరువా తాళం తీసుకొని వెళ్లిపోయావ్ అంటే అరవింద ఇంటి తాళాలు బీరువా తాళాలు జానుకి ఇచ్చి ఇక నుంచి జానేనే చూసుకుంటుందని అంటుంది. జాను దేవయానితో ఈ తాళాలు ఇక్కడే పెట్టుకుంటారు కదా అని నడుముకి తాళాల గుత్తి పెట్టుకొని దేవయాని ముందు స్టైల్‌గా నడుస్తుంది.
లక్ష్మీ, మిత్రలు సైట్‌కి వస్తారు. అక్కడున్న ఓ వ్యక్తి మిత్రని డైవర్ అంటే మిత్ర సీరియస్ అవుతాడు. లక్ష్మీ ఊరుకోమని చెప్తుంది. ఇందుకే నేను ముందు కూర్చొంటా అంటే వద్దన్నావ్ అని అంటుంది. ఇక సార్ ఎవరు అని లక్ష్మీని ఆయన అడిగితే సారు సారు అని మిత్రనందన్ ఎంబీఏ అంటే ఎంబీఏ డైవరా అని అంటాడు. ఇక లక్ష్మీ సైట్ విజిటింగ్‌కి వెళ్తుంది. సరయు తన మేనేజర్‌తో లక్ష్మీ మీద క్రేన్ నుంచి రాయలు విసరమని చెప్పిస్తుంది. మిత్ర అది చూసి పరుగున వెళ్తాడు. రాళ్లు పడే టైంకి లక్ష్మీని పక్కకు లాగేస్తాడు. క్రేన్ డ్రైవర్‌ని తిడతాడు. మనసులో ఈయనకు నా మీద ఇంకా ప్రేమ ఉందే అని అనుకుంటుంది. ఇలాంటివన్నీ చూసుకుంటారనే మిమల్ని నాతో పిలిచాను అంటుంది.
అరవింద, జయదేవ్‌లు ఓ చోట కూర్చొంటారు. తాళాలు ఆలోచించి ఇవ్వాల్సింది అంటే చేయాలి అనిపించి చేశానని అరవింద అంటుంది. కోడళ్లు అడగకముందే ఇస్తే మనకు గౌరవం ఉంటుందని అంటుంది. మనీషా విషయంలో వీలైనంత త్వరగా యాక్సిడెంట్ గురించి చెప్పేస్తానని అంటుంది. అప్పుడు మిత్ర, లక్ష్మీ సంతోషంగా ఉంటారని అంటుంది. ఇక దీక్షితులు గారి శిష్యుడు చెప్పిన ప్రమాదం గురించి జయదేవ్ ఆలోచిస్తాడు. ఇక మిత్ర, లక్ష్మీలకు ఇంజనీర్ ప్లాన్ వివరిస్తాడు. నీకు తెలుసు కానీ తనకు ఏం తెలీదని ఇంజనీర్ గురించి చెప్తే ఎలా అని నేను తీరిగ్గా తనకు చెప్తానని అంటాడు. లక్ష్మీ తనకు అర్థమైంది అని అంటే ఏం అర్థమైందో చెప్పమని మిత్ర లక్ష్మీ వివరిస్తుంది. మిత్ర బాగానే చెప్పిందని అనుకుంటారు. మరోవైపు మనీషా ప్రమాదం గురించి అప్డేట్ కోసం బైనాక్యులర్‌లో చూస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)