Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 15th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఐసీయూలో లక్కీ.. యాక్టింగ్ మొదలు పెట్టిన మనీషా.. లక్ష్మీ మీద చంపేంత కోపంలో మిత్ర!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ పరిస్థితి విషమంగా మారడం లక్ష్మీనే దీనంతటికి కారణం అని మనీషా చెప్పడంతో మిత్ర లక్ష్మీ మీద సీరియస్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ కోసం మిత్ర ఎన్ని సార్లు లక్ష్మీకి కాల్ చేసినా లక్ష్మీ కాల్ లిఫ్ట్ చేయదు. ఇక మిత్ర మనీషాకు కాల్ చేస్తాడు. లక్కీ కోసం మెడిసిన్ తీసుకు రావడానికి బయటకు వచ్చానని మనీషా చెప్తుంది. ఇక మిత్ర లక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అంటాడు. మిత్ర వివేక్‌కి పిలిచి ఇంటికి వెళ్దామని అంటాడు. మరోవైపు లక్ష్మీ భాస్కర్ కోసం అతను చెప్పిన అడ్రస్‌కి వచ్చి మొత్తం వెతుకుతుంది.
లక్కీ దగ్గర జున్ను ఉంటాడు. లక్కీ అమ్మా అని ఆయాస పడుతుంది. జున్ను కంగారు పడతాడు. లక్కీని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇక జున్ను జాను, దేవయానిలను పిలుస్తాడు. జాను వచ్చి లక్కీ లక్కీ అని కంగారు పడుతుంది. మిత్ర, వివేక్ కూడా ఇంటికి వచ్చేస్తారు. మిత్ర వచ్చి లక్కీకి ఏమైందని అడుగుతాడు. లక్ష్మీ గురించి మిత్ర అడిగితే బయటకు వెళ్లిందని తగిలిస్తుంది. ఇక మిత్ర, వివేక్ వాళ్లు పాపని ఎత్తుకొని హడావుడిగా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇక మనీషా వస్తే లక్కీకి సీరియస్ అయి హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్తుంది. ఇక లక్ష్మీ ఫోన్ చూస్తుంది. మిత్ర ఇన్ని సార్లు కాల్ చేశారేంటి అనుకొని కంగారు పడుతుంది. వివేక్‌కి కాల్ చేస్తే వివేక్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎవరూ ఫోన్ తీయడం లేదని లక్ష్మీ ఇంటికి వెళ్తుంది. లక్కీకి సీరియస్ అయిందని నాన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారని జున్ను లక్ష్మీతో చెప్తాడు. లక్ష్మీ షాక్ అయిపోయితుంది. మిత్ర పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. డాక్టర్ లక్కీని చూస్తారు.
జాను: లక్కీకి జ్వరమే కదా బావ తగ్గిపోతుంది.
మనీషా: జ్వరమే అంటావేంటి జాను మీ అక్క నిర్వాకం వల్ల ఇంట్లో తగ్గిపోవాల్సిన జ్వరం హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది.
జాను: మా అక్క ఏం చేసింది మనీషా
దేవయాని: లక్కీని వదిలేసి వెళ్లిపోయింది కదా డాక్టర్ అంతా చెప్పినా వినకుండా వదిలేసింది. చిన్న పిల్లని చూసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏంటో తనకి.
మనీషా: అప్పటికీ మిత్ర చెప్తూనే ఉన్నాడు. అయినా వదిలేసి వెళ్లడం ఏంటి. మెడిసిన్ అయిపోయిందని తీసుకురావడానికి నేను వెళ్లాను నేను వచ్చేలోపు లక్కీని వదిలేసి లక్ష్మీ ఎక్కడికో వెళ్లిపోయింది. తప్పు చేశావ్ మిత్ర లక్కీని లక్ష్మీకి చూసుకోమని చెప్పి తప్పు చేశావ్. నాకు చెప్పి ఉంటే నేను ఈ పాటికి జ్వరం తగ్గించేదాన్ని.
జాను: మనీషా మా అక్క గురించి చాడీలు చెప్పి బావకి కోపం తెప్పించకు.
మిత్ర: తను ఏ పరిస్థితిలో వెళ్లినా లక్కీని వదిలి వెళ్లి తప్పు చేసింది తనని క్షమించను లక్కీకి ఏమైనా జరిగితే తన అంతు చూస్తా.
లక్కీని చూసి మిత్ర ఏడుస్తుంటే మనీషా వెళ్లి ఓదార్చుతుంది. ఇంతలో జయదేవ్ వస్తాడు. మిత్ర జయదేవ్‌ని పట్టుకొని బాధ పడతాడు. లక్ష్మీ, జున్నులు కూడా హాస్పిటల్‌కి వస్తారు. లక్కీ ఐసీయూలో ఉన్నారని నువ్వు వెళ్లొద్దని వివేక్, జానులు లక్ష్మీని ఆపుతారు. నీ మీద అన్నయ్య కోపంగా ఉన్నాడని నువ్వు వెళ్తే గొడవ అవుతుందని చెప్తారు. నీ వల్లే లక్కీని ఐసీయూలో చేర్పించాల్సి వచ్చిందని నీ మీద కోపంగా ఉన్నారని అంటారు. నేను మనీషాకి చెప్పి వెళ్లానని లక్ష్మీ అంటుంది. ఏది ఏమైనా లక్కీ దగ్గరకు వెళ్తానని లక్ష్మీ వెళ్తుంది. మనీషా లక్ష్మీని చూసి ఎందుకు వచ్చావ్ లక్కీ బతికిందో లేక చచ్చిందో చూడటానికి వచ్చావా అని అడుతుంది. నువ్వు వెళ్లమంటే కదా నేను వెళ్లానని లక్ష్మీ అంటుంది. దాంతో మనీషా అబద్ధాలు ఆపు అని రివర్స్ అయిపోతుంది. గంటలో తిరిగి వచ్చేద్దామని వెళ్లానని లక్ష్మీ మిత్రకు చెప్తే మిత్ర నోర్ముయ్ అని లక్ష్మీని తిడతాడు. లక్కీ ఇప్పటికే సగం ప్రాణాలతో ఉందని నువ్వు పూర్తి చంపేయాలని చూస్తున్నావా అని తిడతాడు. లక్కీని చూసుకో అని చెప్పి నమ్మకంతో వెళ్తే లక్కీని వదిలేసి వెళ్లావని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!