Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 14th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ బాధ్యత లక్ష్మీకి అప్పగించిన మిత్ర.. మనీషా మాస్టర్ ప్లాన్.. బయటకు వెళ్లిపోయిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీని మిత్ర దగ్గర బ్యాడ్ చేయడానికి మనీషా ప్లాన్ చేయడం అదే టైంలో లక్ష్మీ పాపని వదిలేసి బయటకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ లక్కీని పట్టించుకోకపోవడం వల్లే లక్కీ కన్న తల్లిని గుర్తు చేసుకొని జ్వరం తెచ్చుకుందని దేవయాని, మనీషాలు మిత్రకు ఎక్కిస్తారు. లక్ష్మీకి బాధ్యత లేదని తగిలిస్తారు. ఇక మనీషా, దేవయానిలు బయటకు వెళ్లి ఈరోజే లక్ష్మీని ఇంటి నుంచి తరిమేసేలా చేస్తానని అంటుంది మనీషా.
మనీషా: లక్కీ జ్వరం తగ్గేంతవరకు లక్ష్మీ తన పక్కనే ఉండాలి. ఈ రోజు ఆఫీస్‌లో ముఖ్యమైన మీటింగ్ ఉంది దానికి లక్ష్మీ కచ్చితంగా అటెండ్ అవ్వాలి.
దేవయాని: లక్ష్మీ కాకపోతే మిత్ర అటెండ్ అవుతాడు కదా.
మనీషా: అదే మనకు కావాలి మిత్ర, వివేక్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీ లక్కీని చూసుకోకుండా చేయాలి. ఏదో ఒక వంకతో లక్ష్మీని ఇంటి నుంచి పంపించేయాలి. దగ్గరుండి చూసుకునే వాళ్లు లేకపోతే లక్కీకి జ్వరం పెరుగుతుంది. అందుకు కారణం లక్ష్మీ లక్కీని వదిలేసి వెళ్లడమే అని మిత్ర దగ్గర బ్యాడ్ చేస్తాం. మిత్ర లక్ష్మీని క్షమించడు వెంటనే లక్ష్మీని పంపేస్తాడు.
దేవయాని: ప్లాన్ అంతా బాగుంది కానీ ఏం చెప్పి లక్ష్మీని బయటకు పంపిస్తాం.
మనీషా: ముందు మిత్ర, వివేక్‌లను పంపించాలి. నిన్ను టెండర్ విషయంలో ఫెయిల్ అయ్యా కానీ ఈ రోజు ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వదు..
డాక్టర్ లక్కీని చూస్తారు. ఈవినింగ్ వరకు తగ్గకపోతే తర్వాత హాస్పిటల్‌కి తీసుకురమ్మని అంటారు. ప్రతీ గంటకు మందులు వేసి ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. లక్ష్మీ తాను పాపని చూసుకుంటా అని అంటుంది. నన్నే సరిగా చూసుకొని ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఉండేది కాదు మళ్లీ ఇప్పుడు నువ్వేం చూసుకుంటావని అంటుంది. నేనే చూసుకుంటానని మనీషా అంటుంది. దానికి లక్ష్మీ ఒప్పుకోదు నేను చూసుకుంటా అని అంటుంది. దాంతో మిత్ర నేనే చూసుకుంటానని అంటాడు. ఇక లక్ష్మీ తనని నమ్మమని దగ్గరుండి చూసుకుంటానని సాయంత్రానికి జ్వరం తగ్గేలా చేస్తానని అంటుంది. అందరూ చెప్పడంతో మిత్ర లక్ష్మీకి లక్కీ బాధ్యత అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తాడు. మిత్ర, వివేక్ ఆఫీస్‌కి వెళ్లిపోతారు.
జానుని ఏదో ఒకటి చెప్పి అక్కడ ఉండకుండా చేయమని మనీషా దేవయానితో చెప్తుంది. దాంతో దేవయాని జాను దగ్గరకు వెళ్లి లక్కీ కోసం గుడికి వెళ్దాం పద అని తీసుకెళ్తుంది. ఇక లక్ష్మీ లక్కీ దగ్గర ఉంటుంది. లక్కీ అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. ఇక జున్ను భాస్కర్ చెల్లే లక్కీ తల్లి అని చెప్పబోయే టైంకి లక్ష్మీకి ఫోన్ వస్తుంది. లక్ష్మీకి భాస్కర్ ఫోన్ చేస్తాడు. లక్కీ గురించి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని లక్ష్మీని రమ్మని పిలుస్తాడు. అదంతా విన్న మనీషా లక్ష్మీని ఈ వంకతో ఇంటి నుంచి తరిమేస్తాను అనుకొని లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్కీ దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్లు అంటుంది. లక్ష్మీ వెళ్లను అంటుంది అయినా మనీషా వెళ్లు అనడంతో లక్ష్మీ జున్నుకి లక్కీని చూసుకోమని చెప్పి జానుకి చెప్పమని అంటుంది. లక్ష్మీ బయటకు వెళ్లిపోతుంది.
ఇక మిత్ర లక్కీ కోసం లక్ష్మీకి కాల్ చేస్తాడు. లక్ష్మీ ఫోన్ సైలెంట్‌లో ఉండటంతో లక్ష్మీ చూసుకోదు మిత్ర చాలా సార్లు ఫోన్ చేస్తాడు. ఇంతలో వివేక్‌కి చెప్పి జానుకి కాల్ చేయించమని చెప్తాడు. దాంతో జాను నేను మీ అమ్మ గుడికి వచ్చామని చెప్తుంది. లక్ష్మీ ఇంట్లోనే ఉండి పాపని చూసుకుంటుందని జాను చెప్తుంది. ఇక దేవయాని మధ్యలో భాస్కర్‌ని చూసి కారు ఆపించి మనీషాకి కాల్ చేసి భాస్కర్ ఒక్కడే ఉన్నాడని చెప్తుంది. భాస్కర్‌కి ఎదురు పడమని అప్పుడు వాడే పారిపోతాడని మనీషా చెప్తుంది. అలాగే దేవయాని భాస్కర్‌కి కనిపిస్తుంది. దాంతో భాస్కర్ లక్ష్మీతో తర్వాత మాట్లాడొచ్చని అనుకొని పారిపోతాడు. ఇక దేవయాని దగ్గరకు జాను రావడంతో దేవయాని టెన్షన్ పడుతుంది. ఏమైందని ఎందుకు అంత టెన్షన్ అని జాను అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పెళ్లి టైంకి సుమతిని తీసుకొస్తానని శపథం చేసిన సీత.. విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేయమన్న మహాలక్ష్మీ!