Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 10th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఆయనకు ఇద్దరు.. ఇక నుంచి నువ్వు నేను సొంత సిస్టర్స్.. మనీషా మాటలకు లక్ష్మీ ఏడుపు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా మిత్రని తనతో సరయు పార్టీకి పంపమని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటికి సరయు వస్తుంది. మొదటి సారి ఇంటికి వచ్చావ్ ఏం తీసుకుంటావని లక్ష్మీ అడుగుతుంది. ఇక మిత్ర వస్తాడు. సరయు హాయ్ చెప్తుంది. హోళీ ఈవెంట్ ప్లాన్ చేశానని అందరు బిజినెస్ వాళ్లని పిలుస్తున్నానని అలాగే మిమల్ని పిలుస్తున్నానని చెప్తుంది. మీరు వస్తే బాగుంటుందని మిత్రకు ఇన్విటేషన్ ఇస్తుంది. సరయు వెళ్లిపోయిన తర్వాత మనీషా మిత్రతో మనం ఇప్పుడా ఈవెంట్‌కి వెళ్లాలా అంటే మిత్ర అవసరం లేదని చెప్పి వెళ్లిపోతాడు.
మనీషా తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లుందని అనుకుంటుంది. దేవయాని కూడా ఎవరినీ వెళ్లొద్దని చెప్తుంది. లక్ష్మీ మనీషాని చూసి నవ్వుతుంది. మనీషా లక్ష్మీ దగ్గరకు వచ్చి హోళీ ఈవెంట్‌కి నేను మిత్ర వెళ్లాలి మిత్రను నువ్వే ఒప్పించాలని మనీషా చెప్తుంది. ఆయనకు ఇష్టం లేకపోతే నేనేం చేయలేను అని లక్ష్మీ అంటే రాత్రి జాను, వివేక్‌లు గొడవ పడ్డారు కదా జానుకి నిజం చెప్తాను అని లేదంటే ఆంటీకి చెప్తాను అని మనీషా వెళ్లబోతే లక్ష్మీ ఆపుతుంది. లక్ష్మీ మిత్ర దగ్గరకు వెళ్లి హోళీ ఈవెంట్‌కి వెళ్లమని చెప్తుంది. మిత్ర తనకు ఇష్టం లేదని అంటాడు. లక్ష్మీ ఒప్పించే ప్రయత్నం చేస్తే అంత ఫోర్స్ ఎందుకు చేస్తావ్ అని అంటే శత్రువుల్ని మిత్రువుల్ని చేసుకునే అవకాశం ఇలాంటిదే అని అంటుంది.
మిత్ర మామ్ వచ్చే టైంకి నేను ఉండాలి అంటాడు. ఇక మిత్ర నేను వెళ్తే నువ్వు సంతోషపడతాను అంటే వెళ్తాను అంటాడు. లక్ష్మీ బాధగా తలూపుతుంది. మిత్ర సరే వెళ్తాను అంటాడు. మనీషా ఏమైందని అడిగితే లక్ష్మీ ఆయన వస్తారు అనగానే మనీషా సంతోషంగా లక్ష్మీని గిరగిరా తిప్పేస్తుంది. జానుని చూస్తే జలసీగా ఉందని నీలాంటి సిస్టర్ నాకు లేదని అంటుంది. ఇక మిత్రని పెళ్లి చేసుకుంటే మనం సిస్టర్స్ అవుతామని ఆయనకు ఇద్దరిలా మిత్రకు నువ్వు నేను అని అంటుంది. మనీషా మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. మనీషా లక్ష్మీ బుగ్గలు గిచ్చి నువ్వుకుంటూ వెళ్లిపోతుంది.
హోళీ వేడుకలకు అందరూ వస్తారు. మిత్ర, మనీషాలు వస్తారు. సరయు, రాజుగారు ఇద్దరినీ పలకరిస్తారు. సరయు మనీషాని చాటుగా తీసుకెళ్లి మిత్ర రావడం ఆశ్చర్యంగా ఉందని అంటే మిత్రను లక్ష్మీనే పంపిందని మనీషా చెప్పడంతో సరయు షాక్ అవుతుంది. లక్ష్మీ ఇప్పుడు తాను ఏం చెప్పినా చేస్తుందని అంటుంది. లక్ష్మీ మిత్రని పంపింది అంటే ఏదో ప్లాన్ చేస్తుందని సరయు అనడంతో లక్ష్మీకి అంత సీన్ లేదని అంటుంది. ఇంతలో లక్ష్మీ మొత్తాన్ని తీసుకొని హోళీ వేడుకలకు వస్తుంది. మనీషా కంగుతింటుంది. అందరూ లక్ష్మీతో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని పలకరిస్తారు. లక్ష్మీతో మనీషా ఫ్యామిలీ మొత్తం వచ్చారేంటి అని అడిగితే మిత్ర రమ్మన్నాడని అంటుంది. మిత్ర తానే పిలిచానని చెప్తాడు. ఆయన ఎక్కడున్నా ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటున్నారని కళ్లద్దాలు తీసి కన్ను ఎగరేస్తుంది. మనీషా సరయుతో అయినా తన ప్లాన్ సక్సెస్ అవ్వాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

