అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీతో ఫోన్‌లో మాట్లాడిన లక్ష్మీ వాయిస్ గుర్తుపట్టిన అరవింద, మిత్ర.. స్కూల్‌లో లక్ష్మీని కలుస్తారా!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కోసం జున్నుకి తండ్రి స్థానంలో అర్జున్‌ వెళ్లడం, మిత్ర కుటుంబం కూడా స్కూల్‌కి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: జున్ను అలిగి వెళ్లిపోతుంటే అర్జున్ అడ్డుకొని బుజ్జగిస్తాడు. అమ్మ బాధ పడకూడదు అంటే అమ్మకు నచ్చింది చేయమని అంటాడు. ఇక జున్ను ఫాదర్స్ డే కదా అందరూ తన తండ్రులతో వస్తారు. నాతో ఎవరు వస్తారు అని జున్ను అడుగుతాడు. దానికి అర్జున్ నేను వస్తాను అని చెప్తాడు. లక్ష్మీ షాక్ అవుతుంది. అర్జున్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. రెడీ అయి వస్తాను అని జున్ను సరదాగా వెళ్తాడు. 

అర్జున్: సారీ లక్ష్మీ జున్ను బాధ పడుతున్నాడు అని జున్నుతో పాటు వస్తాను అన్నాను. తనతో పాటు నేను వస్తే సంతోషంగా ఫీలవుతాడు అని అలా అన్నాను. మీకు ఇష్టం లేకపోతే నేను ఇక్కడే డ్రాప్ అయిపోతా.
లక్ష్మీ: పర్లేదు అర్జున్ గారు నేను జున్నుని రెడీ చేసి తీసుకొస్తా.

మరోవైపు మిత్ర అందంగా రెడీ అవుతాడు. లక్కీ కూడా రెడీ అయి తండ్రిని పొగిడేస్తుంది. అరవింద వచ్చి కూతురు పొగటం తండ్రి మురిసి పోవడం అంటుంది. ఇక మనీషా వచ్చి నువ్వు హీరో అని లక్కీ ఇప్పుడు చెప్పింది నేను ఎప్పుడో చెప్పాను నువ్వు వినడం లేదు అని అంటుంది. ఇక లక్కీ అందరిని ఆపమని ఫంక్షన్‌కి వెళ్దామని తీసుకెళ్తుంది. ఇక వివేక్ మీ ఫాదరే రావాలా చిన్న ఫాదర్ రావొద్దా అని అడిగితే లక్కీ బాబాయ్‌తో నేను పిలవకపోయినా వస్తావ్ కదా బాబాయ్ జానూ టీచర్‌ కోసం అని సెటైర్ వేస్తుంది. మిత్ర, అరవింద చిన్నగా నవ్వుకుంటే దేవయాని కోపంగా ఉంటుంది. వివేక్ చిన్నగా జారుకుంటాడు. అందరూ స్కూల్‌కి బయల్దేరుతారు. అర్జున్‌ కూడా జున్నుని తీసుకెళ్తాడు.

జున్ను: ఎప్పుడూ నాకు ఫాదర్స్‌డే నచ్చేది కాదు కానీ మొదటి సారి నచ్చుతుంది. ఎందుకు అంటే మీరు వస్తున్నారు కాబట్టి. నా కోసం వస్తున్నందు థ్యాంక్యూ.
అర్జున్: నీ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా చెప్పు.
అరవింద: మిత్ర లక్కీని స్కూల్‌ మార్చేస్తా అన్నావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు.
మిత్ర: ఏం చేయాలి మామ్ లక్కీ స్కూల్ మారితే నా చదువు పోతుంది. అది ఇదీ అని నా మనసు మార్చేసింది.
లక్కీ: మా మంచి నాన్న ఇలా చెప్పగానే వింటాడు.
అరవింద: లక్కీ జున్ను కూడా ఈ ఫంక్షన్‌కి వస్తున్నాడా.
లక్కీ: ఏమో నానమ్మ నాకు తెలీదు.
వివేక్: అదేంటే బెస్ట్ ఫ్రెండ్ అంటావ్ కనీసం తను ఫంక్షన్‌కి వస్తున్నాడో రాడో కూడా తెలీదా. 
లక్కీ: ఇప్పుడే కనుక్కుంటా బాబాయ్ నీ ఫోన్ ఇలా ఇవ్వు. అని లక్కీ లక్ష్మీకి కాల్ చేస్తుంది. లక్ష్మీ వాయిస్ విని మిత్ర, అరవిందలు బాగా తెలిసిన వాయిస్‌లా ఉందని లక్ష్మీ వాయిస్‌లా ఉందని అనుకుంటారు. ఇక మిత్ర అమ్మ అని పిలుస్తున్నావ్ అని అలా ఎవర్ని పడితే వాళ్లని పిలవకూడదు అని అంటాడు. ఇక వివేక్ జున్నుకి ఎందుకు ఫాదర్స్ డే గురించి అంటే ఇష్టం లేదు అని అడుగుతాడు. లక్కీ చెప్పబోతే మిత్ర ఆపేస్తాడు. ఇక మిత్ర వాళ్లు స్కూల్‌ దగ్గరకు వచ్చేస్తారు. జాను వివేక్‌ కోసం చూస్తుంది. ఎవరి కోసం చూస్తున్నావ్ అని అరవింద అడిగితే అందరూ వచ్చారా లేదా అని చూస్తున్నా అని జాను అంటుంది. లక్కీ ఎవరు ఆ స్పెషల్ పర్షన్ అని అంటుంది. 

జాను వివేక్‌ కోసం బయట మొత్తం వెతుకుతుంది. వివేక్ ఓ చోట నిల్చొని జానునే చూస్తుంటాడు. జాను వివేక్‌ని చూసి సిగ్గు పడుతుంది. నాకోసమే వెతుకుతున్నావు కదా అని అంటాడు. ఇక దేవయాని వివేక్‌ మీద సీరియస్ అవుతుంది. జానుతో దూరంగా ఉండమని ఇన్‌ డైరెక్ట్‌గా చెప్తుంది. అరవింద వచ్చి వాడు దేవయానితో మాట్లాడుతున్నాడు మెడలో తాళి కట్టడం లేదు అని నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోను అని అన్నాడు కదా అని అంటుంది. దేవయాని తనకు గౌరవం దక్కలేదు అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో లక్ష్మీ వాళ్లు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు పోగొట్టుకున్న మధు.. మహా సామ్రాజ్యంలో సీతకి కోడలి స్థానం కల్పిస్తానన్న విద్యాదేవి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget