Seethe Ramudi Katnam Serial Today June 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు పోగొట్టుకున్న మధు.. మహా సామ్రాజ్యంలో సీతకి కోడలి స్థానం కల్పిస్తానన్న విద్యాదేవి!
Seethe Ramudi Katnam Serial Today Episode ఇంట్లో ఉన్న డబ్బుని శివకృష్ణనే మధుతో కలిసి మాయం చేసి నింద తన కుటుంబం మీద వేస్తున్నారు అని సూర్య సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Seethe Ramudi Katnam Serial Today June 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు పోగొట్టుకున్న మధు.. మహా సామ్రాజ్యంలో సీతకి కోడలి స్థానం కల్పిస్తానన్న విద్యాదేవి! seethe ramudi katnam serial today june 14th episode written update in telugu Seethe Ramudi Katnam Serial Today June 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు పోగొట్టుకున్న మధు.. మహా సామ్రాజ్యంలో సీతకి కోడలి స్థానం కల్పిస్తానన్న విద్యాదేవి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/9b3702a8a300bc629d586ae5131fad801718336999720882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Seethe Ramudi Katnam Today Episode: జలజ మధుకి తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు తీసుకొచ్చి సూర్యకి ఇవ్వమని చెప్తుంది. మధు తనకు ఆ డబ్బు అవసరం లేదు అంటాడు. సూర్యను తన అన్న వదినలు ఒప్పిస్తారు. ఇక మధు డబ్బు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. బీరువాలో డబ్బు కనిపించదు. మధు టెన్షన్ పడుతూ బయటకు వెళ్లి డబ్బు కనిపించడం లేదు అని చెప్తుంది. అదే టైంకి మధు తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. బీరువాలో పెట్టావా ఇంకెక్కడ పెట్టావా అని అడుగుతారు. బీరువాలోనే పెట్టాను బాగా గుర్తుందని మధు చెప్తుంది. ఇక బీరువాకి తాళం ఉందా అని శివకృష్ణ అడిగితే లేదు అని మధు చెప్తుంది.
సూర్య: చెప్పు ఆగిపోయావే.. బీరువాకి తాళం ఉందా లేదా అని మీ నాన్న ఏ ఉద్దేశంతో అన్నాడో అది చెప్పు. ఇంట్లో వాళ్లే దొంగతనం చేశారు అంతే కదా.
లలిత: బాబు ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు.
సూర్య: పోలీస్ బుద్ధి ఇలాగే ఉంటుంది. అందరిని అనుమానించడమే ఆయన ఉద్దేశం. ఎస్‌ఐ గారు ఆయన భార్య ఎందుకు వచ్చారో తెలుసా అన్నయ్య మనల్ని దొంగల్ని చేయడానికే వచ్చారు. నన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్ను వదినను దొంగలని చేయాలని చూస్తున్నారు. డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి మనపై దొంగతనం నెపం మోపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం సార్ మా అన్న వదినల్ని అరెస్ట్ చేయండి.
లలిత: మీరు పొరపాటు పడుతున్నారు బాబు మేం అందుకు రాలేదు.
శివకృష్ణ: మీరు ఏ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో తెలుసుకోవడానికి వచ్చాం.
సూర్య శివకృష్ణ లలిత ఎంత చెప్పినా సూర్య వినడు. మధు సాయంతో మళ్లీ డబ్బు తీసుకొని వాళ్లని దొంగలు చేశారని నిందిస్తాడు. జలజ కూడా శివకృష్ణ, లలితల్ని మాటలు అంటుంది. ఇక డబ్బులు దొరికితే ఫోన్ చేయి అని చెప్పి మధు తల్లిదండ్రులు వెళ్లిపోతారు. మరోవైపు మహాలక్ష్మి, అర్చన మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు ఆడవాళ్లు వచ్చి తన కూతిరి సీమంతం అని తప్పకుండా రావాలి అని చెప్తారు. ఇక వాళ్లు మీ కోడలు ఎక్కడ అని అడిగితే అర్చన సీత అనుకొని ఇక్కడే ఎక్కడ ఉంది అనబోతే మహాలక్ష్మి సీత గురించి కాదు అని మధు గురించి అని తను పుట్టింటికి వెళ్లిందని అంటుంది. ఇంతలో వాళ్లు సీతని చూసి పిచ్చిది ఇంకా ఇంట్లో ఉంది అనుకొని కోడలి చెల్లికి జబ్బు పోలేదా అని అడుగుతారు.
విద్యాదేవి దూరం నుంచి విని సీతకి పిచ్చి అని మహాలక్ష్మి అందరికీ చెప్తుందా అని అనుకుంటుంది. సీత తనకు పిచ్చి లేదు అని అంటుంది. వాళ్లు సీతకి పిచ్చి లేదు అని నిరూపించమని అంటారు. దానికి సీత మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. వాళ్లు సీమంతం అని పిలవడానికి వచ్చామని అని అంటారు. సీత సీమంతం అంటే ఏంటో అని అడుగుతుంది. మహాని కూడా అడుగుతుంది. ఇక సీత సీమంతం అంటే ఏంటి అని చెప్తుంది. విద్యాదేవితో పాటు వచ్చిన ఆడవాళ్లు కూడా ఫిదా అయిపోతారు. రామ్ విజిల్ వేస్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. ఇక వాళ్లు సీతకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు. రామ్ సీతని పొగుడుతాడు. దాంతో మహాలక్ష్మి రగిలిపోతుంది. ఇక విద్యాదేవి తను ఇంట్లో ఉన్నంత వరకు సాయం చేస్తాను అని ఇంట్లో నీ కోడలి స్థానం పదిలం చేస్తానని సీతకు మాటిస్తుంది.
ఇక సీత ఆరుబయట బట్టలు ఆరేస్తుంటే మహాలక్ష్మి అక్కడికి వచ్చి జరిగిన విషయం గురించి అడుగుతుంది. విద్యాదేవిని ఎందుకు పేరంటానికి పిలిపించావు అని మన ఇంటి మనిషిగా ఎలా తీసుకెళ్తావని అడుగుతుంది. ఆవిడ గురించి వివరాలు తెలీవు అని ఆమె దాస్తుందని అంటుంది. ఇక మహా తన ఇంట్లో రహస్యాలు ఉండకూడదు అని అంటే మీకు కూడా రహస్యాలు ఉన్నాయి అని చెప్తుంది. సుమతి అత్తయ్య గురించి చెప్పలేదు అని అంటుంది. తన అత్తయ్య రాసుకున్న ఆఖరి పేజీలు చిరిగిపోయాయని వాటిని మీరే చింపేశారు అని నాకు అనుమానంగా ఉందని సీత మహాలక్ష్మితో అంటుంది. తనకు అలాంటి సీక్రెట్స్ ఏం లేవు అని తాను సుమతి మంచి ఫ్రెండ్స్ అని మహా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఉలూచిని తిరిగి ఆడపిల్లలా మార్చిన విశాలాక్షి.. సుమన కుట్రను బయట పెడుతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)