Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ మిస్టరీని జాను కనిపెట్టేస్తుందా.. తనతో పాటు కలిసున్నది లక్ష్మి అని మిత్రకు తెలిసిపోతుందా!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode అర్జున్ జున్ను తండ్రి కాదు అని తెలుసుకున్న జాను లక్ష్మీ మీద అనుమానంతో వివేక్‌ని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: చలమయ్య జున్ను తల్లి లక్ష్మీ అని చెప్పడంతో జాను చాలా రకాలుగా ఆలోచిస్తుంది. జున్ను తల్లి తన అక్కేనా అని తెలుసుకోవడానికి చలమయ్యతో కలిసి ఇంటికి వెళ్లుంది. ఇక అరవింద ప్రసాదం వండుతుంటే మిత్ర వచ్చి ఎందుకని అడుగుతాడు. ఆ అమ్మాయికి నీకు చేతనైన సాయం నువ్వు చేస్తుంటే నేను నాకు చేతనైన సాయం చేస్తున్నానని చెప్తుంది.
మిత్ర: కొన్ని ప్రదక్షిణలకే నాకు అలసటగా అనిపించింది. రెస్ట్ తీసుకోవాలి అనిపించింది. అలాంటిది ఆ అమ్మాయి అన్ని ప్రదక్షిణలు చేస్తుంది. పైగా తల పైన అంత బరువు మోస్తుంది. అసలు ఇంత కఠినమైన దీక్ష చేయడానికి ఎందుకు ఒప్పుకుంటుందని అనిపిస్తుంది.
అరవింద: ఆ అమ్మాయి లాంటి ఆడపిల్లలు అంతే మిత్ర చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారు. పెళ్లి అయ్యాక భర్త కోసం ప్రాణం పెడతారు. పిల్లలు పుట్టాక పిల్లలకు సర్వస్వం ధారపోస్తారు. తన వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. ఎంత దూరం అయినా వెళ్తారు. ఆఖరికి ప్రాణం కూడా లెక్క చేయరు.
మిత్ర: ఈ అమ్మాయిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది మామ్. తన భర్త కోసం ఇంత చేస్తుంది అంటే తను రియల్లీ గ్రేట్.
లక్ష్మీ పడిపోబోతే మిత్ర పరుగున వెళ్లి పట్టుకుంటాడు. లక్ష్మీ ఇబ్బంది పడుతుంటే మిత్ర పట్టుకొని ప్రదక్షిణలు చేయిస్తాడు. ఇక జాను జున్ను ఇంటికి వెళ్తుంది. జాను జున్నుని తన తల్లి గురించి అడుగుతుంది. జున్ను తన తల్లి గుడికి వెళ్లిందని చెప్తాడు. మీ అమ్మని నేను ఎప్పుడు చూడలేదు అని ఈ రోజు అయినా చూస్తానా లేదో అని అనుకుంటుంది. ఇక ఫొటో ఉందా అని అంటే జున్ను, వసుంధర ఇద్దరూ లక్ష్మీకి ఫొటోలు, వీడియోలు ఇష్టం ఉండవని ఫోటోలు తీసినా ముఖం దాచేస్తుందని చెప్తారు. ఇక ఒక ఫోటో ఉందని జున్ను వెతుకుతాడు. ఎక్కడా కనిపించలేదు అని చెప్తాడు. ఇంతలో లక్కీ తీసిన వీడియో గుర్తొచ్చి ఆ విషయం చెప్తాడు. ఇక జున్ను లక్కీకి కాల్ చేసి ఆ వీడియో పంపించమని అడుగుతాడు. లక్కీ మనీషాకు ఫోన్ తీసుకురమ్మని చెప్తుంది. మనీషా కోపంతో లక్కీని తిట్టుకుంటూ ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది. అసలు లక్కీ ఏం వీడియోలు తీస్తుందా అని చూస్తుంది. ఇక మనీషా వీడియో తీసుకొని చూస్తుంది. ఇంతలో జున్ను పిలవడంతో మనీషా ఫోన్ తీసుకొని వెళ్లి లక్కీకి ఇస్తుంది.
జాను జున్నుని తన తల్లి గురించి అన్నీ అడుగుతుంది. అర్జున్ వాళ్ల ఆఫీస్‌లోనే పని చేసేదాన్ని అని తెలుసుకుంటుంది. ఇక అర్జున్ తన తండ్రి కాదు అని తాను తన తల్లి వాళ్ల ఇంట్లో ఉంటున్నామ్ అని చెప్తాడు. జాను ఫాదర్స్ డే రోజు అర్జున్ తండ్రిగా రావడం గుర్తు చేసుకుంటుంది. తనకు అమ్మ మాత్రమే ఉంది నాకు నాన్న లేడు అని జున్ను చెప్తాడు. తన తండ్రి అమ్మని వదిలేసినట్లున్నాడని చెప్తాడు. తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు అని జున్ను చెప్తాడు. జాను రకరకాలుగా ఆలోచిస్తుంది. జాను బయటకు వెళ్లి వివేక్‌కి కాల్ చేస్తుంది. అర్జెంటుగా కలవాలి అని వివేక్‌కి జున్ను వాళ్ల ఇంటికి రమ్మని చెప్తుంది. మరోవైపు లక్ష్మీ ప్రదక్షిణలు పూర్తి అవుతుంది. లక్ష్మీ మిత్రలు గుడి ప్రాంగణంలో ఉన్న ప్రసాదం తినడానికి అనువుగా ఉన్న ఆకులు తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ లక్ష్మీ కాళ్లకి ముళ్లు గుచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.