Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అమ్మా అంటూ లక్ష్మీని అందరి ముందు హగ్ చేసుకున్న జున్ను.. లక్ష్మీ దొరికిపోతుందా!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode సంయుక్తని కలవడానికి మిత్ర వెళ్లడం అక్కడ అర్జున్‌ని చూసి తనకు అడ్డుపడుతున్నాడని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అమ్మా అంటూ లక్ష్మీని అందరి ముందు హగ్ చేసుకున్న జున్ను.. లక్ష్మీ దొరికిపోతుందా! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today july 30th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అమ్మా అంటూ లక్ష్మీని అందరి ముందు హగ్ చేసుకున్న జున్ను.. లక్ష్మీ దొరికిపోతుందా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/30/94bd478855ad0a5ec8c57a3e1dbcfa7c1722310761769882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: సంయుక్తగా ఉన్న లక్ష్మీ పూజ చేసి అరవింద కాళ్లకు దండం పెడుతుంది. ఇక సంయుక్త మిత్ర కాళ్లకు దండం పెడుతుంది. తన కాళ్లకు దండం పెట్టావెందుకని అడిగితే మిత్రకు తన భార్యలా అనిపించిందా లేదా అని అలా చేశానని అంటుంది.
సంయుక్త: మిత్ర గారు ఈ రోజు నేను అచ్చం నీ భార్య లానే కనిపిస్తున్నానా అని అడుగుతుంది. దాంతో మిత్ర వెళ్లిపోతాడు. మనసులో నాకు తెలుసు మిత్ర గారు మీకు నేను అంటే చాలా ప్రేమ కానీ బయటకు కోపం నటిస్తున్నారు.
మనీషా: ఆంటీ చూశారా రోజు రోజుకు లక్ష్మీ బయట పడిపోతుంది.
జయదేవ్: అమ్మా లక్ష్మీ ఏంటి ఇది నువ్వు ఇలా చేస్తే దొరికిపోతావ్.
లక్ష్మీ: ఈ ఇంటితోనూ ఆ పూజ గదితోను నాకు ఉన్న అనుబంధం వేరు. అందుకే నాలో నన్ను చూసుకోవాలి అనుకున్నా.
మిత్ర లక్ష్మీ గతంలో చేసే పూజలను గుర్తు చేసుకుంటాడు. లక్ష్మీ తనకు హారతి ఇస్తే వద్దు అని వెళ్లిపోవడం గుర్తు చేసుకుంటాడు. ఇంతలో మిత్ర దగ్గరకు అరవింద వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ మిత్ర, నీ గుండెలో ఓ అలజడి రేగుతుంది కదా అని అడుగుతుంది. ఈ రోజు సంయుక్తని చూస్తే లక్ష్మీ గుర్తొచ్చిందని లక్ష్మీనే వచ్చి పూజ చేసినట్లు అనిపించిందని నాకే అలా అనిపిస్తే నీకు ఎలా ఉంటుందో నాకు తెలుసని అంటుంది. ఇక మిత్ర తల్లి మాటలను కొట్టి పడేస్తే అరవింద ఒప్పుకోదు. లక్ష్మీ మీద అభాండాలు వేశానని తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకుంటున్నావని అంటుంది. లక్ష్మీ విషయంలో తాను కరెక్ట్‌గానే ఉన్నానని మిత్ర అంటాడు. లక్ష్మీలా సంయుక్త కనిపించినంత మాత్రాన తన అభిప్రాయం మారదని, నిజంగా లక్ష్మీ వచ్చినా తన మనసు మారదని మిత్ర అంటాడు.
జున్ను నిద్ర లేచి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఇక తాను లక్కీ వాళ్ల ఇంట్లో ఉండిపోయాను కదా అనుకుంటాడు. ఇంతలో లక్కీ రావడంతో నేను వెళ్లిపోతా అంటాడు. ఇంతలో ఎదురుగా లక్ష్మీలా మారిన సంయుక్తని చూసి జున్ను అమ్మ తన కోసం వచ్చిందని పరుగున వెళ్లి అమ్మ అని సంయుక్తని హగ్ చేసుకుంటాడు. అది మనీషా, దేవయానిలు చూసేస్తారు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. జాను, వివేక్, జయదేవ్‌లు కూడా అక్కడికి వస్తారు. అందరూ లక్ష్మీ దొరికిపోతుందని కంగారు పడతారు. నేనే ఇంటికి వచ్చేవాడిని కదా నువ్వు ఎందుకు వచ్చావ్ అని జున్ను అంటాడు. దానికి వివేక్ వెంటనే మీరు గ్రేట్ సంయుక్త గారు సంసృతి సంప్రదాయాల కోసం ఎంతకైనా తెగిస్తారు అని పిల్లలతో అమ్మ అని పిలిపించుకుంటున్నారని వివేక్ అంటాడు. దాంతో సంయుక్త అందర్ని నాలో కలుపుకుంటానని కవర్ చేస్తుంది. జున్ను షాక్ అయిపోతాడు.
మిత్ర బయట ఉంటే జున్ను వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. మిత్ర, జున్నులు ఒకర్ని ఒకరు సెటైర్లు వేసుకుంటారు. తండ్రీ కొడుకుల మాటల యుద్ధం మొదలవుతుంది. ఇక జున్ను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటాడు. ఇంతలో లక్కీ వచ్చి డ్రాప్ చేయమని చెప్పి వెళ్లిపోతుంది. ఇక జున్ను మిత్రకు సీటు బెల్ట్ పెడతాడు. మరోవైపు సంయుక్త రెడీ అయి వస్తుంది. జున్ను తనని హగ్ చేసుకున్న సంగతి గుర్తు చేసుకొని జానుని పిలిచి జున్ను గురించి అడుగుతుంది. ఇంటికి వెళ్తానని చెప్పాడని అంటుంది. జున్ను ఎలా వెళ్లాడో ఏంటో అని లక్ష్మీ అనడం లక్కీ వినేస్తుంది. లక్కీని చూసి జాను, సంయుక్తలు షాక్ అవుతారు. ఇక లక్కీ జున్నుని మిత్ర డ్రాప్ చేశారని చెప్తుంది. ఇక లక్కీ తాను జున్ను వాళ్ల అమ్మ అని అది తానే నిరూపిస్తానని అనుకుంటుంది. మరోవైపు మిత్ర సంయుక్త దగ్గరకు వస్తే అర్జున్ కూడా అక్కడే ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)