అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో సంయుక్త, జాను.. తల్లికి టెస్ట్ పెట్టాలనుకున్న లక్కీ, జున్నులు! 

chiranjeevi lakshmi sowbhagyavathi today episode సంయుక్త జున్ను తల్లే అని తనని కొన్ని టెస్ట్‌లు పెట్టి నిరూపిస్తానని లక్కీ జున్నుతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: జున్ను లక్కీ వాళ్ల ఇంటికి వెళ్తానని అల్లరి చేస్తాడు. అర్జున్‌ని తీసుకెళ్లనని చెప్తే వసుంధర అర్జున్ని ఒప్పిస్తుంది. జున్నుని తీసుకెళ్లి డ్రాప్ చేయమని లక్ష్మీ చూసుకుంటుందని చెప్తుంది. దీంతో అర్జున్ జున్నుని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. మరో వైపు మిత్ర ఇంట్లో సంయుక్త అలియాస్ లక్ష్మీ భోజనానికి కూర్చొంటుంది. అందరూ తింటుంటే లక్ష్మీ తినదు. ఎందుకు తినడం లేదని అరవింద అడిగితే ఇక్కడ ఫుడ్ నచ్చడం లేదని అంటుంది. ఒకసారి తినమని ఫుడ్ బాగుంటుందని అరవింద చెప్తే సంయుక్త తిని చాలా బాగుందని రోజూ ఇలాంటి ఫుడ్ తినాలనిపిస్తుందని అంటుంది. 

సంయుక్త: ఇంతకీ ఎవరు కుక్ చేశారు.
అరవింద: నేనే.
సంయుక్త: ఇంట్లో పని వాళ్లు ఉన్నా మీరు చేశారు అంటే గ్రేట్.
అరవింద: అన్ని సార్లు చేయనమ్మా అయినవాళ్లు అనిపిస్తే చేస్తాను. 
సంయుక్త: నేను మీకు  అయిన దానిలా అనిపిస్తున్నానా ఆంటీ.
అరవింద: నువ్వు మా కోడలిలా ఉన్నావని చెప్పా కదా అమ్మ. నిజానికి అయినదానివి అనే దాని కంటే మనసుకి చాలా దగ్గర దానివి అంటే బెటర్. 
సంయుక్త: మనసులో.. నా అత్తగారు నాతో ఎలా ఉండాలి అనుకున్నానో మీతో ఇప్పుడు అలా ఉంటాను. 
అరవింద: ఈ పాలకూర పప్పు వేసుకో మా కోడలికి ఇది చాలా ఇష్టం.
దేవయాని: అక్క నీ చాదస్తం కాకపోతే తను లక్ష్మీలా ఉంది అంటే తన అలవాట్లు ఉండాలి అని లేదు.
సంయుక్త: నాకు పాలకూర పప్పు అంటే ఇష్టం.

అరవింద భర్త తనతో ఎంతైనా తను మన కోడలు కాదు అంటే సంయుక్త తనని కోడలు అనుకోమని అంటుంది. తనని అవసరం అయితే లక్ష్మీ అని పిలవమని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మనీషా అయితే బిత్తర పోతుంది. సంయుక్తతో వాధిస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఇంత తేడాగా ఉందని దేవయానితో మనీషా అంటుంది. ఫుడ్ చాలా బాగుందని సంయుక్త అంటే అరవింద రోజూ మా ఇంటి నుంచే బాక్స్ ఇస్తా అంటుంది. సంయుక్త మీకు ఇబ్బంది ఎందుకు అంటే మనీషా అయితే ఈ ఇంట్లోనే ఉండిపో  అని వెటకారంగా అంటుంది. సంయుక్త ఇంట్లో ఉండిపోతా అంటుంది. అందరూ సంతోషిస్తారు. ఇక పీఏగా జాను జేఎమ్మార్‌ని అడగాలి అని అంటుంది. దాంతో సంయుక్త వెంటనే తన తండ్రి జేఎమ్మార్‌కి వీడియో కాల్ చేస్తుంది. జేఎమ్మార్‌తో  మాట్లాడి  మిత్ర ఇంట్లో ఉండిపోతా అని అంటుంది. జేఎమ్మార్‌ ఓకే చెప్తాడు. సంయుక్తకి కుటుంబాలు అంటే చాలా ఇష్టమని బంగ్లాలో ఒంటరిగా ఉండటం కంటే మీ ఇంట్లో ఉండటం మంచిదని వాళ్లకి అప్పగిస్తారు. ఇక ఇన్‌డైరెక్ట్‌గా ఆ ఇంటికి చేరావ్ నీ లక్ష్యాన్ని చేరుకో అని అంటారు. ఇక పీఏ నువ్వు నాకు ప్రతీ క్షణం అందుబాటులో ఉండాలి కాబట్టి నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండిపో అని సంయుక్త జానుతో చెప్తుంది. జాను సరే అంటుంది. దేవయాని కోపంతో రగిలిపోతుంది.

అర్జున్ జున్నుని తీసుకొని మీ ఇళ్లు వచ్చింది జున్ను అంటాడు. ఆ దేవుడు ముందు లక్ష్మీని ఈ ఇంటికి పంపాడని తర్వాత నిన్ను చేర్చుతాడని అనుకుంటాడు. ఇక జున్ను ప్రశ్నించడంతో లక్కీని చెల్లి అనుకుంటావ్ కాబట్టి అలా అంటున్నాను అంటాడు. ఇక సంయుక్త అమ్మలా ఉంది కాబట్టి పొరపాటున కూడా అమ్మ అని పిలవకూడదని అర్జున్ జున్నుతో చెప్తాడు. ఇద్దరూ ఇంటిలోపలికి వెళ్తారు. అర్జున్‌ని చూసి అరవింద, జయదేవ్ సంతోషపడతారు. మిత్ర నువ్వు ఉప్పు నిప్పుగా ఉంటారని అలాంటి నువ్వు ఏం పట్టించుకోకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అంటారు. ఇక మిత్ర కూడా అక్కడికి వస్తాడు. మిత్రను అర్జున్ నువ్వు ఎక్కడా తగ్గకు నువ్వు తగ్గితే నాకు టైం పాస్ అవ్వదు అంటాడు.

సంయుక్త, జాను కిందకి వస్తారు. సంయుక్తని చూసి జున్ను జున్నుని చూసి సంయుక్త ఎమోషనల్ అవుతారు. జాను అక్కని కంట్రోల్ చేస్తుంది. అర్జున్ సంయుక్తకి అపాయింట్ మెంట్ అడిగితే జాను చూసుకుంటుందని చెప్తుంది. ఇక మిత్ర కూడా సంయుక్తకి అపాయింట్ మెంట్ అడుగుతాడు. ఇక అర్జున్ వెళ్లిపోతాడు. జున్ను మిత్రకు లక్కీ గురించి అడుగుతాడు. మిత్ర, జానులు గిల్లిగజ్జాలు చూసి లక్ష్మీ మనసులో ఈ విధంగా అయినా తండ్రీ కొడుకులు కలిసి నందుకు సంతోషంగా ఉందని అనుకుంటుంది. జున్ను లక్కీ దగ్గరకు వెళ్లి మీ అమ్మ మా ఇంటికి వచ్చిందని అంటుంది. జున్ను తను మా అమ్మ కాదు అంటే లక్కీ మాత్రం తను మీ అమ్మే అని కావాలి అంటే టెస్ట్ చేద్దామని అంటుంది. జున్ను వద్దని లక్కీ వినదు. దేవయాని మనీషా వల్లే జాను కూడా ఇంట్లో ఉంటుందని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. తనకు జ్యోత్స్నకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందన్నాడేంటి? కుప్పకూలిపోయిన పారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget