Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 23rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా, అత్తల బాగోతం తెలుసుకున్న జాను.. లక్ష్మీకి కొత్త తలనొప్పులు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వీలునామా మనీషా కాల్చేసిందని జాను తెలుసుకొని సీరియస్ అవ్వడం వివేక్ వచ్చి వెటకారం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ లాయర్‌తో ఆస్తిని తనకు జానుకి సమానంగా పంచమని చెప్తుంది. మీ ఇద్దరే వారసులా ఇంకా ఎవరైనా ఉన్నారా అని లాయర్ అడుగుతాడు. దానికి వివేక్ తమ్ముడు ఉన్నాడని చెప్తాడు. లక్ష్మీ తన తమ్ముడికి ఆస్తి వద్దని తాను మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్తుంది. అలా కుదరదని రేపు ఎప్పుడైనా ఆయన కేసు పెడితే ప్రాబ్లమ్ అవుతుందని అంటారు. దానికి లక్ష్మీ తన తమ్ముడు చాలా మంచి వాడని అక్కల సంతోషమే వాడికి కావాలని ఆస్తులు అవసరం లేదని చెప్తుంది. ఆ మాటలకు జాను ఆలోచనలో పడుతుంది.
లక్ష్మీ: మా తాతయ్య కూడా ఆస్తులు మా ఇద్దరికే రాశారు. మగ పిల్లాడు ఎలా అయినా బతకుతాడు అని వాడికి ఏం రాయలేదు.
తాతగారు: అమ్మా లక్ష్మీ ఆస్తులకు మించిన చదువు గుణం నువ్వు వాడికి ఎప్పుడో ఇచ్చావ్ కదమ్మా వాడు నీ నుంచి ఇంకేం ఆశించడు లేమ్మా.
దేవయాని: హమ్మయ్యా ఆస్తిలో మరో వాటా పెరిగిపోతుందని అనుకున్నా కానీ ఏం లేదులే. పోయిన ముసలోడు మంచి పని చేశాడు.
లాయర్: ఓకే మేడం పంపకాలు చేసేటప్పుడు పాత వీలునామా ఒకసారి చూడాలి తీసుకురండి.
వీలునామా కనిపించడం లేదని తాతగారు చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇక లక్ష్మీ వీలునామా కనిపిస్తే పిలుస్తానని చెప్పి లాయర్‌ని పంపేస్తుంది. ఇక జాను మనీషా, దేవయానిలను వీలునామా ఏం చేశారని అడుగుతుంది. దాంతో మనీషా వీలునామా కాల్చేశామని నీ కోసమే ఇదంతా చేశామని అంటారు. ఇంతలో వివేక్ చప్పట్లు కొట్టుకొని వస్తాడు. మీ అందరికీ బాగా అయిందని మంచి పని జరిగిందని వివేక్ అంటాడు. జానుతో పాటు నువ్వు నష్టపోయావని మనీషా వివేక్‌తో అంటుంది. నా ఆస్తి మీదే నాకు ఆశ లేదు జాను ఆస్తి ఎందుకు అని అంటాడు. ఆస్తి కోసమే కదా ఇక్కడికి తీసుకొచ్చావ్ అని దేవయాని అంటే దానికి వివేక్ మిమల్ని రప్పించడానికే అలా గేలం వేశానని అంటాడు. జాను వివేక్‌తో ఇక మనకు ఆ ఫ్యాక్టరీనే గతి అని అంటుంది. వివేక్ జానుతో మీ అక్క మంచితనం తెలిసి కూడా వీళ్లతో ఉంటే ఇక నీ ఇష్టమని అంటాడు.
మరోవైపు పిల్లలు మిత్ర, వివేక్‌లతో ఊరు చూడాలని ఉందని తీసుకెళ్లమని చెప్తారు. ఇప్పుడే చూడాలని మారాం చేస్తారు. దాంతో లక్ష్మీ ఇప్పుడే వెళ్దామని అంటుంది. పిల్లలు టాక్టర్‌లో వెళ్దామని అంటారు. డ్రైవింగ్ నా వల్ల కాదని మిత్ర లక్ష్మీ తాను డ్రైవింగ్ చేస్తానని అంటుంది. ఊరు చూడటానికి వెళ్తానని లక్ష్మీ తాతయ్యతో అంటే పెద్దాయన కంగారు పడి ఇప్పుడు వద్దమ్మా అని ఆపాలని చూస్తారు. కానీ లక్ష్మీ వినకుండా తీసుకెళ్తుంది. తాతగారు మనసులో లక్ష్మీ ఊరిలోకి వెళ్తుంది ఏం జరుగుతుందో అని అనుకుంటారు. మనీషా, దేవయానిలు వెళ్లి ఏమైందని పెద్దాయన్ని అడుగుతారు.
దాంతో ఫ్యాక్టరీ కట్టడానికి కొందరు ఇబ్బంది పెడుతున్నారని ఊరి జనాలను కొనేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మీకి విషయం తెలిస్తే ఊరుకోదని ఊరు బాగు పడటానికి లక్ష్మీ చాలా చేసిందని చెప్తారు. పక్క ఊరిని వాళ్లు ఖాళీ చేయిస్తే లక్ష్మీ ఊరుకోదని వాళ్లకి లక్ష్మీ ఎదురు వెళ్తుంటే కంగారుగా ఉందని చెప్తారు. ఇక లక్ష్మీ ట్రాక్టర్ మీద వెళ్తూ ఇద్దరు దంపతుల్ని కలిసి పెద్దమ్మా పెద్దనాన్న అని పిలిచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దాంతో వారు ఊరు ఖాళీ చేయిస్తున్నారని ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని చెప్తారు. లక్ష్మీని ఓ వ్యక్తిని చూపిస్తే లక్ష్మీ అతన్ని కొట్టి వార్నింగ్ ఇస్తుంది. రౌడీలు ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న వ్యక్తికి విషయం చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!





















