నెలసరి సమయంలో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల నొప్పితో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయట.

కొందరు ప్యాడ్​, టాంపోన్స్​, పీరియడ్ కప్స్​ని ఎక్కువసేపు ఉంచేస్తారు. అది మంచిది కాదట.

4 నుంచి 8 గంటలు దాటితే బ్యాక్టీరియల్ గ్రోత్​తో పాటు.. దుర్వాసన వచ్చే అవకాశముందని చెప్తున్నారు.

ప్యాడ్స్​ని ఉపయోగించే ముందు, ఉపయోగించిన తర్వాత కూడా సోప్​తో వాటర్​తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

పీరియడ్స్ సమయంలో యోనిని సెంటెడ్ సోప్స్​తో క్లీన్ చేయకూడదు. బబుల్ బాత్స్ వంటివి యోని ఇన్​ఫెక్షన్లను పెంచుతాయి.

క్రాంప్స్ ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. తగ్గిపోతుందిలే అని ఇగ్నోర్ చేయకూడదు.

పీరియడ్స్ సైకిల్​ని ట్రాక్ చేయాలి. రెగ్యులర్​గా వస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. దీనివల్ల ఫెర్టిలిటీ సమస్యలు దూరం చేసుకోవచ్చు.

బ్లీడింగ్ నార్మల్​గా కంటే ఎక్కువ అవుతున్నా.. ఎక్కువ రోజులు అవుతున్నా కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

పీరియడ్స్ సమయంలో చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే హైడ్రేటెడ్​గా ఉండకపోవడం. ఇది కడుపునొప్పితో పాటు ఉబ్బరాన్ని పెంచుతుంది.

మంచి నిద్ర ఉండాలి. కనీసం 7 నుంచి 9 గంటలు పడుకుంటే పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.