Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా ఫేక్ ప్రెగ్నెన్సీ బయట పడుతుందా.. వివేక్‌ని మరో పెళ్లి చేసుకోమన్న జాను!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా అంతు చూడాలని లక్ష్మీ హాస్పిటల్‌కి తీసుకెళ్లడం మనీషా చాలా టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు మనీషాని తీసుకెళ్తారు. మనీషాకి లక్ష్మీ కావాలనే జాగ్రత్తలు చెప్తుంది. తనని విసిగించొద్దని మనీషా అంటే మిత్ర లక్ష్మీ చెప్పేది వినమని చెప్తాడు. లక్ష్మీ తనని టార్చర్ చేస్తుందని మనీషా అనుకుంటుంది. హాస్పిటల్‌లో చూపించిన తర్వాత మనీషా నువ్వు మాతోనే వస్తావా అని లక్ష్మీ అంటే మనీషా మనసులో నాది ఫేక్ ప్రెగ్నెంట్ అని నిరూపించి నన్ను తరిమేయాలని అనుకుంటుందని మనీషా అనుకుంటుంది.
దేవయాని డాక్టర్‌ని కలుస్తుంది. జాను, వివేక్‌లు నిన్న చూపించుకున్నారని రిపోర్ట్స్ డాక్టర్‌కి ఇచ్చి చూడమంటుంది. డాక్టర్ రిపోర్ట్ చూసి ఇవి తాను ఇచ్చినవి కాదని మారిపోయినట్లున్నాయని అనుకుంటుంది. స్టాఫ్‌కి కాల్ చేసి స్పేర్ రిపోర్ట్స్ తీసుకురమ్మని అంటుంది. మరోవైపు వివేక్ జాను గదిలోకి ఎవరో వచ్చారని చెప్పడం గుర్తు చేసుకొని రిపోర్ట్స్ కోసం వెతుకుతాడు. అవి లేకపోవడంతో తల్లి తీసుకొని వెళ్లిందని అనుకుంటాడు. వెంటనే డాక్టర్‌కి కాల్ చేసి తన గురించి చెప్పి తన తల్లి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేస్తుందని తనకు నిజం తెలీకుండా చూసుకోమని చెప్తాడు. డాక్టర్ సరే అంటాడు. డాక్టర్ వెంటనే లేడీ డాక్టర్‌కి కాల్ చేసి దేవయానికి నిజం చెప్పొద్దని అంటే డాక్టర్ దేవయానితో రిపోర్స్ నిజమే అని వివేక్‌కే ప్రాబ్లమ్ అని చెప్తారు. దేవయాని అనవసరంగా కొడుకుని అనుమానించానని అనుకుంటుంది.
మరోవైపు వివేక్ దగ్గరకు జాను వెళ్తుంది. వివేక్ జాను మీద అరిస్తే ఆ ప్రాబ్లమ్ నాకు ఉండంటే బాగున్ను మీరు నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే వారు అని ఏడుస్తుంది. వివేక్ జానుతో అలా అనొద్దని హగ్ చేసుకొని నా ప్రాణం పోయినా నిన్ను వదలను జాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని ప్రామిస్ చేస్తాడు. మిత్ర వాళ్లు హాస్పిటల్‌కి వెళ్తారు. మనీషాకి దేవయాని కాల్ చేస్తుంది. దేవయాని మనీషాతో వివేక్‌కే ప్రాబ్లమ్ ఉందని అంటుంది. మీ కొడుకుకి ప్రాబ్లమ్ అంటే మీరు నమ్ముతారా అని మనీషా అడుగుతుంది. ఇంతలో మిత్ర పిలవడంతో మళ్లీ కాల్ చేస్తానని అంటాడు.
ఓపీ తీసుకొవడానికి వెళ్లి మనీషా పేరు చెప్పి భర్త పేరు అడిగితే మిత్ర పేరు మనీషా చెప్పబోతే లక్ష్మీ ఆపుతుంది. ఇక మనీషా మిత్ర పక్కనే కూర్చొంటుంది. లక్ష్మీని చూసి మిత్ర పక్కనే కూర్చొన్నా అని కళ్లెగరేస్తుంది. లక్ష్మీ మనీషా దగ్గరకు వెళ్లి కాసేపట్లో నీ బంఢారం బయట పడుతుందని అంటుంది. ఇక జాను రెడీ అవుతుంటే పూసల దండ పడిపోతుంది. దాని కోసం తీయగా ట్యాబ్లెట్ కింద పడటం జాను చూసి వివేక్‌కి ప్రశ్నిస్తుంది. ఇక వివేక్ కవర్ చేస్తాడు. దేవయాని రిపోర్ట్స్ తీసుకొని వివేక్‌కి ఇచ్చి కింద పడితే తీసుకొచ్చానని అంటుంది.
మరోవైపు మనీషా డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. ప్రెగ్నెంట్ అని నిన్నే తెలిసిందని ఓ డాక్టర్ ఇంటికి వచ్చి చెప్పారని అంటుంది. ఇక డాక్టర్ మనీషా చేయి పట్టుకొని చూసి హార్ట్ బీట్ చూస్తుంది. మనీషా చాలా టెన్షన్ పడుతుంది. మీరు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఎవరు అని అడుగుతారు ఫ్యామిలీ డాక్టర్. దాంతో లక్ష్మీ తన ఫ్యామిలీ డాక్టర్ రమాదేవి అని అంటుంది. కొన్ని టెస్ట్‌లు చేయాలని మిత్ర, లక్ష్మీలను డాక్టర్ బయటకు పంపుతుంది. మనీషా ఆ డాక్టర్‌తో నేను ప్రెగ్నెంట్ కాదు మా వాళ్లకి అది తెలీకూడదని చెప్తుంది. ఇక మిత్ర లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. ఈ టైంలో సాయంగా ఉన్నావని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కోసం గడప దాటిన త్రిపుర.. ఫణి పేరున రిజిస్ట్రేషన్ ఆపుతుందా!!





















