Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 14th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, మనీషాల పెళ్లికి గుడిలో ఏర్పాట్లు.. జాను మాటలు కొట్టి పడేసిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, మనీషా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని పనామె లక్ష్మీకి కాల్ చేసి చెప్పాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, మనీషాలు కారులో గుడికి వెళ్తుంటారు. ఇంతలో మిత్ర ఫోన్‌కి సరయు పీఏ కాల్ చేసి తాను మనీషా అంకుల్ అని చెప్తాడు. అమెరికా వస్తా అన్నావ్ పాస్ పోర్ట్ అవి పంపాను పెళ్లి వాళ్లు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారని కావాలనే మాట్లాడుతాడు. మిత్ర నిన్ను మోసం చేశాడు నిన్ను పెళ్లి చేసుకోడు అమెరికా వచ్చేయ్ అని అంటాడు. మనీషా కావాలనే అంకుల్ మీరు నాకు ఇంకెప్పుడు కాల్ చేయొద్దని కావాలనే సీరియస్ అయినట్లు కాల్ కట్ చేస్తుంది. ఆ మాటలు విన్న మిత్ర చాలా బాధ పడతాడు.
మిత్ర మనీషాతో నా వల్ల చాలా బాధ పడ్డావు మనీషా నా కోసం చాలా ఎదురు చూశావు అంటాడు. ఒక వైపు లక్ష్మీ మరోవైపు నువ్వు ఇద్దరినీ ఇబ్బంది పెడుతున్నానని అంటాడు. ఇక సరయు రాజుతో అమెరికా అంకుల్‌గా భలే మాట్లాడారు రాజు గారు అని అంటుంది. ఇక దేవయాని కిచెన్‌లో వంట చేస్తే రాజేశ్వరి దేవి చూసి జానుని పిలిచి చలికాలంలో వర్షాలు పడతాయి అని అంటుంది. మీ అత్త వంట చేస్తుందని అంటే జాను వెళ్లి అడుగుతుంది. దేవయాని స్వీట్ చేస్తుంది. ఆ విషయం చెప్తే జాను షాక్ అయిపోతుంది. ఇప్పుడు రవ్వలడ్డు ఎందుకు అని అంటుంది. దేవయాని జానుని పంపేస్తుంది. జాను ఆ విషయం రాజేశ్వరిదేవికి చెప్తే దానికి రాజేశ్వరి దేవి నందన్ వంశంలో పెళ్లి చేసుకొని వచ్చిన కొత్తి కోడలికి రవ్వలడ్డు తినిపిస్తారని అంటుది.
జాను: అంటే మనీషా..
రాజేశ్వరిదేవి: నాకు అదే అనుమానంగా ఉందే.
జాను: వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. అక్క ఇంట్లో దేవయాని అక్క ఇంట్లో రవ్వలడ్డు చేస్తుంది.
రాజేశ్వరిదేవి: అమ్మా లక్ష్మీ మన వంశంలో కొత్తగా వచ్చిన కోడలికి రవ్వలడ్డు పెట్టడం ఆనవాయితీ.
జాను: అంటే అక్క మనీషా బావగారిని గుడిలో పెళ్లి చేసుకుంటుందేమో.
లక్ష్మీ: అలా ఎలా చేసుకుంటుంది నువ్వు నీ అనుమానం ఆయన మీద నాకు నమ్మకం ఉంది.
జాను: మనీషా మీద నాకు నమ్మకం లేదు అక్క.
రాజేశ్వరిదేవి: వాడు అమాయకుడే ఏదో ఒకటి చేయే.
లక్ష్మీ: ఆయన నాకు అన్యాయం చేయరు పెద్దమ్మ నేను ఉంటాను.
వివేక్: ఒకసారి మీరు గుడికి వెళ్లొచ్చు కదా వదినా. అత్తయ్య, జానుల అనుమానంలో నిజం ఉంది. అన్నయ్య మీద మనీషా ఒత్తిడి తీసుకురాగలదు. ఇప్పుడు ఆలస్యం చేస్తే లైఫ్ లాంగ్ బాధపడాలి. ఒక్క సారి ఆలోచించు.
సరయు వాళ్లు గుడికి వచ్చి ఓ రెండు జంటలను తీసుకొచ్చి పంతులుకి 3 మంగళ సూత్రాలు ఇచ్చి ఈ రెండు జంటలతో పాటు మరో జంటకు పెళ్లి చేయాలని అంటుంది. మంచి ముహూర్తం ఉందని పంతులు అంటారు. ఇక మనీషా, మిత్ర గుడికి చేరుకుంటాడు. మిత్ర రాను అంటే మనీషా మిత్ర చేయి పట్టుకొని గుడికి తీసుకెళ్తుంది. మనీషా సరయులతో మాట్లాడుతుంది. అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయా అని కనుక్కుంటుంది. ఇక అక్కడ గుడి తుడుస్తున్న ఓ పనావిడ మిత్రను గుర్తిస్తుంది. గతంలో లక్ష్మీ ఆమె కళ్లు తిరిగి పడిపోతే సాయం చేస్తుంది. దాంతో ఆవిడ లక్ష్మీని గుర్తిస్తుంది.
ఇక దేవయాని సరయుకి కాల్ చేసి మనీషా పెళ్లి అయిపోయిందా అని అంటుంది. దేవయాని మనీషాతో మాట్లాడుతుంది. మీ జంట కోసం ఎదురు చూస్తున్నా అని స్వీట్ చేశానని అంటుంది. ఎక్కువ హడావుడి చేయొద్దని మనీషా అంటుంది. పనామె లక్ష్మీకి విషయం చెప్పాలని గుడిలో ఓ అధికారికి లక్ష్మీ నెంబరు అడుగుతుంది. ఆయన లక్ష్మీకి కాల్ చేస్తారు. సరయు, రాజులు మనీషా, మిత్రల దగ్గరకు వెళ్తాడు. రాజు కావాలనే సరయుతో మొన్న మనీషా, మిత్రలకు ఫస్ట్‌నైట్ అయిందని అంటాడు. మిత్ర కోపంగా రాజు కాలర్ పట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

